- 28 మంది దళితుల్ని హతమార్చారు
- దళితులు కోసం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పలు పథకాలు రద్దు చేశాడు
- పవిత్రమైన క్రైస్తవ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాడు
అమరావతి: ఒక పద్ధతి, పథకం ప్రకారమే జగన్ రెడ్డి,అతని ప్రభుత్వం దళితులపై దమన కాండ కొనసా గిస్తోందని టీడీపీ నాయకుడు, మాజీమంత్రి కేఎస్ జవ హర్ విమర్శించారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో దళితులపై 6 వేలకు పైగా దాడులు జరిగితే, 28మందిని హత్యచేశారని, తాను అధికారంలోకి రావ డానికి పాటుపడిన దళితజాతి రుణాన్ని జగన్‌రెడ్డి ఈ విధంగా తీర్చుకుంటున్నాడని జవహర్ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి నా ఎస్సీలు అన్న ప్రతిసారీ కాస్త భయంగా అనిపిస్తుందన్నా రు. ఆ మాట అంటూనే ఎన్ని దళిత కుటుంబాలను నాశనం చేయబోతున్నాడో,ఎందరు దళితుల్ని బలి తీసు కోబోతున్నాడో అనే భయం అది. తాను క్రైస్తవుడినని నమ్మించడానికి తన తల్లికి బైబిల్ ఇచ్చి దళితుల మధ్య కు పంపిన మోసకారి జగన్‌రెడ్డి. క్రైస్తవాన్ని తన స్వార్థా నికి వాడుకుంటున్నాడు. పవిత్రమైన క్రైస్తవంలోని పది ఆజ్ఞల్ని జగన్ ఎప్పటికప్పుడు ధిక్కరిస్తూ, వాటికి విరు ద్ధంగా వ్యవహరిస్తూ నిత్యం క్రైస్తవుల్ని మోసగిస్తున్నాడు. పొరుగువారిపై అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదన్న నిబం ధనకు విరుద్ధంగా చంద్రబాబుపై అబద్ధపు సాక్ష్యాలు చెప్పి జగన్‌రెడ్డి ఆయన్ని అన్యాయంగా 52 రోజులు జైల్లో ఉంచాడు. ఇలాంటివన్నీ గమనిస్తే జగన్ రెడ్డికి క్రైస్తవంపై నమ్మకం లేదని తెలుస్తోంది. ఇవన్నీ ఒకెత్తు అయితే చంద్రబాబు దళితులకోసం తీసుకొచ్చిన పథకా లు మొత్తం రద్దుచేయడం మరో ఎత్తు అని జవహర్ తప్పుబట్టారు.
దళితుల ఆశల్ని జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశాడు
చంద్రబాబు దళితుల్ని సమాజంలో అగ్రస్థానంలో నిలపడానికి ఆర్థికంగా.. సామాజికంగా వారికి చేయూ త అందిస్తూ తీసుకొచ్చిన పథకాలన్నింటినీ జగన్ అధి కారంలోకి రాగానే రద్దుచేశాడు. ఎస్సీ, ఎస్టీ కార్పొరే షన్లు నిర్వీర్యం చేశాడు. ఎస్సీ కార్పొరేషన్‌ను మూడుగా విడగొట్టాడు. వాటికి నిధులు కేటాయించకుండా దళి తులు తమకాళ్లపై తాము నిలబడేలా ఎలాంటి ఆర్థిక సాయం చేయకుండా మొక్కుబడిగా దళిత సంక్షేమాన్ని అమలు చేస్తున్నాడు. లిడ్ క్యాప్ విభాగాన్ని నిర్వీర్యం చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు.. విదేశీ విద్య వంటి వాటిని రద్దుచేశాడు. దళిత ఆడబిడ్డలకు అందించా ల్సిన పెళ్లికానుక లేకుండా చేశాడు. క్రిస్మస్ కానుకను రద్దు చేశాడు. దళిత యువతను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు చంద్రబాబు ఎస్సీ కార్పొరేషన్… లిడ్ క్యాప్ ద్వారా రుణాలు అందిస్తే, జగన్‌రెడ్డి నాలు గేళ్లలో ఒక్క దళితుడికి ఒక్క రూపాయి రుణం ఇచ్చింది లేదు. చంద్రబాబు దళిత యువతకు ఇన్నోవా కార్లు… జేసీబీలు.. ఇతర వాహనాలు.. వివిధ యంత్రపరికరా లు అందించి వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తే, జగన్‌రెడ్డి అలాంటి పథకాలు మొత్తం ఎత్తేసి దళిత యువతను ఎందుకూ పనికిరానివారిగా చేశాడు. జగన్ రెడ్డిని నమ్మి ఎంఎస్‌ఎంఈలు పెట్టుకొని రుణాల కోసం ఎదురుచూస్తున్న దళిత యువత ఆశలు అడి యాసలు అయ్యాయి. భూమికొనుగోలు పథకంకింద చంద్రబాబు భూములు కొని దళితులకు పంచితే, జగన్ ఆ స్కీమ్‌ను కూడా ఎత్తేశాడు.అన్నింటికంటే ముఖ్యంగా దళిత రాజ ధాని..చుట్టూ రిజర్వుడ్ నియోజకవర్గాలుండే అమరా వతిని నాశనం చేసి దళితుల్ని నట్టేట ముంచాడు. కోడి కత్తి డ్రామాలాడి అమాయకుడైన దళితయువకుడు శ్రీని వాస్‌ను 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గిపోయేలా చేశాడు. తన ధనదాహంతో కల్తీమద్యం అమ్మిస్తూ దళితుల్నే అధికం గా బలి తీసుకుంటున్నాడు. ఇసుక దోపిడీ చేస్తూ దళిత వర్గాలకు ఉపాధిలేకుండా చేసి..వారిపొట్టకొడుతూ తన ఖజానా నింపుకుంటున్నాడని జవహర్ విమర్శించారు.
జగన్ రెడ్డి ఏనాడూ దళితుల పక్షాన మాట్లాడిరది లేదు
జగన్ రెడ్డి దళితులకు చేసింది ఏమిటయ్యా అంటే వారిపై మూత్రం పోయించడం, వారిని హత్య చేయిం చడం, శిరోముండనాలు కానుకగా ఇవ్వడం. దళిత మహిళల్ని దారుణంగా హత్యాచారాలు చేయించాడు. దళితుల్ని వేధిస్తూ.. వారిని అవమానిస్తున్న వారిపై ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. వైసీపీ వారు..జగన్ సామాజికవర్గం వారు దళితుల్ని దారుణం గా అవమానిస్తున్నా..జగన్‌రెడ్డి ఏనాడూ దళితుల పక్షా న మాట్లాడిరది లేదు. దళిత యువకుడిని దారుణంగా చంపేసి,అతని శవాన్ని డోర్‌డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మె ల్సీ అనంతబాబుని అభిమానించి అక్కున చేర్చుకున్న ప్పుడే జగన్‌రెడ్డి దళితుల విషయంలో ఎలా వ్యవహరి స్తున్నాడో అర్థమైంది. నంద్యాలలో దళిత న్యాయవాది మందా విజయ్‌కుమార్‌పై దాడి, అనకాపల్లిలో, ఒంగో లులో దళితులపై దాడి.. ఇలా రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట దళితులపై దాడులో.. హత్యలో.. అత్యాచారా లో జరుగుతూనే ఉన్నాయి. నూతన విద్యా విధానం ముసుగులో దళితబిడ్డలకు ప్రాథమిక విద్యను దూరం చేసిన దళిత ద్రోహి జగన్‌రెడ్డి.
కేవలం రాజకీయ ప్ర యోజనాల కోసమే జగన్‌రెడ్డి నా ఎస్సీలు..నా బీసీలు.. నా మైనారిటీలు అంటున్నాడు. తుఫాన్ వల్ల నష్టపోయి న రైతులు.. రైతుకూలీల్లో ఎక్కువ మంది దళితులు.. బీసీలే ఉన్నారు. వారి కన్నీళ్లు తుడిచే చర్యలు చేపట్ట కుండా ఉత్తుత్తి పర్యటనలు చేసి, ఉపన్యాసాలు ఇచ్చి జగన్‌రెడ్డి వెనక్కి వచ్చేశాడు. దళితుల్ని చంపేవారు.. వారిపై దాడిచేస్తూ.. వారిని అవమానించే వారికే జగన్ రెడ్డి పదవులు కట్టబెట్టి ప్రోత్సహిస్తున్నాడు. దళితుల్ని వేధించే అధికారుల్ని పదోన్నతులతో సత్కరిస్తున్నాడు. కచ్చులూరు బోటు ప్రమాదంపై మాట్లాడాడని దళిత ప్రజాప్రతినిధి హర్షకుమార్‌పై జగన్‌రెడ్డి తప్పుడు కేసు లు పెట్టించాడు.తన అవినీతిని ప్రశ్నిస్తూ..తాను దళితు లకు చేస్తున్న ద్రోహాన్ని…వంచనను ఎత్తిచూపుతున్నాడ న్న అక్కసుతో మహాసేన రాజేశ్‌పై తప్పుడుకేసులు పెట్టి ంచాడు. దళిత వ్యతిరేక విధానాలు మాను కోకుంటే, వచ్చే ఎన్నికల్లో ఆ దళితులే ఆయనకు.. వైసీపీ ప్రభు త్వానికి ఘోరీ కడతారని జవహర్ హెచ్చరించారు.