అమరావతి : దళిత సమ్మేళన సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు కింజరాపు అచ్చెన్నాయడు మాట్లాడుతూ జగన్ రెడ్డిపాలనలో ఎప్పుడూ లేని విధంగా దళితులపై దాడు లు, దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. రాజ్యాంగం ప్రకారం దళితులకు రావాల్సిన నిధులు, హక్కుల ను జగన్‌రెడ్డి లాగేసుకున్నారని విమర్శించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను సీఎంకు తెలిపే అవకాశం కూడా దళిత మంత్రులు, ప్రజాప్రతి నిధులకు లేదని అన్నారు. అదే చంద్రబాబు పాలనా కాలంలో తమ వర్గాలకు ఏదైనా అన్యాయం జరిగితే తాము మంత్రిమండలి సమావేశంలోనే అడిగేవాళ్లమని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే తిరిగి దళితులకు ఆత్మగౌరవం, రక్షణ లభిస్తాయని అన్నారు. దళి తులచేత ఓట్లు వేయించుకొని దళితులకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్‌రెడ్డి అని అన్నారు. టీడీపీ స్థాపన కు ముందు బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంక్ గానే చూసేవారని, కానీ ఎన్టీయార్, ఆ తర్వాత చంద్ర బాబు బడుగులకు ముఖ్యంగా దళితులకు ఆర్థిక, రాజ కీయ, సామాజిక అవకాశాలు కల్పించారని గుర్తు చేశా రు. అటువంటిది జగన్‌రెడ్డి మాయమాటలు నమ్మి 2019లో ఒకసారి మోసపోయామని ఈసారి అలా జరగకూడదని, దళితులంతా కలిసి రిజర్వ్‌డ్ స్థానాలైన 29 స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని కోరారు. జగ న్‌రెడ్డి అవినీతి, అక్రమాల పాలన కారణంగా ప్రజలం తా విసుగుచెంది ఉన్నారని,టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలిచే అవకాశముందని అన్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే దళితులపై జరుగుతు న్న దాడుల గురించి వినాల్సి వస్తోందని, ఇన్ని దాడులు జరుగుతున్నా జాతీయ స్థాయిలో ఉన్న మానవహక్కుల సంఘం, ఎస్సీ కమిషన్, మేధావులు ఏం చేస్తున్నారని, వారెందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. ఒకవైపున దళితులను ఊచకోత కోస్తూ మరోవైపు సామాజిక సాధికారిత బస్సు యాత్రలు చేయడానికి సిగ్గుందా అని వైసీపీ నేతలను అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.