- మూడున్నరేళ్లు రాజధాని లేకుండా చేశాడు
- మాట తప్పి, మడమ తిప్పి మరోసారి మోసం
అమరావతి: రాజధాని అమరావతిని జగన్‌రెడ్డి చిదిమేశాడని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. ఉండవల్లిలో గురువారం జరిగిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు నేడు పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఒక కొత్త నాటకానికి తెరలేపారు. అమరావతి రాజధాని సరిగా నిర్మించలేదు. మేము అధికారంలోకి వచ్చాక బ్రహ్మాండంగా కడతామని ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన జగన్, ఎమ్మెల్యేలు మాట తప్పి, మడమ తిప్పారు. మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు. జగన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినవన్నీ అసత్యా లే. మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఒక చోట ఉండాల్సిన పరిపాలనని మూడుముక్కలు చేస్తామంటున్నారు. అధికారాలను మూడు చోట్లకు విసిరేసీ ఇదే వికేంద్రీకరణ అంటున్నారు.
పరిపాలన వికేంద్రీకరణ అంటే అధికారాలు పంచాయతీలకు బదలాయింపు
పరిపాలనా వికేంద్రీకరణ అంటే గ్రామ పంచాయ తీలకు అధికారాల బదలాయింపు జరిగి, పరిపాలనా ప్రక్రియ సులభతరమవ్వాలి. ప్రభుత్వ సేవలు ప్రజల దగ్గరకు రావాలి. నేడు పంచాయతీ నిధులను కూడా వారికి ఇవ్వడంలేదు. అధికారాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకున్నారు. పన్నులు ఎంత వేయాల్సింది వాళ్లే నిర్ణ యిస్తున్నారు.లోకల్‌బాడీ అధికారాలన్నీ వీరి చెప్పుచేతు ల్లో పెట్టుకున్నారు. తెలుగుజాతి క్షమించని నేరం ఇది.
జగన్మోహన్‌రెడ్డి అనేక తప్పులు చేస్తున్నారు. ప్రాం తాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి విడదీస్తున్నారు. ఇంతకాలం కుట్రలు కుతంత్రాలతో పరిపాలన కొన సాగించారు. భవిష్యత్తులో కూడా ఇదే ప్రణాళికతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. అమరావతికి భూము లు ఇచ్చిన రైతులు వారి హక్కుల కోసం అమరావతి నుండి అరసవెల్లికి పాదయాత్ర చేస్తుంటే ఉత్తరాంధ్ర ప్రాంతప్రజల్ని రెచ్చగొడుతున్నారు. అసెంబ్లీలో ముఖ్య మంత్రి చేసిన ప్రసంగం దారుణం. రైతుల యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. 13 జిల్లాల వాసులు ఏక గ్రీవంగా అనుమతించిన అమరావతి రాజధానిని చిది మివేయాలని చూస్తున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ఉపయోగంలేదు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిం ది.ఒకసారి అసెంబ్లీలో అన్ని పార్టీలు అమరావతే రాజ ధాని అని తీర్మానించాయి. రాజధాని ఏర్పాటు చేసు కోవడానికి అసెంబ్లీకి అధికారాలు ఇవ్వమని విజయ సాయిరెడ్డి పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టారు.
రాజకీయంగా పబ్బం గడుపుకోవాలన్నదే జగన్ తపన
రాజకీయంగా పబ్బం గడుపుకోవాలన్న తపన జగన్ రెడ్డిది. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ధరలు విప రీతంగా పెరిగాయి. ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజలు విసిగి వేశారారు. ఉత్తరాంధ్ర పైన అభిమానం ఉంటే విశాఖను ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎందు కు అభివృద్ధి చేయలేకపోయారు? టీడీపీ హయాంలో విశాఖకు వచ్చిన పరిశ్రమలను ఎందుకు వెళ్ళగొటా ్టరు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి అభివృద్ధికి చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో భావితరాలు గర్వపడేవిధంగా రాజధాని రూపకల్పన జరిగింది. గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లోనే ప్రస్తు త పరిపాలన సాగిస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. దేశంలో ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థలు అమరావతికి వచ్చాయి. అమరావతి అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారు.రూ.మూడు వేల కోట్లు అప్పు తెచ్చుకోవడానికి అమరావతి భూముల్ని ఎకరం రూ.17కోట్లకు తనఖా పెట్టిన మాట వాస్తవం కాదా? నిజాలు భయటపెట్టండి. తనఖా రిజిస్ట్రేషన్లను ఎందు కు భయటపెట్టడం లేదు.ఇప్పటికైనా విషపూరిత మన స్తత్వం వదిలిపెట్టి మంచి దృక్పథంతో అమరావతి పై ముందుకెళ్లాలి. గతంలో బల్లులు కూడా గుడ్లు పెట్టని ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మిస్తే ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరా
రూ.75 కోట్లకు అమ్ముడుపోతుంది.
25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించిన టీడీపీ
గ్రామాల్లో 25వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మిం చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. దేవుళ్ల ను సైతం రాజకీయానికి సీఎం వాడుకోవడం దుర్మా ర్గం. కనకదుర్గ వంతెనను ఎన్నో సమస్యను ఎదుర్కొని టీడీపీ ప్రభుత్వం పూర్తిచేస్తే.. మీరు వచ్చి ప్రారంభించి మేమే నిర్మించామని చెప్పడం మీ అజ్ఞానానికి నిదర్శ నం. 75శాతం పోలవరం ప్రాజెక్టు పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తిచేస్తే.. మీ చేతగానితనంతో పోలవరం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు.పోలవరం ఎప్ప టికి పూర్తవుతుందో కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మె ల్యేలే చెప్పలేని పరిస్థితి. అనాలోచిత నిర్ణయాలు, స్వార్థం, సంకుచిత భావాలతో పరిపాలన సాగిస్తే జరి గే విధ్వంసం పోలవరం విషయంలో ప్రజలకు అర్థ మైందని ఏలూరి సాంబశివరావు వివరించారు.