- నాడు అభివృద్ధిలో నెం.1..నేడు నేరాల్లో నెం.1
- అరాచకపాలనకు అద్దంపడుతున్న ఎన్‌సిఆర్‌బి నివేదిక
అమరావతి: జగన్ రెడ్డి విధ్వంసపాలన తాలూకు దుష్ఫలితాలు వచ్చేశాయి. నేరాలు-ఘోరాలలో గణనీయమైన అభివృద్ధి సాధించడంలో ఆయనే ఏ1 అని మరోసారి నిరూపించుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. తాజాగా విడుదలైన ఎన్ సిఆర్ బి నివేదికలో రాష్ట్రం ముందువరుసలో ఉండటంపై లోకేష్ స్పందించారు. ఆర్థికనేరాలలో ఆరితేరి 32 సీబీఐ, ఈడీ, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మీ మూడేళ్ల పాలనలో ఆర్థికనేరాల కేసులు 9273కి పెంచడం మీ ప్రతిభకి నిదర్శనం. పర్యావరణ నిబంధలను అతిక్రమించిన కేసులు 2019లో 188 నమోదు కాగా, మీ బ్రాండ్ డిజిట్ 420 కేసులకి చేర్చిన మీ ఘనతని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఓ రికార్డుగా గుర్తించింది. 2021లో దేశవ్యాప్తంగా 76 దేశద్రోహం కేసులు నమోదైతే, అందులో 29 దేశద్రోహం కేసులు నమోదు చేసి మీరు నెంబర్‌వన్‌గా నిలిచారు. అధికధరలు, అరాచకపాలన, విధ్వంసం భరించలేక కడుపుమండి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వారందరిపైనా జగన్ పీనల్ కోడ్ వాడి దేశద్రోహం కేసులు బనాయించారు. విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ అయితే, ప్రిజనరీ జగన్‌రెడ్డి గారి పాలనలో నేరాల్లో నెంబర్‌వన్ అయ్యిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడిరచాయని లోకేష్ పేర్కొన్నారు.