- ఎన్నికల ముందు నోటిఫికేషన్ పేరుతో డ్రామాలు
- టీడీపీ పాలనలో పెట్టుబడులు, జగన్ పాలనలో గంజాయి, డ్రగ్స్ మాఫియాలు
- ప్రభుత్వ తీరుపై బాలకృష్ణ ఆగ్రహం
అమరావతి: దగా డీఎస్సీల పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగుల్ని మరోసారి మోసం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని.. ఆయన చర్యలను వారు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం అసెంబ్లీకి వెళుతున్న బాలకృష్ణకు.. డీఎస్సీ విషయంలో 5 ఏళ్లుగా సీఎం తమని మోసం చేశారంటూ నిరుద్యోగులు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి ఏటా మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన జగన్.. గత ఐదేళ్లుగా నిరుద్యోగుల్ని మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని.. డీఎస్పీ పేరుతో మరో మోసానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 21వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే కేవలం 6,100తో మమ అనిపిస్తున్నారని. ఇది నిరుద్యోగులు, ప్రజలను మోసం చేయడం కాదా? అంటూ ప్రశ్నించారు.
23వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ విడుదల చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. దీనిపై నిరుద్యోగులు నాలుగేళ్లుగా పోరాడుతున్నా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు మెగా డీఎస్సీ పేరుతో కేవలం 6100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం మెగా మోసం కాదా అని నిల దీశారు. మరోవైపు జగన్ సీఎం అయినప్ప టి నుంచిరాష్ట్రానికి పెట్టుబడలన్నవి కలగా మారాయన్నారు.ఈ పాలనలో ఉద్యోగాలు, పెట్టుబడులు కనిపించవు కానీ గంజాయి మాత్రం ఎక్కడ చూసినా దొరుకుతోందన్నా రు.
దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండ టం జగన్‌రెడ్డి అరాచక పాలనకు నిదర్శ నం అని విమర్శించారు. జగన్ రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసులను ప్రైవేటు ఫ్యాక్షన్ సైన్యంగా వాడటంతో వారికీ నేరాలు అలవాటైపోయాన్నారు. నిరుద్యోగుల్ని మోసం చేస్తూ.. రాష్ట్రాన్ని గంజాయిప్రదేశ్ గా మార్చిన జగన్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.