- బుడమేరుకు గండ్లు..నగర ప్రజలకు కడగండ్లు
- నాటి టీడీపీ ప్రభుత్వంలో డైవర్షన్ పనులకు రూ.464 కోట్లు
- రూ.150 కోట్లతో పనులను కూడా చేయించిన చంద్రబాబు
- వైసీపీ అధికారంలోకి వచ్చాక పనులను గాలికొదిలేసిన వైనం
- పట్టించుకోకపోగా మట్టి, ఇసుకను తవ్వేసుకుని వ్యాపారం
- కుచించుకుపోయి పిల్ల కాలువలా మారిన బుడమేరు వాగు
- ఫలితంగా విజయవాడ నగర ప్రజలను ముంచెత్తిన వరదనీరు
- ఆనక దొంగ ఓదార్పులు..ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు
- వరదల దగ్గర శవ రాజకీయాలపై తిట్టిపోస్తున్న బాధితులు
- పరామర్శకు వచ్చిన ఆ పార్టీ నేతలను తరిమికొడుతున్న వైనం
- ప్రాజెక్టుల నిర్వహణను వదిలేసి అనుచరులతో దోపిడీపై ఆగ్రహం
- ప్రకాశం బ్యారేజ్ నిర్వహణ గ్రీజుకూ రూపాయి విదల్చని ఫేక్‌రెడ్డి
అమరావతి(చైతన్యరథం): జగన్‌రెడ్డి వినాశనం ఫలితం నేడు విజయవాడ నగరానికి వరదలు ముంచెత్తి ప్రజల ప్రాణాలు తీసింది. కట్టుబట్టలతో రోడ్డున పడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇంత విపత్తుకు ప్రధాన కారణం నాటి అరాచక పాలనే. చేసిందంతా చేసి నేడు మొసలికన్నీరు కారుస్తూ వరద బాధితులను పరామర్శించడానికి వచ్చి ఐదు నిమిషాలు షో చేసి విషం చిమ్మాలని కంకణం కట్టుకున్నాడు. శవరాజకీయాలను, కుటిల బుద్ధిని బయట పెట్టుకున్నారు. వరద బాధితులే ఆయనను తిట్టిపోశారంటే ఆయన అరాచక పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెజవాడ ప్రజల కన్నీటి ఘోషకు… ఇంతటి ఘోర విపత్తుకు బుడమేరు గండ్లే ప్రధాన కారణం కాగా అక్కడ గండ్లకు కారణమైన మైనింగ్ భకాసురులు వైసీపీలోనే ఉన్నారు. గత ప్రభుత్వ పాలనలో బుడమేరు డైవర్షన్ పనులను గాలికొదిలేసిందే కాక మట్టి, ఇసుక దోపడీ చేయడం వల్లే వాగు కుచించుకుపోయి గండ్లు పడి నేడు బెజవాడ బలైందనేది వాస్తవం.
బుడమేరు డైవర్షన పనులకు టీడీపీ బీజం..రూ.464 కోట్లు కేటాయింపు
బుడమేరు విస్తరణకు దాని డైవర్షన్ పనులకు నాడు అధికారంలో ఉన్న టీడీపీ రూ.464 కోట్లు కేటాయించింది. దాదాపు రూ.150 కోట్లు పనులకు ఖర్చు పెట్టారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ బుడమేరు అభివృద్ధిని గాలికొదిలేసి పట్టించుకోకపోగా ఆ పార్టీ నేతలు భకాసురుల్లా బుడమేరుపై పడి మట్టి, ఇసుకను బొక్కారు. ఫలితంగా విస్తరణకు నోచుకోవాల్సిన వాగు పిల్ల కాలువలా మారింది. దాని ఫలితమే బుడమేరు గండ్ల నుంచి విజయవాడ నగరానికి వరద పోటెత్తి ముంచింది. ఉపద్రవంలా వచ్చిన వరదకు ప్రజలకు ఎటుపోవాలో అర్థం కాని పర్థితి నెలకొంది. ఆపద్బాంధవుడిలా ప్రజల కష్టాలు.. వరదలను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కలిగిన చంద్రబాబు స్పందించి నేరుగా రంగంలోకి దిగి యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. నేతలు, పార్టీ శ్రేణులతో ముమ్మర సహాయ చర్యలు చేపట్టారు. వరద బాధితుల ఆకలిదప్పికలు తీర్చారు. 74 ఏళ్ల వయసులో కూడా జేసీబీ ఎక్కి నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు. వారి కన్నీళ్లను తుడిచారు. అంతా అయ్యాక తగుదనమ్మా అంటూ వచ్చిన జగన్ వరద నీటిలో ఉన్న జనాలకు దాహం తీర్చేందుకు గుక్కెడు మంచినీళ్ల ప్యాకెట్లు కూడా ఇవ్వకపోగా విష ప్రచారానికి పూనుకున్నాడు. ఇక్కడెక్క డో ఉన్న చంద్రబాబు ఇంటి కోసం అక్కడెక్కడో గేట్లు ఎత్తారని విషప్రచారం చిమ్మి పోవ డంపై వరద బాధితులే భగ్గుమంటున్నారు.
మొద్దు నిద్రలో జగన్ భక్త అధికారులు.. పరుగులు పెట్టించిన చంద్రబాబు
వైకాపా మత్తు వీడని అధికారులు కొంతమంది ఇంకా ఆ నిద్రమత్తులో ఉండటంతోనే విపత్తు ఉధృతంగా ఉందని… అధికారులు ముందే మేల్కొని ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదని అంటున్నారు. ముందే గండ్లను గుర్తించి పూడిస్తే బెజవాడపైకి బుడమేరు వరద పోటెత్తేది కాదని నగర వాసులు అంటున్నారు. ఇంత జరిగినా కొంతమంది అధికారులు వైసీపీ మత్తులోనే సహాయక చర్యలకు దూరంగా తమకు పట్టనట్లు ఉన్నారు. నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగడంతో చర్యలు తప్పవన్న ఉద్దేశంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ట్రాక్టర్లు, బుల్డోజర్ ఎక్కి బాధితులకు భరోసా కల్పించి ఆదుకున్న దేవుడంటున్నారు. అధికారులను పరుగులు పెట్టించి సాయం చేయడం వలనే బాధితుల ఆకలిదప్పికలు తీరాయని చెబుతున్నారు. బాధితులకు సాయం చేయకుం డా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఉత్తర కొరియాలో వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 30 మంది అధికారులను అక్కడ కిమ్ ఉరితీశాడని అలాంటి కఠిన చర్యలు ఉంటే తప్ప వైసీపీ నేతలకు కొమ్ము కాస్తు న్న అధికారులకు గుణపాఠం రాదని జనం ఛీకొడుతున్నారు.
జగన్ అండ్ కోకు దోపీడీపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదు
జగన్‌రెడ్డి, ఆయన అనుచరులకు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల నిర్వహణపై లేదు. జగన్ రెడ్డి వైఫల్యం వలనే తన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ప్రజలు ప్రాణా లు కోల్పోయారు. పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుపోయి రైతులకు సాగునీరు అంద కున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు మండిపడుతున్నారు. నదులు, రిజర్వాయ ర్లలో ఉన్న ఇసుకను బొక్కి వందల కోట్లు వెనకేసుకున్న వైసీపీ నేతలు ఏనాడూ సాగునీటి ప్రాజెక్టులను, కాలువలను పట్టించుకోలేదు. దాంతోనే ఎక్కడికక్కడ వాగులు, కాలువలు, డ్రైన్‌లు కుచించుకుపోయి బుడమేరులా భయంకరమైన వరదలకు కారణం అవుతున్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికారం చేపట్టిన కొత్త ప్రభుత్వం.. ప్రాజెక్టు ల పరిస్థితిపై అధ్యయనానికి రంగం సిద్ధం చేసింది. ప్రాజెక్టులు సక్రమంగా ఉండి రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందనేది జగన్‌రెడ్డి పూర్తిగా విస్మరిం చాడు. వాటిని గాలికొదిలేసి అనుచర గణం దోచుకునేందుకు సహకరించాడు. ఆ పర్య వసానమే నేడు విపత్తులకు కారణమని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాయం కోసం పిలుపునిచ్చిన చంద్రబాబు… వెల్లువెత్తిన విరాళాలు
వరద పోటెత్తి కన్నీరుమున్నీరు అవుతున్న జనాలను ఆదుకునేందుకు వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కేంద్ర బృందాలను రంగంలోకి దింపడం, పడవలు, హెలికాప్టర్లు, డ్రోన్లతో బాధితులను కాపాడటం, బాధితుల ఆకలి బాధలు తీర్చడానికి ఆహార పదార్థాలు అందించడం, వరద బాధితులను ఆదుకునేందుకు సహాయం కోరడంతో వందల మంది మానవత్వంతో స్పందించి తమ వంతుగా బాధితులకు ఆహార పదార్థాలు, విరివిగా విరాళాలు ఇస్తున్నారు. పవన్‌కళ్యాణ్, నారా భువనేశ్వరి, ఎన్టీఆర్, ఈనాడు సంస్థలతో పాటు అనేకమంది ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ముఖ్య మంత్రి సహాయనిధికి తమ విరాళాలను అందించి మానవత్వం చాటుకున్నారు. చంద్రబాబు పిలుపునకు ప్రజల్లో వచ్చిన స్పందనతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.