- దోపిడీకి గురవుతున్న దళితులు
- ప్రభుత్వ సొమ్ము రికవరీకి అడ్డుపడుతున్న అధికారి ఎవరు?
- కంపెనీలతో వైసీపీ నేతల కుమ్మక్కు
- మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు
అమరావతి : దళితుల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితులను నట్టేట ముంచారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహంవ్యక్తం చేశారు. మంగళ గిరిలోని తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటలు యథాతథం గా.. 1972వ సంవత్సరంలో రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారు. ఆర్థిక స్వావలంబన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. లక్షలాది మంది నిరుపేద దళిత కుటుంబాలను ఆదు కున్నారు. వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. దీంతో స్వయం శక్తితో నిరుద్యోగులు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడగలిగారు. ఇలాంటి తోడ్పాటును అందించిన ఘనత ఎస్సీ కార్పొరేషన్ కు ఉంది. ఎస్సీల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి న జగన్మోహన్‌రెడ్డి ఎస్సీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీ ర్యం చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌కు తాళాలు వేసేశారు. ఇది నిజమా? కాదా? వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. వైసీపీ పాలనలో దళితులకు ఏం ప్రయోజ నం చేకూరిందో జగన్మోహన్‌రెడ్డి సమాధానంచెప్పాలి.
దోపిడీకి గురవుతున్న దళితులు
ఈ ప్రభుత్వంలో దళితులు దోపిడీకి గురవుతున్నా రు. దళితుల సొమ్ము స్వాహా చేయడం ఎంతవరకు సమంజసం? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పథకాలను, కార్యక్రమా లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దళారుల వద్ద ఉండిపోయిన రూ.67 కోట్లు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. టీడీపీ హయాంలో జాతీయ సంస్థలైన ఎన్ ఎస్ ఎఫ్ డి సి, ఎన్ ఎస్ ఎఫ్ కె ఎస్ డి పి ద్వారా 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో స్వచ్ఛ సంకల్పం పేరుతో నిధులను తెచ్చి ఆటోలు, క్లీనింగ్ మిషన్లు, ట్రాక్టర్లు, ఇన్నోవా కార్లు, ఇతియోస్ కార్లు ఇవ్వడానికి ప్రణాళికలు రూప కల్పన చేశాం. నాటి నుంచి దళితులకి అనేక సంక్షేమ పథకాలు అందించాం. తమ హయాంలో పథకాలకు ఇచ్చిన సొమ్ము కూడా వదలకుండా దోచుకుంటు న్నారు. కార్పొరేషన్‌కు పవర్ ఆటోలు, మెకనైజ్డ్ డ్రైయిన్ క్లీనింగ్ మెషిన్లు, ఇన్నోవాలు, ఇతియోస్ వాహనాలు సరఫరా చేస్తామని అడ్వాన్సులు తీసుకున్న డీలర్లను నేడు వైసీపీ ప్రభుత్వం కాపాడుతోంది. తాడేపల్లికి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్ డీలర్ అనిల్ కుమార్ రెడ్డి 7,500 పవర్ ఆటోలు సరఫరా చేస్తామని చెప్పి 77.91 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు. 2,500 ఆటోలు మాత్రమే సరఫరా చేశాడు. ఇంకా 19.92 కోట్లు అతని వద్దే అడ్వాన్సు ఉండిపోయింది. 280 మెకనైజేషన్ క్లీనింగ్ మిషన్లు సరఫరా చేయాల్సి ఉండగా, 209 మిషన్లు మాత్రమే సరఫరా చేశారు. రూ.9 కోట్ల 45 లక్షల రూపాయలు అతని దగ్గర నిలిచిపోయింది. 660 ట్రాక్టర్లు సరఫరా చేస్తామని చెప్పి 450 ట్రాక్టర్లు మాత్రమే సరఫరా చేశారు. రూ.12 కోట్ల 30 లక్షల అడ్వాన్స్ ఇతని వద్దే ఉండిపోయింది. ఒక్క అనిల్ కుమార్ రెడ్డి వద్ద రూ.41 కోట్ల 68 లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపేణా నిలిచిపోయింది.
కావలికి చెందిన ఈగల్ సరఫరా ఎక్విప్ మెంట్ వారి వద్ద రూ.21.76 కోట్లు ఉంది. రాధామాధవ్ ఆటోమొబైల్స్ ప్రైవేటు లిమిటిడ్ వారి వద్ద రూ.23.05 కోట్లు ఉంది. ఎంట్రాన్ ఆటో మొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి వద్ద రూ.2.93 కోట్లు ఉంది. మొత్తం ముగ్గురు డీలర్ల వద్ద రూ.67.67 కోట్ల ఎస్సీ కార్పొరేషన్ సొమ్ము ఉంది.
కంపెనీలతో వైసీపీ నేతల కుమ్మక్కు
వైసీపీ నాయకులు కంపెనీలవారితో కుమ్మక్కై ఆ డబ్బు పంచుకుంటున్నారని తెలుస్తోంది. ఊరుకున్నా రంటే దానికి అదే అర్థం. సోషల్ వెల్ఫేర్ కు ఇద్దరు మంత్రులు మారారు, ప్రయోజనం శూన్యం. సీఎం పేషీ నుంచే అవినీతి నడుస్తోంది.
ఈవిషయంలో తెలుగుదేశంపార్టీ పోరాటం చేస్తుం ది. దళిత సంఘాలు, ప్రజాసంఘాలు కూడా ఈ వాస్త వాలపై దృష్టి సారించాలి. నోరు తెరచి మాట్లాడి నిజా లు నిగ్గు తేల్చాలి. దళితుల సొమ్ము రాబట్టడానికి అం దరూ ఏకంకావాలి. దోషులను దండిరచాలి. సొమ్మం తా రికవరి చేయాలి. సీఎం పేషీ నుంచి ఒత్తడి రావ డంతోనే అభివృద్ధి కార్యక్రమాలు ఆగాయి. మంత్రులు ఉండి ప్రయోజనమేంటి? ప్రభుత్వాలు మారినా మొదలు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగకూడదని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు చెప్పారు.
ఆ అదృశ్య అధికారి ఎవరు?
ఈ సొమ్మును వైసీపీ ప్రభుత్వం ఎందుకు రికవరీ చేయడం లేదు?
అధికారులు వారికి నోటీసులు పంపుతున్నా డీలర్లపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ పెద్దలు ఎందుకు కాపాడుతున్నారు? నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారని వారిపై ఆరోపణలు ఉన్నా కాపాడాల్సిన అవసరం ఏంటి? డీలర్లను కాపాడుతున్న ఆ అదృశ్యం అధికారి ఎవరు? దళితుల సొమ్మంటే మీకు లెక్కలేనితనంగా మారింది. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడమే జగన్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడు. దళితుల సొమ్మంటే జగన్ రెడ్డికి లెక్కలేదు. డీలర్ల వద్ద రూ.67 వేల కోట్ల దళితుల సొమ్ముంటే ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఈ-ఆటోలు కొనుగోలుకు టెండర్లు పిలిచాం. 2017-18, 2018-19 లో జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థిక అభివృద్ధి సంస్థ, జాతీయ ఎస్సీ ఆర్థిక అభివృద్ధి సంస్థ నిధులు కేటాయించాం. 13 జిల్లాలలో 13 ఈ-ఆటో సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు పూణేకు చెందిన కెనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ ఆథరైజేషన్ తో తాడేపల్లికి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. సరఫరాదారుల తరఫున డీలర్ అనిల్ కుమార్ రెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు.