- వైవీయూను రాజకీయ కేంద్రంగా మార్చి అనైతిక కార్యక్రమాలు
- నిబంధనలకు విరుద్ధంగా అవుట్ సోర్సింగ్, బోధనేతర ఉద్యోగాలు
- విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ ప్రతినిధుల వినతి
- వై.పాలెంలో వైసీపీతో అంటకాగిన నేతలకు ప్రోత్సాహంపై ఫిర్యాదు
- పనులు చేయకుండానే లక్షలు కొట్టేసిన గుంతకల్లు వైసీపీ నాయకుడు
- సమస్యలపై ప్రజావినతుల కార్యక్రమానికి క్యూకట్టిన అర్జీదారులు
- వినతులు స్వీకరించిన మంత్రి మండిపల్లి, పల్లా శ్రీనివాసరావు
మంగళగిరి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో జగన్‌రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బావమరిది, వైవీయూ ప్రొఫెసర్, ఈసీ సురేంధ్రనాథ్‌రెడ్డి యోగివేమన విశ్వవిద్యాలయాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని రాజకీయ కేంద్రంగా మార్చాడు..విశ్వవిద్యాలయంలో వైసీపీకి అనుకూలమైన వ్యక్తులను నియమించుకుని అక్రమాలకు తెరలేపి అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు..గత ప్రభుత్వం అండతో వారి అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. నిబం ధనలను తుంగలో తొక్కి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, దినసరి వేతన, ఇతర బోధనేతర ఉద్యోగాల్లో రిజర్వేషన్ పాటించకుండా నియామకాలు జరిపించి అవకతవకలకు పాల్ప డ్డారు…విచారించి చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి వి.గంగా సురేష్, విద్యార్థి సంఘ ప్రతినిధులు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా పనిచేసే లా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిని స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, శ్రీరామ్ చిన్నబాబులు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని విద్యార్థి సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు.
- వైసీపీతో అంటకాగి ఆ పార్టీ కోసం పోస్టల్ ఓట్లను కూడా వేయించిన అధికారులను వెనకేసుకురావడం, టీడీపీ అధినేత చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వచ్చినప్పు డు ఆయనపై రాళ్లు వేయించిన వారిని నేడు నెత్తిన పెట్టుకోవడం వల్ల నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ పూర్తిగా నష్టపోతుందని దీన్ని పార్టీ పెద్దలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
- వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పి.జయరామరెడ్డి పనులు చేయకుండా లక్షల్లో డబ్బులు దోచుకున్నాడని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలిగాంట్ గ్రామానికి చెందిన ఎస్.శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. తాగునీటి బోర్లు వేయకుండా, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయకుండా చేసినట్లు చూపించి డబ్బులు మింగారని విచారించి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశాడు.
- తాము ఉపాధి కోసం ఊరు విడిచి వలస వెళ్లాం. తిరిగి వచ్చేసరికి తమ తండ్రి తమకు ఇంటి కోసం ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేశారు. తమ స్థలాన్ని విడిపించి న్యాయం చేయాలని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మధిరపాడు గ్రామానికి చెందిన దొరగుడి ప్రభుదాసు గోడు వెళ్లబోసుకున్నాడు.
- తహసీల్దారు, వీఆర్వోలు ఎటువంటి విచారణ జరపకుండా పై అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి తమకు అన్యాయం చేశారు. సర్వే నెంబర్లు మార్చి మోసం చేశారు. తప్పు డు పనులు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జల్లా వీకోట మండలం మద్దిరాళ్ల గ్రామానికి చెందిన నారాయణస్వామి కోరాడు.
- శంకర పెద్దన్న అనే వ్యక్తి తన భూమికి ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించి రాళ్లు పాతిస్తామని చెప్పడంతో రూ.40,000 ఇచ్చామని.. తీరా చూస్తే దొంగ సర్వే చేసి దొంగ పత్రాలు ఇచాడని అనంతపురం మండలం సంగమేశ్వర కాలనీకి చెందిన చింతా నారా యణ ఫిర్యాదు చేశారు. తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
- 2011లో ప్రభుత్వం ద్వారా పట్టా పొంది ఇప్పటికీ తమ స్వాధీనంలో ఉన్న భూమిని తమదంటూ ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సురేష్ బెదిరిస్తున్నాడని తమకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లద్దిపల్లె గ్రామానికి చెందిన మాల వరాదమ్మ విజ్ఞప్తి చేసింది.
- తన భర్త చనిపోయాడని..ఆయన పేరున మంజూరైన ఇంటి స్థలాన్ని తన పేరు మీద మార్చమంటే వీఆర్వో బట్టు బాలశౌరి రూ.లక్ష లంచం డిమాండ్ చేస్తున్నాడని గుంటూరు జిల్లా చుండూరు మండలం దున్దిపాలెం గ్రామానికి చెందిన గుమ్మడి సుశీలమ్మ ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
- కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అధికారులు తన ప్లాట్ ఎక్కడ ఉందో చూపించకుండా తహసీల్దారు కార్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నంద్యాల జిల్లా నంది కొట్కూరుకు చెందిన వైజుల్లా నేతల మందు వాపోయాడు.
- పుంగనూరు గొడవల్లో తాను టీడీపీ కార్యకర్తనని గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించారని పుంగనూరుకు చెందిన ఎం.నాగరాజు తెలిపాడు. అదే సమయంలో తన భార్యను ఆసుపత్రిలో చేర్పించగా ఆపరేషన్ సక్రమంగా చేయకపోవడంతో ఉన్న చూపు కూడా పోయిందని, తన భార్యకు మళ్లీ ఆపరేషన్ చేయించి ఆర్థిక సాయం చేసి ఆదుకోవా లని విన్నవించారు.
- మీర్జాపురం ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బొమ్మనబోయిన విమలాదేవి అవకతవకలకు పాల్పడి రూ.6,35,969 స్వాహా చేసిందని, ఆ నగదును రికవరీ చేసి కూలీలకు అందచేయాలని నూజివీడు మండలం మీర్జాపురం పంచాయతీ కండ్రిక గొల్లగూడెం గ్రామానికి చెందిన పలువురు ఉపాధి కూలీలు అర్జీ ఇచ్చారు.
- గత ప్రభుత్వంలో వైసీపీ నేతల ఒత్తిడి మేరకు తహసీల్దార్ సుమతి తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 1బీ అడంగల్‌ను తొలగించి తమ భూమిని అరుణమ్మ భర్త ఎర్రి స్వామి పేరుపైకి మార్చి అన్యాయం చేశారని అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన చింబిలి శ్రీకాంత్ వాపోయారు.
- భూమి తమదే అని కోర్టు ఆర్డర్ ఇచ్చినా వైసీపీ నేతల అండతో తమను భూమిలోకి వెళ్లనివ్వడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గురజాలకు చెంది న ఉన్నం నాగేశ్వరరావు నేతల ముందు వాపోయారు.
- ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని పి.గుర్రయ్య అర్జీ ఇచ్చారు.
- దివ్యాంగ పింఛన్లు, నూతన రేషన్ కార్డులు, చదువు కోసం ఆర్థిక సాయం, కారుణ్య నియామకాలు, సాంఫీుక సంక్షేమ హాస్టళ్ల ఏర్పాటు, గ్రామాల్లో మౌలిక వసతులు, ఉద్యోగా లు, కమ్యూనిటీ భవనాలు, పెండిరగ్ బిల్లులు తదితర సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరిం చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.