అమరావతి, చైతన్యరథం: ప్రజాస్వామ్య పద్దతిలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపడం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు, పెత్తందారీ పోకడలకు పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చె న్నాయుడు పేర్కొన్నారు. తన నివాసాన్ని ముట్టడిస్తారనే భయంతో జగన్ రెడ్డి అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడను జగన్రెడ్డి అడ్డు కోవడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కరం కోసం 40రోజులుకు పైగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం, విధుల నుంచి తొలగించడం, వేతనాల్లో కోత పెట్టడం, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు దుర్మార్గమన్నారు. జగన్రెడ్డి నియంత అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలన్నారు. సమ్మెకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీతను అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీస్ వ్యానులో ఇష్టమొచ్చినట్టు తిప్పుతున్నారని తెలిపారు. ఇష్టానుసారం వ్యవహరించడానికి రాష్ట్రం జగన్రెడ్డి జాగీరా అని ప్రశ్నిం చారు. ఒక్కో అంగన్వాడీ కార్యకర్త అపరకాళిగా మారి జగన్రెడ్డి ప్రభు త్వాన్ని భస్మంచేయడం ఖాయమని అచ్చెన్నాయుడు అన్నారు.