- ప్రజలు ఛీకొట్టినా బుద్ధి మార్చుకోలేదు
- ఐదేళ్లు రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేశారు
- ఫేక్ ప్రచారాలతో విగ్రహ రాజకీయాలు సిగ్గుచేటు
- స్మృతివనంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు
- మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
మంగళగిరి(చైతన్యరథం): ప్రజలు ఛీకొట్టినా జగన్ తీరులో ఏ మాత్రం మార్పు లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఇప్పటికీ వైసీపీ నేతలు ఫేక్ రాజకీయాలనే నమ్ముకుని పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ నాయకుడైనా ఓటమి తరువాత తనలో మార్పు తెచ్చుకుని బుద్ధిగా మసులుకుంటారని, కానీ జగన్‌రెడ్డి ప్రజల కోసం పనిచేయడానికి కాస్త కూడా ఆలోచన చేయడం లేదన్నారు. ఆస్కా ర్ అవార్డులకు సరిపోయే అద్భుతమైన నటులు వైసీపీలో ఉన్నారు.
వారంరోజుల నుంచి విజయవాడలో అంబేద్కర్ విగ్రహం గురించి గుండెలు బాదుకుంటున్నారు. విగ్రహం పగలగొట్టారని..అంబేద్కర్ పేరు తీసేశారంటూ చేస్తున్న ఫేక్ ప్రచారాలను మానుకోవాలని హితవుపలికారు. అంబేద్కర్ పేరును రాజకీయానికి వాడుకోవడం సిగ్గుచేటన్నారు. అంబే ద్కర్ విగ్రహానికి వైసీపీ రంగులేసినప్పుడు వైసీపీ నాయకులు ఏమయ్యారు? అమలాపురం, పిఠాపురం, అనంతపురంలలో అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఏమయ్యారు? అని ప్రశ్నించారు.
అంబేద్కర్ పేరు తీసేస్తే నోరు మెదిపారా?
అంబేద్కర్‌కు వారసులమైనట్లు మాట్లాడుతున్న వైసీపీ నేతలు దళితులకు సంబంధించిన 27 పథకాలు అడ్డగోలుగా రద్దు చేశారన్నారు. చంద్రబాబు విదేశీ విద్య పథకానికి అంబే ద్కర్ పేరు తీసి జగన్‌రెడ్డి పేరు పెట్టుకుంటే ఒక్క నాయకుడు కూడా నోరు మెదపలేదని మండిపడ్డారు. దళితులకు మాత్రమే చెందాల్సిన సబ్‌ప్లాన్ నిధులు 45 వేల కోట్ల రూపాయ లు అడ్డగోలుగా దారి మళ్లిస్తే నోరు మెదిపారా అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిట్టనిలువునా తగలెట్టి అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కారన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే విగ్రహం కింద మధ్యలో బోల్డ్ లెటర్స్‌లో అంబేద్కర్ పేరు పెద్దదిగా ఉండాలి..కానీ అంబేద్కర్ పేరు చివరన చిన్నదిగా పెట్టి జగన్‌రెడ్డి పేరేమో పెద్దదిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
అది నచ్చని అంబేద్కర్ అభిమానులు జగన్ పేరును తీసేశారని, ఆ ఘటనతో పార్టీకి, ప్రభుత్వాని కి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ పని చేసిన వారిని మనస్ఫూర్తిగా అభినందించొచ్చ ని తెలిపారు. జగన్ అంబేద్కర్ కంటే గొప్పవాడా? వారంరోజుల నుంచి ఒక్కొక్కడు నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. స్మృతివనం నిర్మాణం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి విగ్రహం, మ్యూజియం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తే వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేసి స్మృతివనం ప్రాంతాన్ని పాడుబెట్టారని ధ్వజమెత్తారు. ప్రజలిచ్చిన తీర్పు ను చూసైనా వైసీపీ నాయకులు మారాలని హితవుపలికారు.
ఐదేళ్లు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు
సామాజిక న్యాయం కోరుకునే పార్టీ టీడీపీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది.. జగన్ ఐదేళ్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మీరు చేసిందేంటి? దళితులు, గిరిజను లు, మైనార్టీలను అణగదొక్కి అన్ని వర్గాలను దోచుకున్నారని మండిపడ్డారు. అందుకే ప్రజలు ఓడగొట్టారు.. రాజకీయ జీవితంలో మనగలిగే అర్హత వైసీపీకి లేదన్నారు. గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఆరేడు అడుగులు ఉండేవని, ఆయన విగ్రహాల పక్కన రాజశేఖర్ రెడ్డి పదడుగుల విగ్రహాలు ఏర్పాటు చేశారు.. అంబేద్కర్ కంటే రాజశేఖర్‌రెడ్డి గొప్పవాడిగా ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ రంగులేసి అడుగడుగునా అవమానపరిస్తే ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఏ ఒక్కరూ నోరు మెదపలేదన్నారు.
చెంపపెట్టులాంటి తీర్పునిస్తే దాని నుంచి జీర్ణించుకోలేకపోతున్నారన్నాని, కుల, వర్గ, విగ్రహ రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇక మీ పప్పులు ఉడకవు…ఇకనైనా మారి ప్రజల్లోకి వెళ్లి తప్పులు సరిదిద్దుకోవాలని హితవు పలికారు. వైసీపీ అంబేద్కర్‌కు చేసిన అవమానాన్ని సరిచేసే పనిలో టీడీపీ ఉందని, అంబేద్క ర్‌కు నిజమైన నివాళులు, గౌరవం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తుం దన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలుంటాయని, స్మృతివనం విషయంలో చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.