- 53రోజులు చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించారు
- స్కిల్ కేసులో ఒక్క ఆధారం కూడా కోర్టుకు జగన్ సర్కార్ చూపలేకపోయింది
- పార్టీ కోసం, నాయకుడి కోసం ప్రాణాలొదిలిన కార్యకర్తలను ఆదుకుంటాం
- పార్టీ బిడ్డలకు అండగా నిలబడటం తన బాధ్యత అని భువనేశ్వరి స్పష్టీకరణ
చిలకలూరిపేట: టీడీపీ అధినేత చంద్రబాబు నిజాయితీపరుడని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డే రుజువు చేశాడని నారా భువనేశ్వరి అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్య కర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన నిజం గెలవాలి పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు గ్రామానికి బుధవారం భువనేశ్వరి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మహిళలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లా డుతూ చంద్రబాబునాయుడుని వైసీపీ ప్రభుత్వం ఆధా రాల్లేని ఓకేసులో కుట్రపూరితంగా ఇరికించి 53రోజు లు అక్రమంగా జైల్లో నిర్బంధించిందన్నారు.
జగన్మో హన్‌రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుపౖౖె పెట్టిన కేసు అక్రమమనే వాస్తవం ప్రపంచమంతా తెలిసిన విషయ మేనన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చంద్రబాబు పెద్దపెద్ద కంపెనీలను తీసుకొచ్చారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడాన్ని జగన్మోహన్‌రెడ్డి ప్రభు త్వం తప్పుబట్టింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో అవి నీతి జరిగిందని, ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారని ఎలాంటి ఆధారాల్లేకుండా కేవలం ఆరోపణల తోనే చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో జగన్ సర్కార్ ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు ఇవ్వలేకపోయింది…అంటే చంద్రబాబు నిజాయితీపరులని జగన్మోహన్‌రెడ్డే ఒప్పు కున్నాడు.
చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక, మనస్తా పానికి గురై పార్టీ బిడ్డలు మృతిచెందారు. వారి కుటుం బాలను పరామర్శించడం, వారిని ఓదార్చడం నా కర్తవ్యం. నా కర్తవ్యాన్ని మర్చిపోకుండా నేడు పార్టీ బిడ్డల కుటుంబాలను కలిసి, పరామర్శిస్తున్నాను. నాకు సంఫీుభావం తెలిపేందుకు ఎండను సైతం లెక్కచేయ కుండా పెద్దఎత్తున కదలివస్తున్న కార్యకర్తలు, మహిళల కు నాధన్యవాదాలు. తమ కుటుంబంపై రాష్ట్ర ప్రజలు, మహిళలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.