విశాఖపట్నం(చైతన్యరథం): విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడే బాధ్యత తమదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరానికి శనివారం విశాఖ ఎంపీ శ్రీభరత్‌తో కలిసి వెళ్లిన పల్లా శ్రీనివాస్ వారికి సంఫీుభావం తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షిస్తాం.. లేదంటే పదవులకు రాజీనామా చేసి మీతో కలిసి దీక్షల్లో కూర్చుంటామని పల్లా స్పష్టం చేశారు. త్వరలోనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరిస్తామన్నారు.
గాజువాకలో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు భరోసాగా ఉంటామని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి విషయం చెప్పానని గుర్తుచేశారు. కుమారస్వామి విశాఖ ప్లాంట్ సందర్శనలో స్టీల్‌ప్లాంట్‌కు మంచి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి న్యాయం చేయటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించాలంటే కార్మికుల కృషి చాలా ముఖ్యమని అన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కరించకపోతే తాము పదవులకు రాజీనామా చేస్తామని శ్రీభరత్ స్పష్టం చేశారు.