- ప్రజల రక్తం తాగుతున్న జగన్ విద్యుత్ భారాల పథకం
- మూడున్నరేళ్లలో మోపినభారం రూ.20,548 కోట్లు
- నిరంతరం కొనసాగుతున్న బాదుడే బాదుడు
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం డిస్కంలను టోల్ టాక్స్ కేంద్రాలుగా మార్చి ప్రజల రక్తం త్రాగుతోందని విద్యుత్ శాఖ మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలపైన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జగన్‌రెడ్డి నిర్విరామం గా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆయన బాదుడికి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. జగన్‌రెడ్డి తన అసమర్థతకు, చేతగానితనానికి ప్రజలు బలవ్వా ల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి లు చెల్లించకుండా డిస్కంలు నష్టాల్లో ఉన్నాయంటూ ఏపీఈఆర్సి ట్రూ అప్ ఛార్జీల వసూలుకు అనుమతివ్వడం చేతగానితనానికి నిదర్శనం కాదా అని ప్రశ్నిం చారు. విద్యుత్ అవసరం ఎంత ఉంటుందో ఏడాది ముందే ఇతర రాష్ట్రాలు గుర్తించి డిమాండ్‌కు అనుగుణంగా ప్లాంట్లు నిర్మించుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏరోజుకారోజు అవసరాలకు బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ డిమాండ్‌ను విశ్లేషించే అనుభవం కలిగిన నిపుణులు, సాంకేతిక పరిజ్జాన అందుబాటులో ఉంటే ప్రభుత్వం ఎందుకు వినియో గించుకోవడం లేదని అడిగారు. 2014-19 కాలం లో వినియోగించిన విద్యుత్‌కు ట్రూ అప్ ఛార్జీల వసూల పేరుతో ప్రజల రక్తం త్రాగుతున్నారన్నారు.
డిస్కంలకు పేరుకుపోయిన ప్రభుత్వ బకాయిలు
జగన్ సర్కార్ డిస్కంలకు చెల్లించవలసిన సబ్సిడీ బకాయిలు రూ15,474 కోట్లని, వివిధ ప్రభుత్వ శాఖలు విద్యుత్ వాడుకున్నందుకు 30.09.2021 వరకు చెల్లించవలసిన బకాయిలు రూ.9,783 కోట్లని వివరించారు.ఈ బకాయిలు చెల్లించకుండా ప్రజలను బలిపెడుతున్నాడని ధ్వజమెత్తారు. మొత్తంగా ప్రభుత్వం గత సెప్టెంబర్ నాటికి రూ. 25,257 కోట్లు డిస్కంలకు ఎగనామం పెట్టిందన్నారు. హైకోర్టుకు మేలో ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో రాష్ట్రంలోని డిస్కంలు దివాల తీసినట్లు పేర్కొన్నట్లు తెలిపారు. రూ.38,836 కోట్లు అప్పుల ఊబిలో డిస్కంలు కూరుకుపోయాయని జగన్ సర్కార్ నిస్సిగ్గుగా ఒప్పుకుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రూ.13,011 కోట్లు బాకీపడిన విషయాన్ని కూడా అఫిడవిడ్ లో చాటుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ఏపీ జెన్ కో ను రెడ్ కేటగిరిలో పెట్టడంతో రాష్ట్రం పరువుపోయిందన్నారు. డిస్కంలు ముందు జగన్ రెడ్డి ముక్కు పిండి బాకీలు వసూలు చేయాలని సలహా ఇచ్చారు. డిస్కంల పేరుతో జగన్ రెడ్డి తీసుకున్న రూ. 38,836 కోట్లు ఎవరికి దోచిపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. జెన్కోలకు ఉన్న రూ.13 వేల కోట్ల బాకీ ఎప్పుడు కడతారో చెప్పాలన్నారు. విద్యుత్ చార్జీల పేరుతో ఒక్క పైసా కూడా ప్రజల నుంచి వసూలు చేసే అర్హత జగన్ రెడ్డికి లేదని కిమిడి కళావెంకట్రావు స్పష్టంచేశారు.