అధికార మదంతో ఐదేళ్ల పాటు విర్రవీగిన జగన్‌రెడ్డి, వైసీపీ నేతలను 2024 సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టిన దళితుల మధ్య కులచిచ్చు రేపేందుకు భారీ కుట్రకు తెరతీశా డు. దళితులను విభజించి పాలించేందుకు మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని దళితులకు బూచిగా చూపించి 2019 ఎన్నికల్లో పార్టీకి దూరం చేసి జగన్‌రెడ్డి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తన ఐదేళ్ల పాలనలో దళితులకు రిక్తహస్తం చూపించి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. జగన్‌రెడ్డి మోసకారి బుద్ధి, సంక్షేమ పథకాలతో విసిగెత్తి మోసపోయిన దళితులు చంద్రబాబుతో ఉంటేనే తమకు నిజమైన సంక్షేమం, అభివృద్ధి లభిస్తుందని 2024 ఎన్నికల ఫలితాలతో క్లారిటీ ఇచ్చారు. 151 సీట్లు ఉన్న తనను ఎవరూ ఏమీ చేయలేరని..మరో 30 ఏళ్ల పాటు ఏపీలో పాతుకు పోవచ్చునని పగటి కలలు కన్నాడు జగన్‌రెడ్డి. ఆ అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పి చుక్కలు చూపించిన దళి త వర్గంపై జగన్ రెడ్డి విపరీతమైన కక్ష పెంచుకున్నాడు. దళితులకు సంక్షేమం, అభివృద్ధి దక్కకూడదు..వాళ్ల జీవితాలను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు.
అందుకే నందిగం సురేష్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, ఊసరవెల్లి జూపూడి ప్రభాకర్ తదితరులతో దళితుల్లో ప్రభుత్వంపై భయం కల్పించేందుకు కుట్రపూరితంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్టు అయ్యేలా చేసింది జగన్మోహన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అని వైసీపీ నేతలే కోడై కూస్తున్నారు. నందిగం సురేష్ అరెస్టును అడ్డు పెట్టుకుని జగన్‌రెడ్డి దళితులను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారంటూ దళితుల్లో విద్వేషం రెచ్చగొట్టేందుకు, ప్రభుత్వంపై ద్వేష భావాన్ని కలిగించేందుకు ప్రయత్నించారు. తన రాజకీయ మనుగడ కోసం నందిగం సురేష్‌ను ఓ పావులా వాడుకుంటున్నాడు. ఇలాంటి దళిత ద్రోహి.. దళితు లపై కపట ప్రేమ నటిస్తుంటే దీనిని వైసీపీ దళిత నేతలు సమర్థిస్తున్నారు. దళితులను ఊచకోత కోయించిన జగన్‌రెడ్డి తీరుపై వైసీపీలోని ఒక్క దళిత నేత కూడా నోరు మెదపలే దు అంటే వారికి ఆయనంటే ఎంత భయమో ఇట్టే అర్థమవుతుంది.
బోట్ల ఘటనకు కుల, రాజకీయ రంగు
40 టన్నుల బరువైన భారీ బోట్లు మూడిరటిని కట్టకట్టి ప్రకాశం బ్యారేజీని గుద్దించి కూల్చడానికి జగన్ రెడ్డి కుట్రకు ప్లాన్ చేశాడు. జగన్ వ్యక్తిగత సహాయకుడు తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌లకు సంబంధించిన బోట్లు బ్యారేజీని ఢీకొట్ట డంతో నిందితులను పోలీసులు విచారించి అరెస్టు చేశారు. ఓ ప్రాజెక్టును కుప్పకూల్చేందు కు ప్రయత్నించిన నిందితులపై పోలీసులు చర్యలు తీసుకుంటే దీనికి కూడా జగన్‌రెడ్డి రాజకీయం, కులం రంగు పులిమి తన వక్రబుద్ధిని నిరూపించుకున్నాడు. వరద ప్రవాహం లో బ్యారేజీ కిందుగా కొట్టుకుపోయిన బోట్ల యజమానులు కమ్మ కులానికి చెందిన వారని, అందుకే ప్రభుత్వం వారిని వదిలేసిందని జగన్, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అరెస్టు అయిన వారు దళితులని, టీడీపీ ప్రభుత్వానికి దళితులంటే కడుపుమంట కాబట్టే అరెస్టు చేశారని తప్పుడు ప్రచారంతో దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవానికి తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. కానీ జగన్ దీనిని కులచిచ్చు రేపేందుకు కుట్ర చేసి దళితులను భయభ్రాంతులకు గురిచేయ డానికి వాడుకోవడం పట్ల దళితుల్లో ఒకింత అసహనం, అసహ్యం కలుగుతోంది.
ఐదేళ్ల పాలనలో దళితులకు రిక్త హస్తమే
జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పాలనలో దళితులకు ఏం చేశాడు? అనే ప్రశ్న తలెత్తితే ఐదేళ్లలో మాకు రిక్తహస్తమే చూపించాడు అని దళితులు చెబుతున్నారు. చంద్రబా బును మించిన సంక్షేమం, అభివృద్ధి అందిస్తాడని ఆశపడిన దళితులకు నిరాశే మిగిలింది. చంద్రబాబు పాలనలో దళితుల అభివృద్ధి కోసం అమలు చేసిన 26 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితుల గొంతు కోశాడు.
దళితుల స్వయం ఉపాధికి గండి
దళితులను స్వయం ఉపాధి ద్వారా పది మందికి ఉపాధి కల్పించే సంకల్పంతో చంద్ర బాబు 2014-19 మధ్య కాలంలో అనేక కార్యక్రమాలు అమలు చేశారు. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 4 లక్షల మంది యువతకు సబ్సిడీ రుణాలు అందించా రు. అంతేగాకుండా దళిత రైతులకు ట్రాక్టర్లు, దళిత యువతకు ట్రక్కులతో సహా 7,500 పవర్ ఆటోలు, 273 ప్యాసింజర్ ఆటోలు, 660 డ్రైనేజీ క్లీనింగ్ వాహనాలు, 200 జేసీబీ లు, 100 ప్రొక్లెయినర్లు ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్సులు ఉన్న దళిత యువతకు రూ.20 లక్షల విలువ చేసే ఇన్నోవా కార్లు, ఇటియోస్ కార్లు 1,739 అందించారు. చంద్రబాబు 2014-19 మధ్య ఎస్సీ యువత కోసం రూ.4,450 కోట్లను సబ్సిడీ కోసం ఖర్చు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ పథకాలన్నీ రద్దు చేసి దళిత యువత, రైతులను మోసం చేశాడు. కేవలం నవరత్నాల పేరుతో డబ్బు వెదజల్లే బిస్కెట్ పథకాలపై ఆధారపడేలా చేసి దళితులను దగా చేశాడు.
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.10 వేల కోట్లు మింగిన అనకొండ
జగన్‌రెడ్డి విధ్వంస పాలనకు చట్టాలు, కోర్టు తీర్పులు ఏవీ అడ్డుకావు అని గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు గమనించారు. జగన్ రెడ్డి అవలంభించిన మరో నిరంకుశ విధానం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించడం. దళితుల అభివృద్ధి కోసమే వాడాల్సిన ఆ నిధుల ను తన జేబులోకి మళ్లించుకుని ఉత్తిత్తి బటన్లు నొక్కి దళితులకు పంగనామాలు పెట్టాడు. తన ఐదేళ్ల పాలనలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.10 వేల కోట్లు తన జేబులో వేసుకున్నా డు. ఐదేళ్లలో ఎస్సీ కాలనీల్లో ఒక్క కిలోమీటర్ కూడా సీసీ రోడ్లు వేసిన దిక్కు కూడా లేదు. చంద్రబాబు పాలనలో రూ.1,388 కోట్లతో 5,384 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించారు. వైసీపీ పాలనలో డ్రైనేజీల గురించి పట్టించుకున్న నాధుడే లేరు. వీధిలైట్లు పోయినా వేసే దిక్కులేని దుస్థితికి తెచ్చి అంధకారంలో నెట్టి దళితులకు ద్రోహం చేసిన దుర్మార్గుడు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు హయాంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.40,252 కోట్లు ఖర్చు చేశారు. జగన్‌రెడ్డి మాత్రం బడ్జెట్ పుస్తకాల్లో కేటాయింపులు ఘనంగా చూపిం చి ఖర్చు మాత్రం ఎవరికీ చూపించని పరిస్థితి.
ఎస్సీ వర్గీకరణపై వర్గాల మధ్య చీలక తెచ్చే కుట్ర
ఎస్సీ వర్గీకరణ కోసం దళితులు మూడు దశాబ్దాలుగా ఎదురు చూశారు. దళితుల్లో అసమానతలు రూపు మాపి ఆ కేటగిరీలోని వారిని సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే జగన్ రెడ్డి దీనిపైనా విషం కక్కాడు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అడ్డుపెట్టుకుని దళిత వర్గాల్లో చీలిక తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నానికి తెరలేపాడు. మాలలను రెచ్చగొట్టే విధం గా జగన్‌రెడ్డి, వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్సీ వర్గాల్లో అంతర్గత విబేధాలు సృష్టిం చి కులాల కుమ్ములాటలకు తెరలేపి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం తెచ్చేందుకు భారీ కుట్రకు పాల్పడుతున్నాడు.
ఐదేళ్లలో 7 వేల మంది దళితులపై దాడులు, 192 హత్యలు
దళితులను పూర్తిగా అధఃపాతాళానికి తొక్కాలని చూసిన జగన్‌రెడ్డి ఆ వర్గం చేతనే ఛీకొట్టించుకున్నాడు. అధికారం ఉన్న ఐదేళ్లు వారిని చిన్నచూపు చూసి నేడు కపట ప్రేమ నటిస్తున్నాడు. దళిత యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయ కుండా వేధించాడు. ఎయిడెడ్ విధానంలో అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుని దళిత లెక్చ రర్లు, టీచర్ల జీవితాలతో చెలగాటమాడాడు. పోటీ పరీక్షలకు చంద్రబాబు పాలనలో దళిత యువతకు ఉచిత శిక్షణ ఇస్తే జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వారిని ఎదగకుండా చేసేందుకు ఉచిత శిక్షణ కేంద్రాలకు మూత వేశాడు. దళిత రైతులకు బేడీలు వేసి వారిపై నే ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేశాడు. వైసీపీ నేతలు దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే అలాంటి నేరస్తులను పెంచి పోషించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించిన దళితులపై ఐదేళ్ల పాలనలో 7 వేల మందిపై దాడులు జరిగాయి.
192 మంది దళితులు హతమయ్యారు.
దళితులపై అహంకారపూరితంగా, అన్యాయంగా, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించిన జగన్‌రెడ్డి.. వారి చేతిలోనే ఛీత్కారానికి గురై నేడు ఓటమిపాలు కావడంతో వారిని ఏదో రకంగా దెబ్బతీసి కక్ష తీర్చుకోవాలని చూస్తున్నాడు. అందుకే జగన్‌రెడ్డికి సంబంధించిన ఏ అన్యాయం, అక్రమాలు బయటకువచ్చినా వాటి నుంచి దృష్టి మళ్లించేం దుకు వెంటనే కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ముఖ్యంగా దళితుల ఉనికిని అస్థిరపరిచేందుకు కంకణం కట్టుకున్నాడు. ఇలాంటి దళిత ద్రోహికి రానున్న కాలంలో దళితులే తగిన రీతిలో సమాధానం చెబుతారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తున్న జగన్‌రెడ్డి, వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ప్రజాస్వామ్యాన్నే కూలదోసే ప్రమాదముం టుంది. కుల, మత రాజకీయాలతో రాష్ట్రంలో అల్లకల్లోల వాతావరణాన్ని సృష్టించడానికి జగన్ చేసే ప్రయత్నాలను ఎక్కడికక్కడ దళితులే తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– మునీంద్ర కొడాలి,
పొలిటికల్ అనలిస్ట్