• అభిప్రాయం
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి అసమర్థతే రైతుల పాలిట శాపం: చంద్రబాబు

తుఫాన్‌, కరువు నష్టంపై శ్వేతపత్రం ప్రకటించాలి

చైతన్యరధం by చైతన్యరధం
December 15, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
0
జగన్‌రెడ్డి అసమర్థతే రైతుల పాలిట శాపం: చంద్రబాబు
0
SHARES
164
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.10 వేల కోట్ల పంట నష్టం జరిగితే కేవలం 700 కోట్ల రూపాయల మేరకే నివేదిక ఇవ్వడమేంటి?
  • ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో వెల్లడిరచాలి
  • ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పాలి
  • తుఫాన్‌, కరువు నష్టంపై శ్వేతపత్రం ప్రకటించాలి

అమరావతి,చైతన్యరథం: జగన్‌రెడ్డి అసమర్థత, అహంకార వైఖరి రైతుల పాలిట శాపంలా మారిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మిచౌంగ్‌ తుఫాన్‌ వల్ల 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 31 రకాల పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టం దాదాపు 10 వేల కోట్ల రూపాయల పైన ఉండగా కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే జరిగిందని కేంద్రానికి నివేదిక ఇవ్వడమేంటని ప్రశ్నించారు.  రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయిందని, ప్రాజెక్టుల, పంట కాల్వల నిర్వహణలో జగన్‌రెడ్డి అసమర్థత కారణంగానే ఇంత భారీ నష్టం జరిగిందని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్లను ఆపలేకపోవచ్చునని, కానీ నష్ణాన్ని నివారించగలమన్నారు. ఆ పని చేయడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తుఫాన్‌ వస్తుందని తెలిసినా, ఎన్నో రోజుల నుండి హెచ్చరికలు వస్తున్నా, రైతులను అప్రమత్తం చేసి పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు.

ప్రాజెక్టుల, పంట కాల్వల నిర్వహణలో నిర్లక్ష్యం

జగన్‌రెడ్డి ప్రభుత్వం సాగునీటి రంగంపై శీతకన్ను వేసిందని, ప్రాజెక్టుల నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వ హయంలో ప్రాజెక్ట్‌ల నిర్వహణకు బడ్జెట్‌ను కేటాయించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవాళ్లమని, దాని వల్ల రైతులకు చాలా ఉపయోగం జరిగిందన్నారు.  కానీ జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్వహణ లోపం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్‌ కొట్టుకుపోయిందని, పులిచింతల గేటు ఊడిపోయిందని, గుండకమ్మ ప్రాజెక్ట్‌కయితే రెండుసార్లు గేట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. ఎనిమిది కోట్ల రూపాయలతో గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌కు గేట్లు అమర్చేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని, దీంతో గేట్లు తెగిపోయి ఆ ప్రాజెక్ట్‌లోని రెండు టీఎంసీల నీరు వృథాగా పోయిందన్నారు. దీంతో నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతానికి నష్టం జరిగిందని, ఇది జగన్‌రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. పంట కాల్వలు, డ్రైన్లను సరిగ్గా నిర్వహించని కారణంగా తుఫాన్‌ వల్ల వచ్చిన వరదంతా పంట పొలాల్లోనే నిలిచిపోయిందన్నారు.  పంట పొలాలన్నీ సముద్రంలా తలపించాయని, డ్రైన్ల నిర్వహణ సరిగ్గా చేసి ఉంటే రైతులకు అంత నష్టం జరిగేది కాదని, ఇది జగన్‌రెడ్డి నిర్లక్ష్యానికి, వ్యవసాయమంటే పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు.

నేను పట్టిసీమ కట్టానని.. నీళ్లు వదలలేదు

నవంబర్‌, డిసెంబర్‌లో వచ్చే తుఫాన్ల నుంచి తప్పించేందుకు ముందుగానే ఖరీఫ్‌ పంట తీసుకొచ్చేందుకు పట్టిసీమ ప్రాజెక్ట్‌ను నిర్మించామని, నాలుగేళ్ల పాటు రైతులు ప్రయోజనం పొందారని, అయితే జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు తెలిపారు. గోదావరి నీళ్లు త్వరగా వస్తాయని, ఆ నీరు సారవంతంగా కూడా ఉంటుందని, దీంతో రైతులకు ఎంతో లాభం జరిగిందని చెప్పారు. అయితే తాను పట్టిసీమను కట్టాననే కోపంతోనే జగన్‌రెడ్డి గత నాలుగేళ్ల నుండి పట్టిసీమ నుండి నీళ్లు వదలలేదని, ఈ ఏడాది రైతులు తిరగబడి తంతారనే భయంతోనే నీళ్లు వదలారని, కానీ అప్పటికే ఆలస్యమైపోయిందని తెలిపారు. పట్టిసీమలో ముందుగానే నీళ్లు ఇచ్చి ఉంటే ఈ తుఫాన్‌ ప్రభావం నుండి కృష్ణా డెల్టా తప్పించుకునేదన్నారు.

తుఫాన్‌, కరువు నష్టంపై శ్వేతపత్రం ప్రకటించాలి

తుఫాన్‌కు తోడు ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారని, వారిని ఆదుకోవాల్సిన జగన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. ఇంతవరకు ఎన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదో చెప్పడం లేదన్నారు. వెంటనే ప్రాంతాల వారీగా పంటల వారీగా ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా నష్టపోయిన పంటలకు ఎంత పరిహారం ఇస్తారో కూడా ప్రభుత్వం చెప్పడం లేదని అన్నారు. గత నాలుగేళ్ల నుండి పంటల బీమా కట్టని కారణంగా అంతిమంగా రైతులే నష్ట పోయారని తెలిపారు. సీఎం అంటే కష్టాల్లో ఉన్న వారికి భరోసా కల్పించాలని, దోపిడీ చేయడం కాదని అన్నారు. తుఫాన్‌ కారణంగా 22 లక్షల ఎకరాల్లో రూ. 10 వేల కోట్ల మేర పంట నష్టం జరిగితే కేవలం 700 కోట్ల రూపాయల మేరకే పంటనష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక ఇవ్వడం ఏంటని, ఇక కేంద్రం నుండి ఏం నిధులు వస్తాయని ప్రశ్నించారు. తుఫాన్‌ కారణంగా భారీగా నష్టం జరిగితే కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం జగన్‌రెడ్డి అలెర్ట్‌ చేయలేదని, జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తాను ప్రధానికి లేఖ రాశానని గుర్తు చేశారు. ఒక వైపు తుపాను, మరోవైపు కరువు కారణంగా రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. కరువు కారణంగా 25 లక్షల ఎకరాల్లో పంట వేయలేదని ప్రభుత్వమే చెప్తోందని, అయితే కరువు సహాయం కింద కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క రూపాయి అయినా అడిగారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తుపాన్‌, కరువు కారణంగా జరిగిన పంట నష్టానికి  ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా కింద ఎంతమేరకు సహాయం చేశారలో శ్వేతపత్రాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

 

Tags: కరువుకరువు నష్టంచంద్రబాబుచంద్రబాబునాయుడుజగన్‌రెడ్డి అసమర్థతతుఫాన్‌నష్టపరిహారంపంట కాల్వపంట నష్టంపట్టిసీమమిచౌంగ్‌ తుఫాన్‌రూ.10 వేల కోట్లురూ.700 కోట్లురైతు పాలిట శాపంశ్వేతపత్రం
Previous Post

చంద్రబాబు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాల్లో టీడీపీలో చేరికలు

Next Post

మద్యనిషేధం చేస్తేనే ఓట్లడగుతానన్న జగన్‌రెడ్డికి మళ్లీ ఓటడిగే అర్హత లేదు : చంద్రబాబు

Next Post
మద్యనిషేధం చేస్తేనే ఓట్లడగుతానన్న జగన్‌రెడ్డికి మళ్లీ ఓటడిగే అర్హత లేదు : చంద్రబాబు

మద్యనిషేధం చేస్తేనే ఓట్లడగుతానన్న జగన్‌రెడ్డికి మళ్లీ ఓటడిగే అర్హత లేదు : చంద్రబాబు

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.