అమరావతి: జగన్ రెడ్డి ప్రభుత్వం రైతు బజార్లను నిర్వీర్యంచేసిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో రైతుకు భరోసా కాదు, నిరాశే మిగిలిందని శుక్రవారం ఆమె ట్వీట్ చేశారు. రైతుపై ఏడాదికి రూ.8,400 నుంచి రూ.12,000 భారం మోపి బాదుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపూ 23 సంవత్సరాలుగా రైతులు పండిరచిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను గిట్టు బాటు ధరలకు రైతు బజార్లలో అమ్ముకుంటున్నట్లు తెలిపారు. నేడు రైతులు రైతు బజార్ల మొఖం చూడకపోవ డానికి ప్రధాన కారణం ఈ తుగ్లక్ ప్రభుత్వం పాలనేనని ఆమె పేర్కొన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం రైతులను కూడా వదలకుండా బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టడం అన్యాయం అన్నారు. రైతు బజార్లలో రైతులు నెలకు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకూ అద్దె కట్టాలని కొత్త బాదుడు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. దీంతో రైతు బజార్లు ఖాళీ అయినట్లు తెలిపారు. మధ్య దళారులు లేకుండా అటు రైతలుకు, ఇటు ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడతాయని చంద్రబాబు నాయుడు ప్రారం భించిన రైతు బజార్లు నేడు నిర్వీర్యమైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ చర్యల వల్ల కాయగూరల ధరలు పెరిగి ప్రజలపై పరోక్షంగా భారం పడుతున్నట్లు అనురాధ తెలిపారు.