- ఇంకెన్నాళ్లీ నీతిమాలిన రాతలు
- అబద్ధాల పునాదులపై ఎల్లకాలం బతకలేరని జగన్‌రెడ్డి గుర్తించాలి
- రూ.3వేల హామీపై మాట తప్పి ఒక్కో లబ్ధిదారుడికి రూ.30వేలు ఎగనామం
- తానేదో ఉద్ధరించానంటూ సిగ్గులేకుండా గొప్పలు
అమరావతి: అబద్ధాల పునాదులపై ఎల్లకాలం రాజకీయాలు నడపలేరనే విషయాన్ని జగన్‌రెడ్డి గ్రహిం చాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయు డు అన్నారు. నిజం చెబితే తల వేయిముక్కలవుతుందనే శాపం జగన్‌రెడ్డిని వేధిస్తున్నట్లుందని సోమవారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు.నోరు తెరిస్తే అబద్ధం చెప్పడం తప్ప ఒక్క రోజు కూడా జగన్ నిజా లు మాట్లాడడం లేదు. అధికారంలోకి వస్తే రూ.3 వేలు పెన్షన్ ఇస్తానన్న అదే నోటితో అధికారంలోకి వచ్చీ రాగానే ఏటా పెంపు అంటూ మాట మార్చి ఒక్కో పెన్ష న్ లబ్ధిదారుడికి రూ.30వేలు ఎగనామం పెట్టారు. ఇప్పుడు పెన్షన్ దారులకు పంపుతున్న లేఖలో కూడా అవే పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబు అధి కారంలోకి వచ్చే నాటికి రూ.200 ఉన్న పెన్షన్ 2019 నాటికి రూ.2000చేశారు. అంటే ఐదేళ్లలో రూ.1800 పెంచారు. పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను 34లక్షల నుం డి 54.25 లక్షలకు పెంచారు. జగన్‌రెడ్డి ఇప్పటి వరకు పెంచింది రూ.750మాత్రమే అయినా సిగ్గులే కుండా ఉద్ధరించానని చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు హయా ంలో పెన్షన్ మొత్తాన్ని ఎక్కడైనాతీసుకునే అవకాశముం టే, ఇప్పుడు కేవలం 15కి.మీల పరిధిలోనే ఉండాలం టూ సిగ్గులేకుండా జీవోలిచ్చారు. ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే నంటూ లబ్ధిదారులకు నోటీసులిచ్చిన దుర్మార్గపాలన జగన్‌రెడ్డిదే. చంద్రబాబు ఐదేళ్లలో రూ.7లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉన్నప్పటికీ 20లక్ష లమందికి కొత్తగా పెన్షన్లుఇచ్చి, పెన్షన్ మొత్తాన్ని కూడా రూ.1800వరకు పెంచారు. రూ.12 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేసిన జగన్‌రెడ్డి ఐదేళ్లలో కొత్తగా ఇచ్చిన పెన్షన్లు 10లక్షలు మాత్రమే. చరిత్రలో తొలిసా రిగా కిడ్నీ, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి బాధితుల కు పెన్షన్లు మంజూరుచేసింది చంద్రబాబే. గిరిజనుల కు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, మత్స్యకా రులు, చెప్పులు కుట్టే వారికి 50ఏళ్లకు పెన్షన్ ఇచ్చిందీ చంద్రబాబే. ట్రాన్స్జెండర్లకు కూడా చంద్రబాబు పెన్ష న్లు మంజూరు చేస్తే.. జగన్‌రెడ్డి రద్దుచేయడం వాస్తవం కాదా? అధికారంలోకి రావడానికి అబద్ధాలను నమ్ము కున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అవే పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నారు. జగన్‌రెడ్డి చెప్పే అబద్ధాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని గుర్తుంచు కోవాలి.