అమరావతి(చైతన్యరథం): పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డికి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఆ గేటు పెట్టలేని జగన్.. చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్టు జాతికి అంకితం చేసి జగన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని మంత్రి డోలా దుయ్యబట్టారు. వెలుగొండ సొరంగం వ్యాసాని జగన్ రెండున్నర మీటర్లు తగ్గించారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేకపోయారని జగన్ పరోక్షంగా ఒప్పుకున్నారు, ఈ పాపం జగన్ ది కాదా? 2019లో జగన్ మాయమాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే వారిని మోసం చేశారు. ఈసారి ప్రకాశం జిల్లా ప్రజలు జగన్ ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన తీరు మార్చుకోకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. జగన్ ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని ఒక ప్రకటనలో మంత్రి డోలా స్పష్టం చేశారు.