- వైసిపి ముష్కరమూకలపై ఇప్పటికీ చర్యలు నిల్
- ఎన్టీఆర్ భవన్‌లో రక్తం చిందిన చీకటిరోజు
అమరావతి :సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లంటూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీని స్థాపించి 40 ఏళ్లు పూర్తి కావస్తోంది. పార్టీ 40వ ఆవిర్భావ వేడు కలను ఘనంగా జరుపుకోవడానికి యావత్ తెలుగు దేశం పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో సరిగ్గా ఏడాది క్రితం(19-10-2021)మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసిపి ముష్కరమూకలు దాడికి తెగబడ్డాయి. గంజాయి, మత్తుపదార్థాలపై అధి నేత చంద్రబాబునాయుడు నేతృత్వంలోపోరాటం సాగి స్తున్న వేళ తమ బండారం బయట పడుతోందన్న అక్కసుతో వైసిపి మూకలు పార్టీ కార్యాలయంపై ఆ రోజు దాడులకు తెగబడ్డాయి. అత్యంత క్రమశిక్షణ తో ప్రజాస్వామ్య పద్ధతిలో పోరుసాగిస్తున్న టిడిపి కేడర్ పై ఒక్కసారిగా దాడులకు వైసిపి సైకో మూకలు దాడు లకు తెగబడ్డాయి. ఈ సంఘటనలో పలువురు టిడిపి నేతలు, కార్యాలయ సిబ్బంది రక్తం చిందించారు. విజయవాడ,గుంటూరు ప్రాంతాలకు చెందిన కొంద రు వైసిపి నేతలను గుర్తించి పోలీసులకు తెలియ పర్చినా ఇప్పటివరకు సంబంధిత వ్యక్తులపై చర్యలు లేవు. పైగా పార్టీ కార్యాలయంలో పనిచేసే నేతలపై ఎదురు కేసులు పెట్టారు. ఆ చీకటి రోజుకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో యాద్ధృచ్చికంగా సైకో ప్రభు త్వంపై ఉమ్మడిగా పోరాడాలని తెలుగుదేశం, జనసేన అధినేతలు నిర్ణయించుకోవడం శుభపరిణామం. అధినేత చంద్రన్న పిలుపునందుకొని ప్రజాస్వామ్య పరి రక్షణ పోరాటానికి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ సంసిద్ధంగా ఉంది.