ధర్మవరం: జగన్ రెడ్డి పాలనలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారని టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి బాదుడును నిరసిస్తూ ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, సంజీవపురం గ్రామపంచాయతీలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలతో పాటు పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పరిపాలించే హక్కులేదని వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీ బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.