.గోరంట్ల వీడియోపై ప్రధాని, లోక్‌సభ స్పీకర్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు
.విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్‌ని కోరిన మహిళా కమిషన్
.గోరంట్ల వీడియో లీక్‌లో వైసీపీ నేతల హస్తం?
.సహచరుడి బాగోతంపై ట్వీట్ చేయని విజయసాయిరెడ్డి
.సకల విషయాల్లో స్పందించే సజ్జల ఎటుపోయారు?
.మహిళా మంత్రుల స్పందనకు నివ్వెరపోతున్న మహిళా లోకం
(చైతన్యరథం స్పెషల్ డెస్క్)
తమ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో విషయమై జాతీయ స్థాయిలో రచ్చవుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యథావిథిగా నోరుమెదపలేదు. మాధవ్ వీడియో వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ కు చెందిన ఎంపీ జస్పీర్ సింగ్ గిల్ ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మకు లేఖ రాశారు. మాధవ్ ప్రవర్తించిన తీరు పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంపీలకు మాయని మచ్చన్నారు. ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అంటున్నారని పేర్కొన్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఆ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్ష చేయించాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మకు లేఖ రాశారు. ఆ లేఖలకు స్పందించిన మహిళా కమిషన్ ఈ వీడియోపై విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరింది. గోరంట్ల మాధవ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. వీడియోలో కంటెంట్ చాలా అసభ్యకరంగా ఉందని కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించి స్పీకర్‌కు లేఖ రాసినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరపాలని కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)కి లేఖ రాశారు. ఈ వీడియోపై అంశానని, దీనిపై అనంతపురం ఎస్పీ పకీరప్ప స్పందించిన తీరును అఖిలపక్ష మహిళానేతలు గవర్నర్ దష్టికి తీసుకువెళ్లారు. సోషల్ మీడియలో నెటిజన్లు కూడా గోరంట్ల మాధవ్ వెకిలిచేష్టలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎంపీగా ఉండి ఇలాంటి చిల్లర వేషాలు వేయడమేంటని అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ తెలిసే టిక్కెట్ ఇచ్చిన జగన్ రెడ్డి
కాగా, మాధవ్ పై ఉన్న కేసులు విషయం తెలిసే హిందూపురం లోక్‌సభ సభ్యుడిగా పోటీచేయడానికి జగన్ రెడ్డి తమ పార్టీ టిక్కెట్ ఇచ్చాడు. అటువంటి వ్యక్తి ఈ వీడియోకు ఎందుకు స్పందిస్తాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను జగన్ రెడ్డి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. చిన్నదానికి పెద్దదానికి ట్విటర్‌లో స్పందించే పార్టీలో నెంబర్ 2, ఏ2 అయిన విజయసాయిరెడ్డి సహచరుడి బాగోతంపై ట్వీట్ చేయలేదు. అసలు ఏమయ్యాడో తెలియదు. అటు ప్రభుత్వానికి సంబంధించి, ఇటు వైసీపీకి సంబంధించి సకల విషయాల్లో స్పందించే సజ్జల రామకష్ణారెడ్డి కూడా ఎటువెళ్లారో తెలియడంలేదు. మొదట ఓ సారి మాత్రం వీడియోని ల్యాబ్ లో పరిశీలించిన తరువాత గోరంట్లది తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన చెప్పి వారం గడిచిపోయింది. చర్యలూ లేవు. ఆయనా పత్తాలేరు. ఎంపీ మార్గాని భరత్ కూడా ఆ వీడియో వాస్తమని తేలితే పార్టీ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక మహిళా మంత్రుల స్పందనకు రాష్ట్రంలోని మహిళలు ముక్కుమీద వేలు వేసుకుంటుంటున్నారు. ఆ వీడియోపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఆ వీడియోను ల్యాబ్ పరీక్షలకు పంపించడం సాధ్యంకాదని ఎస్పీ పకీరప్ప చెప్పడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఆయన ఆ ప్రెస్ మీట్ తో ఈ కేసు విషయంలో పరోక్షంగా చేతులెత్తేసినట్లుగా చెప్పకనే చెప్పారు. అంతకు ముందు హోం మంత్రి తానేటి వనిత, పర్యాటక శాఖా మంత్రి రోజా చెప్పినదానికి పూర్తి భిన్నంగా ఎస్పీ చెప్పారు. జాతీయ స్థాయిలో ఇటు తెలుగువారి పరువు, అటు పార్లమెంటు పరువు తీసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఈ ఘటనలో వైసీపీ నేతలు ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మాధవ్ పార్టీ పరువు తీశాడని వారూ బాధపడుతున్నారు. తప్పుచేసింది గాక,కులం ప్రస్థావన తీసుకురావడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. తొలుత అతనిని సస్పెండ్ చేస్తారని చాలా మంది భావించారు. అయితే, ఇలా తప్పు చేసేవారిని సస్పెండ్ చేస్తూ పోతే పార్టీలో ఎవరూ ఉండరని జగన్ రెడ్డి భయపడినట్లు తెలుస్తోంది.
గోరంట్ల వీడియో లీక్‌లో వైసీపీ నేతల హస్తం?
గోరంట్ల అసభ్యకర వీడియో ఎలా బయటపడిరదనే విషయమై రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో గోరంట్ల మాధవ్ అంటే గిట్టని వారు, అతని బాధితులు ఈ వీడియోని లీక్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వీడియో మూడు నెలల క్రితమే బయటకు వచ్చిందని, వైసీపీ నేతలే దానిని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు విషయంలో ఆడియో లీకైనా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నాలుగు రోజులు మీడియాలో రచ్చ, చర్చ జరిగింది. ప్రభుత్వం మాత్రం అసలు పట్టించుకోలేదు. ఆ తరువాత ఆ వీడియోల ప్రస్తావనేలేదు. ఇప్పుడు గోరంట్ల విషయంలో అంతే జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ గొడవ సద్దుమణిగేవరకు గోరంట్ల మాధవ్ ను రాష్ట్రంలోకి రావద్దని వైసీపీ నేతలు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశం అంత తేలిగ్గా సద్దుమణగదు. ప్రధాని, స్పీకర్, జాతీయ మహిళా కమిషన్‌ల దృష్టికి వెళ్లినందున నిజాలు నిగ్గు తేలే అవకాశం ఉంది. అంతేకాకుండా, పార్లమెంటులోని కొందరు ఎంపీలు, రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, ముఖ్యంగా మహిళామణులు ఈ అంశాన్ని వదిలిపెట్టేట్లుగా లేరు. ఆ వీడియోని ల్యాబ్ లో పరీక్షలు చేయించి, వాస్తవాలు నిగ్గు తేల్చి, మాధవ్ పై చర్యలు తీసుకునేవరకు వారు ఉద్యమాన్ని ఆపరు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక పరిస్థితి అయింది.