పామర్రు: రాష్ట్ర యువతను సీఎం జగన్ రెడ్డి నిలువునా మోసం చేశాడని పామర్రు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ వర్ల కుమార్ రాజా విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ జగన్ రెడ్డి అంటూ తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కుమార్ రాజా పాల్గొన్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత కృష్ణాజిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి, తెలుగుయువత గుడివాడ నియోజకవర్గ అధ్యక్షులు గోవాడ శివ, గుడ్లవల్లేరు మండల యువత అధ్యక్షులు అట్లూరి స్వరూప్, నందివాడ మండల యువత అధ్యక్షులు పి.దుర్గారావు, నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు దొండపాటి మహేష్, నియోజకవర్గ కార్యనిర్వహణ కార్యదర్శి నున్న పృద్వి తేజ్, కార్యదర్శి ఇమ్మాడి వినయ్ కుమార్, నందివాడ గ్రామ తెలుగు యువత అధ్యక్షులు వీర్ల లోకేష్, వేసుపోగు యోసేబు, వేసుపోగు ఇమ్మానియేల్, రవీంద్ర, తెలుగు యువత సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.