- ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి
- జగ్గూకు పరిటాల సునీత పరామర్శ
- ఇకపై కేసులకు భయపడేదిలేదు: బీకే పార్థసారధి
అనంతపురం : పరిటాల రవిని చంపింది అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ అని ఆ రోజు నుంచి మేము చెబుతూనే ఉన్నామని.. తోపుదుర్తి చందు వ్యాఖ్యల మీద నిజమని తేలిపోయిందని మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసుల తప్పుడు కేసులతో అరెస్టయి ధర్మవరం సబ్ జైలులో ఉన్న గంటాపురం జగ్గును మాజీమంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు బికె పార్థసారధి తదితరులు పాల్గొ న్నారు.ఈసందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ తోపుదుర్తి చందు చేసిన వ్యాఖ్యల మీద రాప్తాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని.. అయితే దానిని చెత్త బుట్టలో పడేశారన్నారు. కానీ చంద్రబాబు ని దూషించారన్న ఆవేశంలో గంటాపురం జగ్గు ఏదో మాట్లాడితే అర్ధరాత్రి వెళ్లి అరెస్టులు చేశారన్నారు. అదే రోజు రాత్రి వైసీపీ నాయకులకు చెప్పి.. దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ధర్మవరం పోలీ సులు ఉండగా, జగ్గును అరెస్టు చేసేందుకు చెన్నేకొత్త పల్లి పోలీసులు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించా రని ప్రశ్నించారు.అందుకే చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐతో పా టు రామగిరి సీఐను సస్పెండ్‌చేయాలని ఆమె డిమాం డ్‌చేశారు.మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలుచేసిన చందు ను జిల్లా బహిష్కరణ చేయాలన్నారు. గతంలో పరిటాల రవిని చంపిన మొద్దుశీనుకు వైఎస్ చెప్పిఉంటే చంద్రబాబును కూడా చంపి ఉండే వారని నిజాలుచెప్పారన్నారు. ఆరోజు నుంచి మేము చెబుతున్న విధంగా ఈ హత్యల వెనుక వైఎస్ ఆయన కుమారుడు జగన్, ప్రకాష్‌రెడ్డి సోదరులు ఉన్నారని ఆరో పించారు.ఇప్పుడు లోకేష్‌ను టార్గెట్ చేస్తామని అంటున్నారని.. లోకేష్‌కు అండగా లక్షలా దిగా టీడీపీ శ్రేణు లు ఉన్నారన్న విషయాన్ని గుర్తుం చుకోవాలని సునీత అన్నారు.
కేసులకు భయపడం: మాజీ ఎమ్మెల్యే పార్థసారధి
తోపుదుర్తి చందు ముందు చంద్రబాబును దూషించారని ఆయనపై చర్యలు తీసుకోకుండా జగ్గు ను అరెస్ట్ చేయడం అంటే పోలీసులు ఎంత ఏక పక్షం గా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందన్నారు. అందుకే వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇలాంటి కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారని.. అది ఎప్పటికీ సాధ్యం కాదని మేము కేసులకు భయపడమని పార్థ సారధి తేల్చి చెప్పారు.చందుకు సంఫీుభావం తెలిపినవారిలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కళ్యాణదుర్గం, శింగనమల నియో జకవర్గ ఇన్‌ఛార్జిలు ఉమామహేశ్వర నాయుడు, బండారు శ్రావణి తదితరులు ఉన్నారు.