- కుప్పంను పులివెందుల చేయడమంటే ఇదేనా?
- పుట్టినబిడ్డలు పురిట్లోనే పోతున్న వైనం
- మాతృత్వానికి దూరమవుతున్న మహిళలు
- ఎన్ జిటి చెప్పిన భద్రతాచర్యలు బేఫికర్!?
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
అధికారం కోసం సొంత బాబాయ్‌నే హతమార్చిన రక్తచరితుడు, నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత స్వార్థం కోసం నియోజకవర్గ ప్రజలను బలి పశువులుగా చేసేందుకు సైతం సిద్ధపడ్డారు. పులి వెందుల నియోజకవర్గంలో యురేనియం కర్మాగార వ్యర్థాలవల్ల తాగునీరు, సాగునీరు విషపూరితమై మహిళలు మాతృత్వానికి దూరమవుతున్నా, పుట్టినబిడ్డ లు పురిట్లోనే కన్నుమూస్తున్నా కసాయి జగన్ రెడ్డికి కనికరం కూడా లేదు. తుమ్మలపల్లి యురేనియం కర్మాగార కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఎన్ జిటి ఆదేశించినా పట్టించుకున్న పాపానపోలేదు.
కడపజిల్లాలో ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గం పులివెందులలో అత్యంత ప్రమాదకరమైన యురేనియం కర్మాగారం అక్కడి ప్రజలకు ప్రజలకు శాపంగా మారింది. స్వార్థ ప్రయోజనాల కోసం అత్యంత ప్రమాదకరమైన యురేనియం కర్మాగారాన్ని నాటి ముఖ్యమంత్రి వైఎస్ పులివెందులకు తేగా.. నేటి ముఖ్యమంత్రి జగన్ సొంత గడ్డను విషతుల్యం చేస్తూ వేలాది కుటుంబాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) ఆధ్వర్యంలో వైఎస్ ప్రభుత్వ హయాంలో 2007లో పనులు మొదలు పెట్టి, 2012 నుంచి కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభించారు. కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలో ప్రపంచం లోనే అత్యధిక యురేనియం నిల్వలున్నట్లు గుర్తించి అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు 4గ్రామాల పరిధిలో 2,240 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించారు. యురేనియం కర్మాగారం వల్ల భవిష్యత్ లో ఎదురయ్యే సమస్యలను గుర్తించిన తుమ్మలపల్లి, పరిసర గ్రామాల ప్రజలు అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. స్థానికులకు ఉద్యోగాలు, వస్తాయని,దీనివల్లఎటువంటి ప్రమాదం ఉండదని నచ్చజెప్పి నాటి ముఖ్యమంత్రి వైఎస్ యురేనియం కర్మాగారాన్ని ఏర్పాటు చేయించారు.
పుట్టినబిడ్డలు పురిట్లోనే పోతున్న వైనం
యురేనియం కర్మాగారం నుంచి వెలువడుతున్న ప్రమాదకర విషరసాయనాలు కారణంగా ఈ పరి శ్రమకు చుట్టుపక్కల ఉన్న 7గ్రామాల్లో పుట్టిన బిడ్డలు పుట్టినట్లే అనంతవాయువుల్లో కలసిపోతున్నారు. ఒకవేళ బతికి బట్టకట్టినా అంగవైకల్యం, తీవ్ర అనా రోగ్య సమస్యలతో పుడుతున్నారు. యురేనియం కర్మా గార ప్రభావిత గ్రామాల్లో మహిళలు గర్భందాల్చిన కొద్ది కాలానికే అబార్షన్ అవుతోంది. ఈ గ్రామాల్లో గర్భం దాల్చిన మహిళలు తరచూ గర్భ విచ్చితి జరగుతున్న హృదయ విదార ఘటనలు చోటు చేసుకుంటున్నా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు ఇక్కడ ప్రజలు విన్నపాలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకొని వ్యర్థాలవల్ల జరిగే విపరిణామాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర అణుశక్తి విభాగాన్ని ఆదేశించింది. ఈ కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలు నేలలో ఇంకకుండా టెయిల్ పాండ్ కింద 250మైక్రాన్ మందంలో పాలిథిన్ పొర ఏర్పా టు చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇచ్చిన తూతూమంత్రం నోటీసులు సంబంధిత యాజమాన్యం పట్టించుకోలేదు. రాజకీయ, వ్యాపార ప్రత్యర్థులపైకి ఒంటికాలుతో వెళ్లే జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంతటి ఘోరం జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం అక్కడి ప్రజ లను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.
గర్బందాల్చిన వెంటనే ఊళ్లకు దూరంగా!
ఇక్కడి కలుషిత నీటిని తాగడం, ఇక్కడ పండిన పంటలను ఆహారంగా తీసుకోవడం వల్ల మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని వైద్యులు ధృవీకరిస్తున్నారు.దీంతో గర్భం దాల్చిన వెంటనే ఈ గ్రామాలకు చెం దిన మహిళలను కుటుంబీకులు దూరప్రాంతాలకు తరలించి ప్రసవం తర్వాత మళ్లీ ఇళ్లకు రప్పిస్తున్నారు. చిన్నపిల్లలనుంచి వృద్ధుల వరకు చర్మవ్యాధులకు గురవుతున్నారు. కొందరికి చర్మంపై యాసిడ్ పడినట్లుగా బొబ్బలు వస్తున్నాయి.యురేనియం కాలుష్య ప్రభావం వందల సంవత్సరాలు ఉంటుందని, ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో పెనువిపత్తుగా మారే ప్రమా దం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతజరుగుతున్నా ప్రభుత్వంలో చలనంలేకపోగా,పరి శ్రమ విస్తరణకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తోంది.ప్రస్తుతం ఇక్కడ పరిశ్రమ ద్వారా రోజుకు 3వేల టన్నుల యురేనియం ఉత్పత్తి అవుతుండగా, 4 వేలటన్నులకుపెంచాలని యుసిఐఎల్ ప్రయత్నిస్తోంది.
కాలుష్య నియంత్రణ మండలి ఏంచేస్తోంది?
భూగర్భాన్ని అత్యంత కలుషితం చేస్తున్న యురేనియం శుద్ధి కర్మాగారంపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఆగస్టు 7, 2019న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చారు. అయితే రెండేళ్లయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అణుశక్తి నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం తాగునీటిలో యురేనియం గాడత పిసిబి (పార్టికల్స్ ఫర్ బిలియన్) 60వరకు ఉండొచ్చు. అయితే తుమ్మలపల్లి, పరిసర ప్రాంతాల్లో 70రెట్లు అధికంగా పిసిబి గాఢత 4000 గా నమోదైంది. మాపల్లెల్లో 10రోజులు ఉండి మేం తాగే నీటిని తాగండి, అప్పుడు మా సమస్య తెలుస్తుంది. మేం తాగే నీటిని అల్యూమినియం పాత్రలో 25రోజులు ఉంచితే రంధ్రాలు పడుతున్నాయి, ఇక మనుషులు ఎలా తట్టుకుంటారు అని 2019 సెప్టెం బర్‌లో నిర్వహించిన విచారణలో బాధిత గ్రామాల ప్రజలు పిసిబి ఎదుట మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. కర్మాగారంలో యురేని యం వెలికితీత, శుద్ధి సందర్భంగా పెద్ధఎత్తున వ్యర్థాలు వెలువడి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.
లోపభూషయిష్టంగా టెయిల్ పాండ్
తుమ్మలపల్లిలోని యురేనియం కర్మాగారం వ్యర్థాలను కెకె కొట్టాలలో ఏర్పాటుచేసిన టెయిల్ పాండ్ కు తరలించి అక్కడనుంచి సంపుల్లోకి పంపి శుద్ధిచేసి తిరిగి పరిశ్రమ అవసరాలకే వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో టెయిల్ పాండ్ లో కొంతమేర వ్యర్థాలు పేరుకుపోయి భూమిలో కలిసి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. నిర్థిష్ట ప్రమాణాలకు లోబడి టెయిల్ పాయిండ్ ను ఏర్పాటుచేయకపోవడంతో సమీపంలోని గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. దీనిని నివారించేందుకు టెయిల్ పాండ్ చుట్టూ నిబంధనల మేరకు లైనింగ్ ఏర్పాటు చేసి అడుగు భాగంలో 250 మైక్రాన్ల మందంతో పాలియాథిలిన్ పొర ఏర్పాటుచేయాలని కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చినా పట్టించు కోలేదు.
అన్నదాత కంట రక్తం కారుతోంది
యురేనియం కర్మాగారంతో క్యాన్సర్ వంటి ప్రమా దకర వ్యాధులతోపాటు పలురకాలైన చర్మవ్యాధులు వ్యాపించి పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. పులివెందుల మండల పరిధిలోని కణంపల్లి, కోట, వేముల మండలం కెకె కొట్టాల, తుమ్మలపల్లి, భూమ య్యగారిపల్లి,మబ్బుచింతపల్లి, రాచకుంటపల్లి మొత్తం 7గ్రామాల్లో యురేనియం కర్మాగార కాలుష్య ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. ఈ గ్రామాల్లో బోర్ల ద్వారానే అత్యధికంగా పంటలు సాగుచేస్తుండగా, బోర్లలో నీరు కలుషితమై పంటలు దెబ్బతింటున్నాయి. భూగర్భ జలాలు కలుషితం అవుతుండటంతో 7 గ్రామాల పరి ధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు భూములను బీళ్లుగా వదిలేస్తున్నారు. ముఖ్య మంత్రి సొంత నియోజకవర్గంలోని ప్రజలు యురేని యం శుద్ధి కర్మాగారం కాలుష్యంతో అల్లాడిపోతున్నా మని, ప్లాంట్ మూసివేయాలని పలుమార్లు మొరపెట్టు కున్నా ప్రభుత్వంలో స్పందనలేదు. యురేనియం కర్మా గారం కాలుష్యం కారణంగా పులివెందుల నియోజక వర్గ పరిధిలోని 7 గ్రామాల్లో మట్టి, నీరు కలిషితమై పంట ఉత్పత్తులు తినడానికి వీల్లేకుండా కలుషిత మవుతున్నాయి.
కాగితాలకే పరిమితమైన ఎత్తిపోతల పథకం
యురేనియం బాధిత గ్రామాల్లో సాగు, తాగునీటి సరఫరా కోసం 1113కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లె వద్ద 2టిఎంసిల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించాలి. లింగాల మండలం చిత్రావతి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి అక్కడనుంచి ఎర్రబెల్లి చెరువుకు తద్వారా గిడ్డంగివారిపల్లె వద్ద నిర్మించే జలాశయాన్ని నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. దీని ద్వారా 7 యురేనియం బాధిత గ్రామాల్లో 10వేల ఎకరాల్లో సూక్ష్మసేద్యం పద్ధతిలో సాగు, తాగునీరు అందించాల్సి ఉంది. అయితే 2021-22, 2022-23 బడ్జెట్లలో ఈ ఎత్తిపోతల పథకానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. రుణాలు సేకరించి పనులు చేపడతామని అధికారులు చెబుతున్నా రాష్ట్రంలో నెల కొన్న అస్తవ్యస్థ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఇటీవల కుప్పం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కుప్పం నియో జకవర్గాన్ని పులివెందులలా మార్చేస్తానని సెలవిచ్చా రు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి సొంత నియోజక వర్గ ప్రజలను కాపాడుకోలేని జగన్‌రెడ్డి కుప్పంలో ఏదో ఇరగీదీస్తానని చెప్పడం హాస్యా స్పదంగా ఉంది. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తుమ్మలపల్లి యురేనియం కర్మాగార బాధిత గ్రామాల ప్రజలను కాపాడాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.