అమరావతి: మొన్న అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య అని పెట్టి ఆ మహనీయుని అవమానించారు, నేడు ప్రజానేత ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించి యావత్ తెలుగుజాతిని అవమానించారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రామయ్య స్పందిస్తూ.. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మహనీయుడు ఎన్టీఆర్ పేరు తొలగించి తన వైఎస్సార్ పేరు పెట్టుకోవడం దుర్మార్గం. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు. లేదంటే మీ ప్రభుత్వం ప్రజాగ్రహ జ్వాలల్లో తగలబడిపోవడం ఖాయమని రామయ్య పేర్కొన్నారు.