- ఎన్టీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర
- అందులో భాగమే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు
- జగన్ పైశాచికానందం, లపాకీకి శునకానందం
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు
అమరావతి: ఎన్టీరామారావు కీర్తి ప్రతిష్ఠలను దెబ్బతీసే కుట్రలో భాగమే డాక్టర్ ఎన్టీఆర్ యూని వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలన్న జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం సరైనదికాదు. పేరు మార్పు కు సంబంధించి శాసనసభలో చెప్పినవన్నీ అబద్దాలే. ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ తెలుగు ప్రజానీకం చర్చించుకునే పరిస్థితి ఏర్పడిరది. విపరీతంగా బాధపడే దుస్థితిని తీసుకొచ్చారు.
పైశాచికానందం పొందుతున్న జగన్‌రెడ్డి
యూనివర్సిటీకి ఉన్న ఒక మహానుభావుడు,యుగపురుషుడి పేరు మార్చి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. జగన్‌రెడ్డితో పాటు వైసీపీ నాయకులు, లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు ఇటువంటి దుశ్చర్యకు శునకానందం పొందుతున్నారు.నేడు లక్ష్మీపార్వతి పెట్టిన విలేకరుల సమావేశం అందుకు నిదర్శనం. సీఎం మెడికల్ కాలేజీల నిర్మాణాల గురించి అనేక అబద్ధాలను చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 24 మెడికల్ కాలేజీలను తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. అందులో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు, 12 ప్రైవేటువి. తిరుపతిలో బర్డ్ ఆస్పత్రి, టాటా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ కూడా చంద్రబాబు నాయుడు తెచ్చినవే. కేంద్రం నుంచి ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ ను రాష్ట్రానికి తీసుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఎయిమ్స్‌కు మంగళగిరిలో 197 ఎకరాల భూమిని కేటాయించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించి పూర్తి సహకారాన్ని అందించారు. దాని నిర్మాణం పూర్తికావడానికి ప్రభుత్వం నాడు ఎంతో కృషి చేసిం ది. కనీసం నీటి సదుపాయం కల్పించకుండా వాళ్లని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం జగన్ రెడ్డిది. అటువంటి వీళ్లు రాష్ట్రంలో 17మెడికల్ కాలేజీలు కడతామనడం హాస్యాస్పదం. ఆ కాలేజీలు పునాదుల దశలోనే ఉన్నా యి. పూర్తి అయిన ఎయిమ్స్‌కు నీటి సదుపాయం కల్పించడంలో ప్రభుత్వం కక్ష పూరింతంగా వ్యవహరి స్తోంది. ఈ అంశంపై మీడియాలో వార్తలు వస్తున్నా యి. ఎయిమ్స్ చంద్రబాబు హయాంలో పూర్తి అయిం దిని కక్ష సాధింపుకు దిగుతున్నారు. ఇంత నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిని ప్రభుత్వాది నేతగా చూడ టం బాధాకరం. ఎయిమ్స్‌కి నీటిని ఇవ్వలేని వారు 17 మెడికల్ కాలేజీలను కడతామంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.
మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయో తెలియని జగన్
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయో తెలి యక 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయని జగన్ చెబు తున్నారు. ఎ2 విజయసాయిరెడ్డి పార్లమెంటులో మెడి కల్ కాలేజీల విషయమై ప్రశ్నిస్తే 2021 డిసెంబర్ 14న 14 మెడికల్ కాలేజీలు ఉన్నాయని కేంద్రం సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలోని వైద్య కళాశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఉద్దేశంతో హెల్త్ యూనివర్సీటీని ఎన్టీఆర్ 1986లో స్థాపించారు.
నేడు హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఉన్న నిమ్స్ కి అప్పుడు అమెరికా నుంచి ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావుని రప్పించి డైరెక్టరుగా నియమించారు. నిమ్స్ ఈ స్థాయికి రావడానికి కారకులు ఎన్టీఆర్. వీటన్నింటిని కొనసాగిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు రంగం లో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి పటిష్టమైన వ్యవస్థను సృష్టించిన వ్యక్తి చంద్రబాబు.
ఎన్టీఆర్ పేరు మార్పు కోసం మార్ఫింగ్ వీడియో ప్రదర్శన
ఎన్టీఆర్ పేరు మర్చడానికి సాక్షి స్టూడియోలో మార్ఫింగ్ చేసి తయారు చేయించిన ఫేక్ వీడియోని అసెంబ్లీలో చూపించారు. ఏబీఎన్ రాధాకృష్ణ ఎన్టీ రామారావు గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నట్లు చిత్రీకరించారు. వైఎస్ పేరు పెట్టడానికే మంత్రి, ముఖ్యమంత్రి కలిసి అసెంబ్లీలో తప్పుడు కధనాలు వినిపించారు, చూపించారు. ఎన్టీఆర్ పథకం ఆరోగ్య శ్రీ పథకంగా మారిన విషయం ఏ స్థాయిలో వెళ్లిందనే చర్చ జరుగుతుంటే అకస్మాత్తుగా తప్పుడు కథనాన్ని లేవనెత్తారు. ప్రజల మనసుల్లో నుంచి వాళ్లు చేస్తున్న తప్పుడు పనులను డైవర్ట్ చేయడానికి చేసిన కుట్రే యూనివర్సిటి పేరు మార్పు. లక్ష్మీ పార్వతి ప్రసంగించిన తీరును ప్రజలందరూ విమర్శిస్తున్నారని నక్కా ఆనందబాబు చెప్పారు.