అమరావతి: జగన్మోహన్‌రెడ్డి రాయలసీమకు మాత్ర మే ద్రోహం చేయలేదు. సొంత నియోజకవర్గమైన పులివెందులకు కూడా తీరనిఅన్యాయం చేశాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చాక కడప జిల్లాకు రావడం.. మొక్కుబడిగా పునాదిరాళ్లు వేయడం తప్ప జగన్‌రెడ్డి ఇప్పటివరకు సాధించిందేమీ లేదన్నా రు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులుతో కలిసి విలేకరుల తో మాట్లాడుతూ ఏటా క్రిస్మస్ నాడు, తన తండ్రి వర్ధంతి నాడు కడప జిల్లాకు రావడం తప్ప, సొంత జిల్లా వాసులకు ముఖ్యమంత్రి ఇసుమంతైనా సాయం చేయలేదని ధ్వజమెత్తారు. మొన్న క్రిస్మస్ పండుగకి కడప జిల్లాకు వచ్చిన జగన్‌రెడ్డి, జిల్లాలో నీటిపారుదల వ్యవస్థ ఆధునికీ కరణకు రూ.12,500కోట్ల నిధులు కేటాయిస్తూ జీవోలు ఇచ్చాడు. గండికోట నుంచి చిత్రా వతికి,గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు రూ.4,600 కోట్లు కేటాయించిన జగన్‌రెడ్డి కనీసం రూ.4కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు లిఫ్ట్ నిర్మాణం కోసం కొత్త ప్రతి పాదనలు పెట్టాడు. అలానే మైదుకూరు వద్ద ఉన్న కుం దూ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తెలుగు గంగకు నీటి పారు దల కోసం ప్రతిపాదనలు పెట్టాడు. ఆయా ప్రతిపాద నలకోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్ట కుండా పురోగతి ఎలా వస్తుందో జగన్‌రెడ్డి చెప్పాలని శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.
రూ.12 కోట్లు కూడా ఖర్చుచేయలేదు
టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గండి కోట రిజర్వాయర్లో నీళ్లు నింపితే, ఆ నీటిని తన సొంత జిల్లాకు తరలించలేకపోయిన దుస్థితిలో ఈ ముఖ్య మంత్రి ఉన్నాడు. సీమసాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.12,500కోట్లు కేటాయించిన జగన్‌రెడ్డి..తన పాల నలో ఇప్పటి వరకు రూ.12కోట్లు కూడా ఖర్చు చేయ లేదు. వేల కోట్ల ప్రజల సొమ్ము వెచ్చించి జగన్‌రెడ్డి వేస్తున్న పునాదిరాళ్లు సమాధి రాళ్లుగా మిగులుతున్నా యి తప్ప ఎలాంటి ఉపయోగం లేదని శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
సొంత చెల్లిని తరిమేసిన వ్యక్తి ప్రజలకు ఏం భరోసా ఇస్తాడు?
జగన్ రెడ్డి కడపలో జరిపిన ఒక్క రోజు పర్యటనలో ప్రజలకు నరకం చూపించాడు. పరదాల చాటున సొంత జిల్లాలో తిరిగిన ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి నిలిచి పోతాడు. ఈ ప్రభుత్వంలో ఏ వ్యవస్థా సక్రమం గా లేదు… ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. సొంత చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు, తన పార్టీ వారికి ఏం భరోసా ఇస్తాడు? ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబునాయుడి నాయ కత్వంలో తెలుగు దేశం-జనసేన పార్టీలు సునామీ సృష్టించబోతున్నాయి. జగన్‌రెడ్డి ఎన్ని ప్రయోగాలు చేసి నా, ఎవర్ని ఎక్కడికి మార్చినా ఉపయోగం ఉండదు. జగన్‌రెడ్డిపై, ఆయన ప్రభుత్వం పైనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. చెప్ప లేనంత అసహనం.. ఆవేశం.. ఆక్రోశం ప్రజల్లో ఉన్నాయి. అధికారుల్ని మార్చినట్టు సొంతపార్టీ వారిని జగన్‌రెడ్డి నియోజకవర్గాలు మార్చి నంత మాత్రాన ఆయనకు ఒరిగేదేమీ లేదు. జగన్ దుర్మార్గపు పాలనపై రాష్ట్రప్రజల తో పాటు, ముఖ్యంగా కడపజిల్లా ప్రజలు ఆలోచించాలి.
ఇన్నేళ్లలో జగన్‌రెడ్డి కడప జిల్లాలో ఎక్కడా ఒక్క రోడ్డు వేసింది లేదు. ప్రజలకు తాగునీరు కూడా అందించలేక పోయాడు. ఉమ్మడి కడప జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడు తెలుగుదేశానికి ఓటు వేద్దామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎవరు పోటీచేసినా కడప ఎంపీ స్థానం కూడా టీడీపీనే గెలుస్తుంది. జగన్‌రెడ్డి, షర్మిల మధ్య ఉన్న విబేధాల్ని ఉమ్మడి కడప జిల్లా వాసులు నమ్మడం లేదు. ఎన్నికల్లో ఓటమి తప్ప దన్న భయంతోనే ఓడిపోయిన కేసీఆర్‌ను పరామర్శిం చడానికి జగన్‌రెడ్డి వెళ్తున్నాడు. ఒకగూటి పక్షులు ఒక చోటకు చేరడానికి సిద్ధమ వుతున్నాయని శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా చేశారు.