- వాస్తవ అప్పులెంత.. మీరు చూపుతున్నదెంత?
- మీరు చెప్పేది నిజమైతే పిఎజి ఎందుకు లెటర్ రాసింది?
- టిడిపి హయాంలో సగటు జిఎస్ డిపి 10.36శాతం
- వైసిపి మూడేళ్లలో సగటు జిఎస్ డిపి 6.13 శాతం
- మూలధన వ్యయం టిడిపి హయాంలో 23శాతం తక్కువ
- సరిగా కాలేజికి వెళ్తే వాస్తవ లెక్కలెంటో తెలిసేది!
- ఇంకా ఎంతకాలం తప్పుడు లెక్కలతో మోసగిస్తారు?
(చైతన్యరథం ప్రత్యేకప్రతినిధి – అమరావతి)
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన గణాంకాలు పరిశీలించాక అర్థమవుతున్నదేమంటే దొంగలెక్కలు చెప్పడంలో దిట్ట అయిన ఎ2 విజయసాయిరెడ్డి ప్రభావం నుంచి ఆయన ఇంకా బయటపడలేదని స్పష్టమవుతోంది. ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో వాస్తవ గణాంకాలను మరుగునపెట్టి తప్పుడు లెక్కలు చెప్పడం ముఖ్యమంత్రి జగన్ కే చెల్లింది. రాష్ట్ర అప్పులు, జిఎస్ డిపి, మూలధన వ్యయం తదితర అంశాల్లో పూర్తి అసత్యాలను ముఖ్యమంత్రి అలవోకగా చెప్పి తప్పుడు లెక్కల్లో తనకు మించిన దిట్ట లేరని మరోమారు నిరూపించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రూ.16వేల కోట్ల రూపాయల లోటుతో కనీసం గూడుకూడా లేని స్థితిలో పాలనా బాధ్యతలు తీసుకున్న దార్శనిక నేత చంద్రబాబునాయడు.. అత్యంత ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందిన గుజరాత్, మహారాష్ట్రల సరసన ఎపిని చేర్చేందుకు అహోరాత్రులు శ్రమించారు. దోపిడీ, విధ్వంసాలే ఎజెండాగా గత 40నెలలుగా పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి టిడిపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతూ తాను ఎంతో మెరుగ్గా నిలబెట్టానని సిగ్గులేకుండా చెబుతున్నారు. స్థూలంగా జగన్ రెడ్డి చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే ఉద్యోగుల పిఎఫ్ ఖాతాల నుంచి 7వేల కోట్లు, పంచాయితీల నుంచి ఆర్థిక సంఘం నిధులు 7,660 కోట్లు వారికి తెలియకుండా ఎందుకు దొంగిలించారు? రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై ముఖ్యమంత్రి చెబుతున్న తప్పుడు లెక్కలేమిటి? వాస్తవమేమిటి అన్న విషయాన్ని చైతన్యరథం ఆధారాలతో సహా ప్రజలముందు ఉంచుతోంది.
జిఎస్, డిఎపి ఎవరి హయాంలో ఎంత?
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి శాసనసభలో తాముచేసిన అభివృద్ధి అభివృద్ధి వల్ల రాష్ట్రంలో జిఎస్ డిపి టిడిపి కంటే మెరుగ్గా సాధించానని తప్పుడు లెక్కలను వల్లెవేశారు. టిడిపి ప్రభుత్వం 2019లో ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారం 2014-19 నడుమ సగటు రాష్ట్ర జిఎస్‌డిపి 10.36శాతం కాగా, 201-22 నడుమ జగన్ రెడ్డి ప్రభుత్వ మూడేళ్ల హయాంలో సగటు జిఎస్‌డిపి కేవలం 6.13శాతం మాత్రమే. టిడిపి హయాంతో పోలిస్తే వైసిపి హయాంలో జిఎస్‌డిపి 5శాతానికి పైగా తక్కువగా ఉంటే ఏవిధంగా మెరుగ్గా ఉన్నామని చెబుతారు?
రాబడుల్లోనూ తప్పుడు లెక్కలు
వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రప్రభుత్వం రెవిన్యూ రాబడులు చాలా బాగున్నాయని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసెంబ్లీలో సెలవిస్తున్నారు. ఉద్యోగులు పిఆర్‌సి కోసం ఆందోళనలు చేసినపుడు మాత్రం కరోనా కారణంగా రాష్ట్రప్రభుత్వ రాబడులు తగ్గిపోయాయని, ఉద్యోగులు సహృదయంతో అర్థం చేసుకోవాలంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సకలశాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి బీద అరుపులు అరిచారు. ఈరెండు మాటల్లో ఏది నిజమో రెండునాల్కల ముఖ్యమం త్రిగా పేరొందిన జగన్‌రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంది. రాష్ట్రంలో ఏ క్షణానైనా ఫైనాన్షియల్ క్రాష్ సంభవించవచ్చని ప్రముఖ జాతీయ దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది. ముఖ్యమంత్రి తప్పుడు గణాంకాలు మాని వాస్తవాన్ని ప్రజల ముందుంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మూలధన వ్యయంలో తప్పుడు లెక్కలు
తెలుగుదేశం ప్రభుత్వం కంటే తమహయాంలో అధికంగా మూలధన వ్యయం చేశామని జగన్‌రెడ్డి నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారు. వైసిపి ప్రభు త్వం మూడేళ్లలో చేసిన వాస్తవ మూలధన వ్యయం రూ.49,745 కోట్ల రూపా యలుకాగా,తాము మూడేళ్లలో రూ.55,086 కోట్లు ఖర్చుచేశానని చెబుతున్నా రు. అసలు నిజమేమిటంటో బడ్జెట్ కేటాయింపుల్లో టిడిపి ప్రభుత్వం చివరి మూడేళ్లలో చేసిన సగటు మూలధన వ్యయం 76.58శాతం కాగా, వైసిపి ప్రభుత్వం మూడేళ్లలో చేసిన సగటు మూలధన వ్యయం 53.58 శాతం. అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన వ్యయం కంటే 23శాతం తక్కువ ఖర్చుచేసి..తాము టిడిపి కంటే ఎక్కువచేశామని తప్పుడు లెక్కలు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారం విభజన నాటికి రాష్ట్రరుణాలు రూ.1.26 లక్షల కోట్లు. టిడిపి ప్రభుత్వం దిగి పోయే నాటికి రూ.2.69 లక్షల కోట్లు. అంటే ఏడాదికి చేసిన అప్పు కేవలం రూ.28,600 కోట్లు. ఆయన చెబుతున్న ప్రకారం వైసిపి ప్రభుత్వం ఈ ఏడాది మార్చినాటికి రాష్ట్ర అప్పు 3.82 లక్షల కోట్లు. అంటే మూడేళ్లలో చేసిన బడ్జెటరీ అప్పులు 1.13లక్షల కోట్లు. అంటే సగటున వైసిపి ప్రభుత్వం చేసిన అప్పు రూ. 37,666 కోట్లు. జగన్ రెడ్డి లెక్కల ప్రకారం 37,666 కోట్ల కంటే టిడిపి హయాంలో ఏడాదికి చేసిన 28,600 కోట్ల రూపాయల అప్పు ఎక్కువ.
వాస్తవానికి జగన రెడ్డి అప్పులపై చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇప్పటివరకు బడ్జెట్ లో చూపిన అధికారిక అప్పులతోపాటు బడ్జెట్ లో చూపని వివిధ మార్గాల ద్వారా తెచ్చిన అప్పులు, కాంట్రాక్టర్లకు చెల్లించని బిల్లులు అన్నీ కలిపి రాష్ట్రప్రభుత్వ వాస్తవ అప్పు 8.60లక్షల కోట్లు. బడ్జెట్ తో సంబంధం లేకుండా జగన్ రెడ్డి చేసిన అడ్డగోలు అప్పులపై 6-5-2022న ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్ కార్యాలయం రాష్ట్రప్రభుత్వానికి ఒకలేఖ రాస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏ సోర్సు ద్వారా రుణాలు తెచ్చినప్పటికీ తమకు వివరాలు అందజేయాలని ఓ లేఖరాసింది. సంబంధిత లేఖకు ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం నుంచి సమాధానం లేదు. తప్పుడు లెక్కలకు అలవాటుపడిన జగన్ రెడ్డి ప్రభుత్వం వాస్తవాలను మరుగునపెట్టి గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.