చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కరవనేదే ఉండకూడదు

రూ.5.4 కోట్లతో సోమశిల తక్షణ మరమ్మతులు

చైతన్యరధం by చైతన్యరధం
August 20, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కరవనేదే ఉండకూడదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కేంద్ర, రాష్ట్రాలనుంచి రైతుకు సాయం
  • ఖర్చు తగ్గించి వ్యవసాయం లాభసాటి చేస్తా
  • వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
  • పథకాలు పూర్తిచేస్తే కాదు, నిర్వహణా ముఖ్యమే
  • రూ.5.4 కోట్లతో సోమశిల తక్షణ మరమ్మతులు
  • రాష్ట్ర ప్రాజెక్టుల మరమ్మతులకు 300 కోట్లు అవసరం
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి
  • సోమశిల స్పిల్‌వే, స్లూయిస్‌ క్షేత్రస్థాయిలో పరిశీలన

ఆత్మకూరు/ సోమశిల (చైతన్య రథం): ‘ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌. అలాంటి రాష్ట్రం గత ప్రభుత్వ అసమర్థ ధానాలు, నిర్లక్ష్య ధోరణి కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. రాష్ట్రంలో కరవనేది ఉండకూడదు. రైతులకు ఖర్చులు తగ్గించి సాగును లాభసాటిగా మారుస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి యేటా రూ.20 వేల సాయమందిస్తాం. సోమశిల ప్రాజెక్టును సద్వినియోగం చేసుకునేలా బాధ్యత తీసుకుని పరిరక్షణ చర్యలు తీసుకుంటాం. నేను ఇక్కడికి రాకపోతే అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటారన్న ఉద్దేశ్యంతో వచ్చాను. ప్రాజెక్టును పరిశీలించి భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చాను’ అని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును సోమవారం పరిశీలించి, మ్యాప్‌ పాయింటింగ్‌ ద్వారా ప్రాజెక్టు పరిస్థితిని అధికారులనుంచి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సోమశిల ప్రాజెక్టుకు మరమ్మతులు చేయిస్తాం
‘దెబ్బతిన్న సోమశిల గేట్లను రూ.5.40 కోట్లతో మరమ్మతు చేయించి, ఆప్రాన్‌ నిర్మిస్తాం. స్లూయిస్‌లో గోడ నిర్మిస్తాం. రాష్ట్రంలోని ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. ఒక్క సోమశిలకే రూ.140 కోట్లు అవసరం. ఆస్తిని నిర్మించడం ఎంత ముఖ్యమో కాపాడుకోవడమూ అంతే ముఖ్యం. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు, మెయింటెనెన్స్‌, కాల్వల్లో పూడికలు చాలా ముఖ్యం. కానీ ఐదేళ్లుగా ప్రాజెక్టుల స్థితిగతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సోమశిల ప్రాజెక్టు చారిత్రాత్మకమైంది. 38 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టును ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక 78 టీఎంసీలకు పెంచారంటే.. అది ఎన్టీఆర్‌ దూరదృష్టి. సోమశిల ద్వారా 5.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 2018 ప్రాజెక్టుకు నీళ్లు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో పంటలు దెబ్బతింటాయని శ్రీశైలం నుండి 25 టీఎంసీ తీసుకొచ్చి పంటలు కాపాడాం. రైతుల సమస్యలు అర్థం చేసుకునే పార్టీ టీడీపీ. కండలేరులో కూడా 68 టీఎంసీ నిల్వచేసుకొని 3 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశముంది.

ఈ రెండు ప్రాజెక్టుల్లో నీళ్లుంటే నెల్లూరు, కొంత తిరుపతి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నీళ్లివ్వొచ్చు. ఈ యేడాది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బాగా పడ్డాయి. మన రాష్ట్రంలోనూ బాగా కురిశాయి. కృష్ణా నదిపై ఉన్న జలాశయాలన్నీ నీటితో కళకళ లాడుతున్నాయి. పెన్నాకూ వరద పెరిగితే కండలేరు, సోమశిల నిండుతాయి. భూమినే జలాశయంగా చేయగలిగితే నీటి సమస్యే ఉండదు. రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారు. మొత్తం రిజర్వాయర్లలో 983 టీఎంసీ నిల్వ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పటివరకు 692 టీఎంసీ నిల్వ చేసుకున్నాం. 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఏపీలో ఆగస్టు నెలలో రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. వరుణుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. రేడియం క్రస్ట్‌ గేట్లు, స్లూయిస్‌లు దెబ్బతిన్నాయి. కొన్ని గేట్లు తుప్పుపట్టి పోయాయి’ అని సీఎం అన్నారు.

ఆ డబ్బులో సగంపెట్టినా ప్రాజెక్టులు పూర్తి
‘జగన్‌ సర్కారు సర్వేరాళ్లపై బొమ్ములకు, రిషికొండ ప్యాలెస్‌కు పెట్టిన ఖర్చులో సగం పెట్టినా ప్రాజెక్టులు పూర్తై ఉండేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతాంగం మొత్తానికి నీరిచ్చే మార్గం చూస్తున్నా. పట్టిసీమను నాడు వ్యతిరేకించారు. అయినా నిర్మించి 100 టీఎంసీ శ్రీశైలంలో నిల్వచేశాం. నాగార్జునసాగర్‌ కుడి కాల్వకు గోదావరి నీళ్లు తెస్తే 160 టీఎంసీ పొదుపు చేసుకోవచ్చు. వాటితో రాయలసీమలోని రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చు. నాగార్జున సాగర్‌ వద్ద నల్లమల అడవుల గుండా టన్నెల్‌ నిర్మించి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్తే వేల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సీమకు తెచ్చుకోవచ్చు. డబ్బులివ్వకపోతే కాంట్రాక్టర్‌ పనిచేస్తారా? ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని ప్రభుత్వం ఐదేళ్లు పాలించింది. ప్రాధాన్యతలు తెలిసిన ప్రభుత్వమిది. పాత రోజులు మరచిపోవాలని అందరికీ చెబుతున్నా. బాధ్యతగా పనిచేయాలి. సకాలంలో పనులు పూర్తి చేయాలి. గత ప్రభుత్వంలో సర్వే రాళ్లపై బొమ్మలకు రూ.700 కోట్లు ఖర్చుపెట్టారు. పేపర్లలో ప్రకటనలకు రూ.403 కోట్లు ఖర్చుపెట్టారు. రిషికొండ కొట్టేసి రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టించుకున్నారు. ఈ డబ్బుల్లో రూ.200 కోట్లు ఖర్చుపెట్టినా ప్రాజెక్టులు పూర్తయ్యేవి. తుంగభద్రలో గేటు కొట్టుకుపోతే వెంటనే ఇంజనీర్‌ను పంపాం. కర్ణాటకకు మన మంత్రులు వెళ్లి మాట్లాడారు. మన వద్ద ఉన్న ఇంజినీర్‌ కన్నయ్యనాయుడును పంపాం. మూడు, నాలుగు రోజుల్లోనే గేటు పెట్టి నీటిని నిల్వచేయగలిగాం. వారికి అభినందనలు తెలుపుతున్నా’ అన్నారు.

తప్పు చేసిన వారు ఎక్కడ దాక్కున్నా వదలను
‘నేను సీఎంగా బాధ్యతలు చేపట్టగానే 5 హామీల అమలుపై సంతకాలు పెట్టాను. చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వాలనే ఉద్దేశ్యంతో మెగా డీఎస్సీలో భాగంగా 16,347 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నాం. రెండో సంతకం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుపై చేశాం. మీ భూములకు కూడా టెండర్‌ పెట్టడానికి గత పాలకులు ఈ చట్టాన్ని తెచ్చారు. మదనపల్లిలో ఫైళ్లు తగలబెట్టారు. షార్ట్‌ షర్క్యూట్‌ అని ప్రచారం చేశారు. ఇది షార్ట్‌ సర్య్కూటా? లేక వివేకానందరెడ్డిలాగా గొడ్డలిపోటా? అన్న అనుమానం వచ్చింది. కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో తప్పులు చేసి మాట్లాడుతున్నారు. గుడ్డ కాల్చి ముఖాన వేసి తుడుచుకోమని చెప్తున్నారు. వివేకాను చంపి నారాసుర రక్తచరిత్ర అని మళ్లీ నాపైనే కథనాలు రాశారు. అందుకే మదనపల్లిలో ఫైల్స్‌ దగ్ధంపై డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులను పంపి అక్కడికి విచారణకు ఆదేశించాను. అసైన్డ్‌ భూములను 22ఏ నుండి ఫ్రీహోల్డ్‌ చేసి భూములు దోచేశారు. ఇళ్లలో కూర్చుని నచ్చినట్లు ఫైళ్లు రాశారు. నిన్న పోలవరం ఫైల్స్‌, అంతకుముందు పొల్యూషన్‌ బోర్డు ఫైల్స్‌ కాల్చేశారు. ఫైల్స్‌ తగలబెట్టి మళ్లీ ఏమీ తెలియనట్లుగా ఎదురు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వంలో రాజకీయ కక్షలు ఉండవు. కానీ తప్పులు చేసిన వారు ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

ఇసుక ర్యాంపులు పరిశీలిస్తా
‘ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని చెప్పిన మాట ప్రకారం అమలు చేశాం. నాకు ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదుర్కొంటా. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలను కోరుతున్నా. మనకు మంచి పేరు రావాలంటే కలిసి పనిచేయాలి. ఉచిత ఇసుక చివరి లబ్ధిదారు వరకు చేరాలి. సీనరేజ్‌, రవాణా, తవ్వకం ఖర్చు తప్ప ఇసుకకు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు ఇసుక ర్యాంపులను నేను కూడా సందర్శిస్తా. పేదలకు రూ.5లకే అన్నక్యాంటీన్‌ ద్వారా అన్నం పెడుతుంటే సహించలేకపోతున్నారు. ఇటీవల 100 క్యాంటీన్లు ప్రారంభించాం. త్వరలో అన్నింటినీ ప్రారంభిస్తాం. మద్యంలో కూడా సొంత బ్రాండ్లతో గత పాలకులు ప్రజల ప్రాణాలు తీశారు. మద్యం దోపిడీపైనా విచారణ చేయిస్తున్నాం. 7 ప్రధానాంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసి వాస్తవాలను ప్రజలకు వివరించాం’ అని సీఎం పేర్కొన్నారు.
అనకాపల్లిలో సంస్థను మూసేస్తాం…కారకులపై చర్యలు
‘అనకాపల్లి జిల్లాలో అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తినడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మంచి కార్యక్రమం చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. తప్పులు చేయడానికి అవకాశం ఉండకూదు. ఆ ఆశ్రమాన్ని మూసేసి పిల్లలను ప్రభుత్వమే చదివించేలా చర్యలు తీసుకుంటుంది. నిర్వాహకులను విచారించి కఠిన చర్యలు తీసుకుంటాం. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకొనేవరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. తప్పు చేసిన వారు ఎంతగొప్పవారైనా శిక్షిస్తేనే అందరిలో భయం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Previous Post

23న పల్లె పండుగ!

Next Post

వెలుగొండపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు

Next Post

వెలుగొండపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.