- నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలి
- చంద్రబాబు కుటుంబంపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలి
- హంతకులతో కుమ్మక్కవడం పోలీస్ శాఖకే మాయనిమచ్చ
- టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
అమరావతి, అక్టోబరు 25(చైతన్యరథం): వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన హంతకులతో రాష్ట్ర ప్రభు త్వం కుమ్మక్కైందని సుప్రీం కోర్టులో దాఖలైన అఫిడ విట్‌కు జగన్మోహన్‌రెడ్డి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిచెప్పి, ఆ నెపాన్ని నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రజలకు అబద్దాలు ప్రచారం చేసింనందుకు రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా జగన్ క్షమాపణలు చెప్పాలి. వివేక హత్యకేసు నిందితులతో రాష్ట్రప్రభుత్వం కుమ్మక్కైంది అనడానికి ముఖ్యమంత్రి వైఖరి, సీబీఐ అఫిడవిట్‌లోని అంశాలే నిదర్శనం. బాబాయ్ హత్యపై గతంలో అసెంబ్లీలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లెవేసిన జగన్ రెడ్డి, తాజాగా సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలుచేసిన అఫిడవిట్‌పై ఏసమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం. జగన్‌రెడ్డి నేత్రత్వంలో రాక్షసపాలన సాగుతోంది. వివేకానందరెడ్డి హత్య జరిగిన నాడు చంద్రబాబు, ఆయన కుటుంబంపై, టీడీపీ ప్రభుత్వంపై నారాసుర రక్తచరిత్ర అంటూ హత్యారోపణలు చేసిన జగన్ రెడ్డి, నేడు ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు? నైతిక విలువలకు తిలోదకా లిచ్చి, నవ్విపోదురుగాక నాకేంటిసిగ్గు అనే తీరుతో వ్యవహరి స్తున్న ముఖ్యమంత్రి వైఖరితో రాష్ట్రప్రతిష్ఠ మంటగలి సింది. జగన్‌రెడ్డి తన తల్లి విజయమ్మ కుటుంబం పక్షానఉన్నాడా? లేక భార్య భారతి కుటుంబం పక్షాన ఉన్నాడో తేల్చిచెప్పాలి. వివేక హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం చూస్తే, ఏపీ ప్రభు త్వం హత్యకేసు నిందితులను కాపాడటానికి ప్రయత్ని స్తోందని రూఢ అవుతోంది. విచారణ సంస్థ సీబీఐ కూడా ఏపీ పోలీసులు, హత్యకేసు నిందితులను రక్షిం చడానికి పాటుపడుతున్నారనడం దేనికి సంకేతమో జగన్‌రెడ్డి చెప్పాలి.
సీబీఐ అఫిడవిట్‌పై ఏం సమాధానం చెబుతావు జగన్‌రెడ్డి?
బాబాయ్ హత్యకేసుపై మీడియా, ప్రజలు కోడైకూస్తున్నా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టు కూడా లేదు. బాబాయ్ తనకు ఒక కన్ను అని, అవినాశ్‌రెడ్డి రెండో కన్ను అని గతంలో అసెంబ్లీలో హితోక్తులు చెప్పిన జగన్‌రెడ్డి, సీబీఐ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడ విట్‌పై ఏం సమాధానం చెబుతాడు? తన రెండు కళ్ల సిద్ధాంతంతో, పరోక్షంగా సీబీఐని కట్టడిచేసి, ఎవరిని కాపాడటానికి జగన్ ప్రయత్నించాడని ప్రశ్నిస్తున్నాం. హత్య జరిగిన రోజు ఘటనాస్థలంలో ఆధారాలను మాయంచేయడానికి ప్రయత్నించిన సీఐ శంకరయ్య సీబీఐకి 164 సీఆర్పీసీ స్టేట్‌మెంట్ ఇస్తానని చెప్పగానే అతన్ని ప్రలోభపెట్టడానికి ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రయత్నించారు? తూతూమంత్రంగా అతన్ని విధుల నుంచి తప్పించి, తరువాత పోస్టింగ్ ఇచ్చి, అతనిపై ఈగ వాలకుండా జగన్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు కాపా డుతోంది? వై.ఎస్.సునీత దాఖలు చేసిన పిల్‌లోని అంశాలతో సీబీఐ ఏకీభవించడం దేనికి సంకేతం? ముఖ్యమంత్రి, రాష్ట్రప్రభుత్వం మూకుమ్మడిగా హంత కులతో చేయికలిపింది అనడానికి నిదర్శనంకాదా? ఈ హత్యకేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీకావడం, ముఖ్యమంత్రి స్థానానికి, స్థాయికి అవమానం కాదా? ఏపీ పోలీస్ వ్యవస్థ పరువు ప్రతిష్ఠలకు మాయనిమచ్చ కాదా? తన తప్పుఒప్పుకొని, టీడీపీ అధినేత చంద్ర బాబుకి, ఆయన కుటుంబానికి, తెలుగు ప్రజలందరికీ జగన్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. బాబాయ్ హత్య కేసును తేల్చలేని జగన్..రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. తక్షణమే జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని అర్జునుడు డిమాండ్ చేశారు.