అమరావతి: వైకాపా నెత్తుటి దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పల్నాడు జిల్లా గుర జాల నియోజకవర్గం కొత్తఅంబా పురంలో టీడీపీనేత పత్తి రామారావు ను వైకాపా రౌడీ మూక దారుణంగా హత్య చేసిందన్నారు. వివాద రహితు డైన రామారావును హత్యచేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండిరచారు. పల్నా డును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్‌రెడ్డీ అని మండిపడ్డారు. వైకాపాకు రోజులు దగ్గరపడే టీడీపీ కార్యకర్తలపై రోజుకో దాడి చేస్తూ, హత్యలకు పాల్పడుతోంది. రామారావు హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామారావు కుటుంబానికి టీడీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.