- గుంతలరోడ్డులో పడి పసిబిడ్డ బలి
- వైద్యానికి డబ్బుల్లేక అంపశయ్యపై కాంటాక్టర్
- వారంరోజులైనా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ లేదు
- వేలకోట్ల పన్నులు.. లక్షల కోట్ల అప్పులు ఏమమయ్యాయి?
- మహారాజా ఆసుపత్రి పేరు మార్పు తుగ్లక్ చర్య కాదా?
- ప్రజావ్యతిరేక నిర్ణయాలపై తలవంచాల్సిందేనన్న చంద్రబాబు
అమరావతి : ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎలా చిధ్రం చేస్తు న్నాయో చెప్పడానికి తాజా ఘటనలే నిదర్శనమని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా జె.తిమ్మాపురంలో ఆసు పత్రికి వెళ్తున్న పసిబిడ్డ గుంతలరోడ్డులో పడి ప్రాణా లు కోల్పోయిన ఘటనతో పలు వార్తా కథనాలను ప్రస్తా విస్తూ చంద్రబాబునాయుడు శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రజలను బాదేస్తున్న వేలకోట్ల పన్నులు.. లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయి? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ బిల్లులు మంజూరు కాక.. క్యాన్స ర్ బాధితుడైన తండ్రి వైద్యానికి డబ్బులు లేక వేదన పడుతున్న లేపాక్షి మండలం వెంకటశివప్ప ఘటనను చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్ర ఆదాయం గాడిన పడింది అన్న సిఎం సమీక్ష వార్తను వారం రోజులు అయినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పడని అంశాన్ని కూడా కలిపి చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఆసుపత్రి పేరుమార్పు తుగ్లక్ చర్య
విజయనగరం మహారాజా ఆసుపత్రి పేరు మార్పు మరో తుగ్లక్ చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలయ్యింది. నాడు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్ పోస్టుల నుంచి ఆశోక్ గజపతిని ఇలాగే తప్పించి కోర్టుతో చీవాట్లు తిన్నారు. అయినా మీ వైఖరిలో మార్పు రాలేదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎం జగన్ వెనక్కి తగ్గాల్సిందేనని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.