అమరావతి : అగ్రరాజ్యం అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పరిధిలో ఒక విద్యార్థిపై ఏపీకి చెందిన సత్తారు వెంకటేశ్రెడ్డి, నిఖిల్, శ్రవణ్ అనే ముగ్గురు వ్యక్తులు దారుణమైన హింసకు పాల్పడగా, ఆ ముగ్గురిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిం చారు. సైకో జగన్ ఆంధ్రప్రదేశ్ జనాల రక్తం పీల్చుతుంటే…ఆయన అనుచర పిల్ల సైకోలు ఏపీ యువతపై శాడిజం చూపిస్తు న్నారని అన్నారు. ఏపీకి చెందిన 20 ఏళ్ల కుర్రాడికి బంగారు భవిష్యత్తును చూపించి, అమెరికాకు రప్పించి…అక్కడ కూడా తమ అధినేత జగన్ మాదిరే వైసీపీ నేత సత్తారు వెంకటేశ్రెడ్డి సైకోయిజం చూపించాడని మండిపడ్డారు. ఆ కుర్రాడిని తన ఇంట్లో బంధించి, కొట్టి, చిత్రహింసలపాలు చేశా డని అన్నారు. ఏపీలో అయితే బాధిత యువకుడిపైనే రివర్స్ కేసు పెట్టి, సీఐడీతో దర్యాప్తు చేయించేవారని దుయ్యబట్టారు. అమెరికా ప్రభుత్వం ముందు వైసీపీ సైకోల ఆటలు సాగలేదని…పిల్ల సైకోలు చట్టానికి చిక్కారని అన్నారు.