- అందుకే దస్తగిరి కుటుంబంపై వైసీపీ రౌడీల దాడి
- దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు
- అచ్చెన్నాయుడు విమర్శలు
అమరావతి(చైతన్యరథం): బాబాయి బాత్రూం మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందనే భయంతోనే జగన్‌రెడ్డి దాడులు, బెదిరింపు లకు దిగుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. వివేకా హత్య కేసులో అప్రూవర్ షేక్ దస్తగిరి తండ్రి షేక్ హాజీవలిపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గం అని ఒకప్రకటనలో అచ్చెన్నాయు డు ఖండిరచారు. ఒకవైపు చెల్లెళ్లు, మరోవైపు వివేకా హత్యలో నిందితుడు దస్తగిరి వాస్తవా లు బహిర్గతం చేస్తారనే భయంతో జగన్‌రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. పులి వెందులో జగన్‌రెడ్డి అరాచకాలకు, అకృత్యా లకు కాలం చెల్లింది. వైఎస్ కుటుంబం నాలుగైదు దశాబ్దాలుగా పులివెందులను శాసించారు. ఇప్పుడు వివేకా హత్య కేసులో జగన్‌రెడ్డి ముసుగు తొలగిపోవడంతో పులి వెందుల ప్రజలే తిరుగుబాటుకు సిద్ధమయ్యా రు. ఆ నిస్పృహలో దాడులకు తెగబడుతు న్నాడు. కేసులు,దాడులు, దౌర్జన్యాలతో భయ పెట్టి కాలం నెట్టుకురావాలని చూస్తు న్నారు.
వివేకా హత్యకు గొడ్డలి అందించిన చేయి ఎవరిదో దస్తగిరి రెండు రోజుల క్రితం బయటపెట్టాడు. జగన్‌రెడ్డీ..ఇలాంటి హత్యా రాజకీయాలకు,దాడులు,దౌర్జన్యాలకు కాలం చెల్లింది. ప్రజాస్వామ్య దేశంలో ఇంకా నీ నియంతృత్వ పోకడలు, ఫ్యాక్షన్ వ్యవహారం చెల్లదు. దస్తగిరి తండ్రిపై దాడి చేయడం తోనే పులివెందులలో జగన్‌రెడ్డి ఓటమి ఖరారైపోయింది. తక్షణమే దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి. దస్తగిరి కుటుంబానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
దస్తగిరి తండ్రిపై దాడి
పులివెందుల:మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తండ్రి హాజీవలీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. శుక్రవారం రాత్రి పులివెందులలో దస్తగిరి తండ్రిని కొందరు వ్యక్తులు బెదిరి స్తూ.. దాడికి పాల్పడారు. శివరాత్రి జాగరణ కు వెళ్లిన హాజీవలీను అడ్డగించి దాడి చేశారు.దస్తగిరి తండ్రివి నీవేనా అని అడిగి.. జగన్‌రెడ్డిని విమర్శించి ఆయనతో పోటీపడే స్ధాయి నీ కొడుక్కువుందా?… దస్తగిరిని ఎలాగైనా చంపేస్తాము’’ అని సదరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే జగన్ పేరుతో బెదిరించి దాడిచేశారు కాబట్టి వైసీపీ కి చెందిన వారే అని దస్తగిరి తండ్రి హాజీవలీ ఆరోపించారు. పులివెందుల మండలం నామాలగుండు వద్ద దాడి చేశారని బాధితు డు చెప్పాడు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాజీవలీ ప్రస్తుతం పులి వెందులలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
అవినాష్ బెయిల్ రద్దుచేయాలి: దస్తగిరి
ఈ ఘటనపై దస్తగిరి పులివెందులలో మీడియాతో మాట్లాడారు. మా నాన్న హాజీ వలీపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.. అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.. అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 12న హైదరాబాద్ సీబీఐ కోర్టులో వాయిదాకు వెళుతున్నా. నా తండ్రి పై జరిగిన దాడి గురించి సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తా. పులివెందుల వైసీపీ నాయకు లకు దమ్ముంటే నాతో చూసుకోవాలి. మా కుటుంబం జోలికి రావాల్సిన అవసరం ఏముంది? – ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.. దేనికైనా సిద్ధం. పులివెందుల వైసీపీ నాయకులతో ఇక నుంచి ఢీ అంటే ఢీ అంటానని దస్తగిరి స్పష్టం చేశారు.