అమరావతి: జగన్ నియంతృత్వ పాలనలో నోరు విప్పటం కూడా పెద్ద నేరమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేస్తు న్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పై వేటువేయడం దారుణమని ఎక్స్ వేదిక గా లోకేష్ విమర్శించారు. తిరుమల కొండపై వైసీపీ నేతలు, కొంతమంది అధి కారులు కలిసి చేస్తున్న దారుణాల గురించి రమణ దీక్షితులు నోటి నుండి భక్తులకు తెలిసేలా ఆ కలియుగ దైవమే చేశారు. చేసిన తప్పులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి రమణ దీక్షితులు పై కేసు పెట్టడం, అరెస్ట్ చెయ్యాలని చూడ టం జగన్ అహంకారానికి నిదర్శనం. దేవుడి జోలికి వెళ్లిన వారు ఎవ్వరూ బాగుపడినట్టు చరిత్రలో లేదు. దైవంతో ఆటలోద్దు జగన్ అని లోకేష్ హెచ్చరించారు.