అమరావతి (చైతన్యరథం): టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన నేపథ్యం లో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ అభివృద్ధి పథంలోకి నడిపించేం దుకు టీడీపీ, జనసేన, బీజేపీ అనే మూడు శక్తులు ఏకమయ్యాయని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత ఐదేళ్లుగా చీకటిలో మగ్గిపోయిన రాష్ట్రానికి ఈ పొత్తు ఒక ముఖ్యమైన ఘట్టం అని అభి వర్ణించారు. ఈ పొత్తు చరిత్రలో నిలిచి పోతుందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితకు, ప్రజల జీవితాలకు ఇదొక సానుకూల మేలి మలుపు అని వివరించారు.