‘స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పడానికి నీ హక్కును కాపాడటానికి నా ప్రాణాలైనా ధార పోస్తా’ అన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త వాల్తేర్. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాకు ఉన్న ప్రాధాన్యం అంతటిది. అటువంటి మీడియాపై ఉక్కుపాదం మోపి నేడు జగన్‌రెడ్డి పత్రి కా స్వేచ్ఛ అంటూ ఆయన నీతి సూక్తులు వల్లించడం హాస్యాస్పదం. ఐదేళ్ల అరాచక పాలన లో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించి వేసి జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపాడు. పత్రికా యాజమాన్యాలపై అక్రమ కేసులు, జర్నలిస్టులపై హత్యలు, దాడులు వంటి ఘటనలు కోకొల్లలు. తన పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ అక్రమాలు, అరాచకాలను గొంతెత్తి ప్రశ్నిస్తున్న పత్రికలపై జీవో 2430 తెచ్చి ఉక్కుపాదం మోపారు. తన అవినీతి పుత్రిక సాక్షి కోసం ఇతర పత్రికలను ఐదేళ్లు అణగదొక్కిన జగన్‌రెడ్డి నేడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లా డుతుంటే హాస్యాస్పదంగా ఉంది. సొంత పత్రిక సాక్షిలో నేడు పత్రికా స్వేచ్ఛ గురించి చెబు తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పదేపదే దుష్టచతు ష్టయం అంటూ మీడియా యాజమాన్యాలను దుమ్మెత్తి పోస్తూ విషప్రచారం చేశారు. ఈటీ వీ, ఏబీఎన్, టీవీ 5 చానళ్ల ప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వకుండా అంక్షలు విధించి మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించాడు. అలాంటి వ్యక్తికి నేడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా?
2430 జీవోతో మీడియా గొంతు నొక్కలేదా?
పత్రికలు, మీడియా చానళ్లపై ఉక్కుపాదం మోపేందుకు వైఎస్‌ఆర్ 2007 ఫిబ్రవరి 27న జీవో నెం.938ని తెచ్చాడు. తండ్రి వారసత్వానికి కొనసాగింపుగా అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి 2019 అక్టోబర్ 20న జీవో 2430 తీసుకొచ్చి మీడియా గొంతు నొక్కా డు. ఈ జీవో అడ్డుపెట్టుకుని ఏబీఎన్, టీవీ 5, ఈటీవీ చానళ్ల ప్రసారాలు నిలిపేయాలంటూ వైకాపా నాయకులు ఎమ్‌ఎస్‌వోల మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చారు. మరి అప్పుడు మీడి యా హక్కులు జగన్‌రెడ్డికి గుర్తుకురాలేదా? వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రశ్నించడమే నేరంగా భావించి కక్షతో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీవీ 5 బీ.ఆర్.నాయుడు, సాంబశివరావు, మూర్తి లాంటి సీనియర్ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి ఉక్కు పాదం మోపినప్పుడు మీడియా స్వేచ్ఛ ఏమైంది?
జర్నలిస్టులపై దాడుల్లో నెంబర్‌వన్
వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను వెలికితీస్తున్నారన్న అక్కసుతో జర్నలిస్టులపై వేధిం పులకు దిగి అక్రమ కేసులు పెట్టించి జగన్మోహన్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందారు. వైసీపీ పాలనలో పత్రికా కార్యాలయాలపై దాడులు, జర్నలిస్టులపై వేధింపుల్లో ఏపీ ప్రథమ స్థానం లో నిలిచింది. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ, కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక వర్గంలో మద్దికెర గ్రామంలో హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవానికి వెళ్లిన వీరశేఖర్‌పై, కర్నూలు జిల్లాలో ఈనాడు కార్యాలయాలపై దాడులకు పాల్పడిన వైసీపీ అల్లరిమూకలు నేడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడం సిగ్గుచేటు. తునిలో ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్య. కోనసీమ లోని ఐ పోలవరం ప్రజాశక్తి విలేకరిపై వైసీపీ కార్యకర్తల దాడి, నరసన్న పేట విశాలాంధ్ర విలేకరిపై దాడి వైసీపీ పాలనలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది. సుప్రీంకోర్టు తప్పుబట్టినా సెక్షన్ 124ఏ కింద జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు పెట్టి వేధించారు. జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు వైసీపీ పాలనలో ఏపీలోనే అత్యధికంగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 79 నమోదైతే ఒక్క ఏపీలోనే 29 దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. మరి అప్పుడు పత్రికా స్వేచ్ఛ జగన్మోహన్‌రెడ్డికి గుర్తు రాలేదా?
సొంత పత్రికకు రూ.1,600 కోట్లు దోచిపెట్టాడు
వైసీపీ ప్రభుత్వంలో ఐ డ్రీమ్ యూట్యూబ్ చానల్ యజమాని చిన్న వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించి రూ.120 కోట్లు దోచుకున్నారు. సాక్షికి ప్రకట నల రూపంలో రూ.1,600 కోట్లు ప్రజా సొమ్మును కొల్లగొట్టాడు. ఒక్కో సచివాలయానికి రెండు చొప్పున ఐదేళ్లు 5 లక్షల సాక్షి పేపర్లను బలవంతంగా వేయించి ఆ డబ్బును మెక్కి ప్రజాధనాన్ని దోచేశాడు.
ప్రభుత్వంపై సాక్షిలో విషపు రాతలు
సాక్షి పత్రికను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై విషపు రాతలు రాయిస్తూ విషప్రచారం మొదలు పెట్టాడు. అమరావతిలో రూ.6 లక్షల కోట్లు దోచుకున్నారని చంద్రబాబుపై అబద్ధపు కథనాలు, 2019 అక్టోబర్ 22న ‘‘చిన్నబాబు చిరుతిండి లక్షా 25 వేలు’’ అంటూ లోకేష్ క్యారెక్టర్‌ను దెబ్బతిసే విధంగా రోత రాతలు రాయించి బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాగే విజయవాడ వరదసాయం రూ.203 కోట్లు ఖర్చు చేస్తే రూ.534 కోట్లు బొక్కేశారని ప్రజలను మభ్యపెట్టేందుకు తప్పుడు ప్రచారం చేశారు. పత్రికా స్వేచ్ఛను దెబ్బ తీయడమే కాక ప్రజాపక్షాన గొంతెత్తి ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపి అణచి వేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పత్రికలకు స్వేచ్ఛ వచ్చింది. రాష్టం లో అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు హెల్త్ స్కీం పథకం ద్వారా రూ.2 లక్షల వరకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంది. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి పనిచే స్తోంది.
`
మంగినపల్లి ఎలీషాబాబు, అనలిస్ట్