- ఆంధ్రుల ఆవేదన గళం.. ప్రజా గళం
- వైసీపీ పాలనలో ఇబ్బందిపడిన అన్ని వర్గాలూ సభకు తరలిరావాలి
- మూడు పార్టీలదీ విజయవంతమైన కలయిక
- రాష్ట్రం కోసం పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి
- వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దగ్గర్లోనే ఉంది
- ప్రజాగళం సభ సమన్వయ సమావేశంలో కూటమి నేతల స్పష్టీకరణ
చిలకలూరిపేట(చైతన్యరథం): గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గుర్తులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిద్ర లేని రాత్రుళ్లు మిగిల్చా యి.. కనీసం పాలన తీరుపై మాట్లాడనీయకుండా, స్వేచ్ఛను హరించేలా వైసీపీ పాలన సాగింది.. అన్ని వర్గాలూ వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డాయి.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ పాలన నుంచి విముక్తం చేయాలనే లక్ష్యంతోనే పొత్తులు ఏర్పడ్డాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆదివారం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించబోయే ప్రజాగళం బహిరంగ సభ సమన్వయంపై శనివారం మూడు పార్టీల ముఖ్య నాయకులు సమావేశం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడు తూ అధికారం కోసమో, పదవుల కోసమో పొత్తులు గతంలో పెట్టుకోవడం చూశాం. ఈ మూడు పార్టీల పొత్తు మాత్రం రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉన్నతమైన లక్ష్యం తో, రాష్ట్రాన్ని పునర్నిర్మించు కోవాలంటే అంతా కలిసి పనిచేయాలనే తపనతోనే ఏర్పడిరది.
ఇది ప్రజలు కుదిరించిన పొత్తు. దీనికి ప్రజా మద్దతు ఉంది. ఇక మూడు పార్టీల వారూ పొత్తు గెలుపు కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. కచ్చితంగా వచ్చే ఎన్నిక ల్లో అధికార పార్టీకి బలంగా జవాబు చెప్పడానికి ప్రజాగళం సభ నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తు న్నాం. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నభూతో అన్నట్లు మిగిలిపోతుంది. రాష్ట్రానికి పట్టిన జగన్ శని వదిలిపోతుంది. అందరికీ స్వేచ్ఛ వస్తుంది. ప్రజాగళం సభను విజయవంతం చేయడానికి మూడు పార్టీలు సమష్టిగా కష్టపడి పని చేయాలన్నారు.
చరిత్రలో నిలిచిపోతుంది: నాదెండ్ల
అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలంతా పడిన ఆవేదనలను బలంగా వినిపించే గళంగా ప్రజాగళం బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్ని వర్గాల్లో గూడు కట్టుకున్న ప్రజా వ్యతిరేకతను ఈ సభ ద్వారా తెలియజేస్తా మన్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన మూడు పార్టీల కాంబినేషన్ మరోసారి రాష్ట్ర భవిష్యత్తు కోసం పునరావృతమయింది. కచ్చితంగా భారీ విజయం సాధించబోతున్నాం. రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి సాధనే ధ్యేయంగా వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించి తీరుతాం. ప్రజా గళం సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రాష్ట్ర భవితకు దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే సభకుఅన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పలు కమిటీలతో ఎక్కడా ఇబ్బంది లేకుండా సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు పార్టీల నాయకులు చక్కగా సభ విజయవంతానికి తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభను విజయవంతం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం.
విధ్వంసకర వైసీపీ పాలనకు చరమగీతం పాడుదాం: వినోద్ తావడే
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడేమాట్లాడుతూ ్ష్షఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోయే మొదటి సభగా ప్రజాగళం సభ నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నాశనం చేసిన వైసీపీ పాలనకు అంతా కలిపి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. అవినీతితో నిండిన వైసీపీ పాలనకు ఈ సభతో ఫుల్ స్టాప్ పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయాల్లో చైతన్యవంతులు. వైసీపీ అయిదేళ్ల పాలన చూసిన తర్వాత వారు వచ్చే ఎన్నికల్లో తగిన నిర్ణయం వెలువరిస్తారు. రాష్ట్ర భవిష్యత్తును బంగారంగా చేసేందుకు మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పనిచేయడం సంతోషం. పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని, ప్రజాగళం సభను విజయవంతం చేదామన్నారు.
ప్రజాగళం సభ ఎన్నికల సన్నద్ధ సభ: పురందేశ్వరి
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో ఏర్పడిన ప్రజా పొత్తు ఇది. దీన్ని రాష్ట్ర ప్రజలంతా ఆశీర్వదించాలి. మూడు పార్టీల కలయిక తర్వాత నిర్వహించబోయే భారీ సభకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు తరలి రానున్న నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి దిశానిర్దేశం చేస్తారు. అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడి పోయిన ఆంధ్రప్రదేశ్ కు తగిన విధంగా చేయూతనిచ్చి మూడు పార్టీలు ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నాయి. ప్రజాగళం సభ ఎన్నికలకు సన్నద్ధ సభగా భావించాలి. మూడు పార్టీల నాయకులు, కారకర్తలు పూర్తి సమన్వయంగా సభను విజయవంతం చేయాలి. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు మూడు పార్టీలు వేసే తొలి అడుగుగా భావిస్తున్నామన్నారు.