చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ ప్రచారోన్మాదం..రెండు ప్రాణాలు బలి

రెచ్చగొట్టే ప్లకార్డులతో వైసీపీ మూకల వీరంగం

by చైతన్యరధం
Jun 19, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌ ప్రచారోన్మాదం..రెండు ప్రాణాలు బలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గతేడాది చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరామర్శ పేరుతో రచ్చ
  • బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటే రాజకీయ రంగు
  • జగన్‌ కాన్వాయ్‌ వెంట వస్తున్న వాహనం ఢీకొని దళితుడికి తీవ్రగాయాలు
  • పట్టించుకోకుండా వెళ్లిపోయిన సైకో బ్యాచ్‌
  • స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం
  • సత్తెనపల్లిలో సొమ్మసిల్లి మరో యువకుడు మృతి
  • ఇద్దరు చనిపోయినా పట్టించుకోకుండానే సాగిన జగన్‌ పర్యటన
  • రెచ్చగొట్టే ప్లకార్డులతో వైసీపీ మూకల వీరంగం

పల్నాడు (చైతన్యరథం): జగన్‌ పర్యటన అంటే రక్తమైనా చిందాలి, ప్రాణమైనా పోవాలి. లేదంటే జగన్‌ సైకోయిజం శాంతించదు. తాజాగా పరామర్శ పేరుతో పల్నాడు జిల్లాలో జగన్‌ చేసిన రచ్చ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.
సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో గతేడాది వైసీపీ ఉపసర్పంచి నాగమల్లేశ్వరరావు ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లో అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూటమి ప్రభుత్వం రాకముందే అతడు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వ వేధింపుల వల్లే అని చెబుతూ జగన్‌.. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా మందీమార్బలంతో పరామర్శకు బయలుదేరాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే జరిగిన ఆత్మహత్యకు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అని రంగు పులిమేసి శవయాత్రకు బయలుదేరాడు.
ఈ క్రమంలో గుంటూరు సమీపంలో జగన్‌ కాన్వాయ్‌ వెంట వస్తున్న వైసీపీ నాయకుల వాహనం ఢీ కొని ఒకరు, సత్తెనపల్లిలో ఊపిరాడక సొమ్మసిల్లి మరొకరు మృతి చెందారు. ఇద్దరు చనిపోయారు యాత్ర ఆపేద్దామని కొందరు నేతలు చెప్పినా జగన్‌ వినకుండా మొండిగా ముందుకే కదిలారు. చస్తే చచ్చారు, ఎంతో కొంత పడేద్దాంలే యాత్ర ఆపేది లేదంటూ జగన్‌ చెప్పటంతో ఖంగుతిన్న నేతలు మౌనం వహించారు. పరామర్శకు మరో రెండు శవాలు దొరికాయనే పైశాచినాందంతో అత్యంత దుర్మార్గంగా తన పర్యటన కొనసాగించారు.

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
గతంలో పొదిలి, రాప్తాడు అనుభవాల దృష్ట్యా పల్నాడు జిల్లా పోలీసులు రెంటపాళ్లలో జగన్‌ పర్యటనకు అనుమతే ఇవ్వలేదు. అయితే పదేపదే వినతులు రావడంతో ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. జగన్‌ ఎస్కార్ట్‌ వాహనాలకు అదనంగా ఓ మూడు వాహనాలు, వంద మందితో జగన్‌ రెంటపాళ్లలో పర్యటించేందుకు పోలీసులు అనుమతించారు. అయితే పోలీసుల ఆంక్షలు జగన్‌ టూర్‌లో ఉక్కడా కనిపించలేదు. చట్టాలను ఏ మాత్రం లెక్కచేయని సైకో పార్టీ నేతలు డబ్బులు, మద్యం ఇచ్చి మరీ జనాలను వాహనాల్లో తరలించారు. ఈ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు అనుచిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన ప్లకార్డులు, పోస్టర్లను ప్రదర్శించారు. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూ పర్యటన కొనసాగింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

అనుమతి లేకున్నా జనాల తరలింపు
షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 11 గంటలకే రెంటపాళ్ల చేరుకొని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ, పల్నాడు జిల్లా పోలీసులు జగన్‌ ర్యాలీకి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కాన్వాయిలో 3 వాహనాలకు, 100 మందికి మాత్రమే అనుమతిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలోనే రెంటపాళ్ల బయల్దేరారు. అయితే గుంటూరు, సత్తెనపల్లితో పాటు మార్గ మధ్యలోని వివిధ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో వాహనాలతో హడావుడి చేశారు. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ బలప్రదర్శనకు దిగారు. ఉదయం 11 గంటలకు రెంటపాళ్ల చేరుకోవాల్సిన జగన్‌ సాయంత్రం 5గంటలకు వచ్చారు. దారి పొడవునా అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు ప్రదర్శిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మనకు ఎవరు అడ్డు వస్తారు, వస్తే తొక్కుకొంటూ వెళతాం .. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాం.. అంటూ రెచ్చగొట్టే ప్లకార్డులతో గుంటూరు నుంచి రెంటపాళ్ల వరకు దారి పొడవునా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోస్తు ఏర్పాటు చేసినప్పటికీ.. వైసీపీ నాయకులు భారీగా జన సమీకరణ చేసి హంగామా చేశారు.

ఇద్దరు చనిపోయినా..
ఈ క్రమంలో గుంటూరు నగరం సమీపంలోని ఏటుకూరు వద్ద లాల్‌పురం హైవేపై జగన్‌ కాన్వాయ్‌ వెంట ఉన్న నేతల వాహనం ఢీకొట్టడంతో వెంగళాయపాలెం వాసి సింగయ్య(53) అనే దళితుడికి తీవ్రగాయాలయ్యాయి. కనీస మానవత్వం లేని వైసీపీ కార్యకర్తలు బాధితుడిని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. స్థానికులు స్పందించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. దళితుడు, మాదిగ కులానికి చెందిన ఆ నిస్సహాయ వృద్ధుడు, సరైన సమయంలో వైద్యసహాయం అందక ప్రాణాలు విడిచాడు. జగన్‌ కాన్వాయ్‌లో అంబులెన్స్‌ ఉండి కూడా, ఒక్క నిమిషం కూడా ఆపి ఆసుపత్రికి పంపించే కనీస మానవత్వం చూపకపోవడం దారుణం. కాస్తంత ఆలస్యం చేయకుండా సహాయం అంది ఉంటే, ఆ ప్రాణం నిలిచేదేమో. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఆ వృద్ధుడు.. తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే… కనీసం ఒక్క చూపు కూడా చూడకుండా, ఒక్క క్షణం కూడా ఆగి ఏమయిందో తెలుసుకోకుండా తమకు ఏమీ పట్టనట్లు వెళ్లిపోయిన జగన్‌కి, వైసీపీ నాయకులకు మానవత్వం అనేది లేదా? మనుషుల ప్రాణాలు అంత విలువలేనివిగా కనిపిస్తున్నాయా.
సత్తెనపల్లిలో మరో యువకుడు మృతి చెందాడు. ర్యాలీలో సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జరిగిన తోపులాటలో సత్తెనపల్లి ఆటోనగర్‌కు చెందిన పాపసాని జయవర్ధన్రెడ్డి (30) సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

స్థానికుల్లో భయాందోళనలు
పల్నాడు మీద దండయాత్ర చేస్తున్న సైకోలను చూసి స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సత్తెనపల్లిలో వైసీపీ నేతలు తరలించుకొచ్చిన సైకోలు విచ్చలవిడి చేష్టలకు పాల్పడ్డారు. గంజాయి మత్తులో ఒక నీచుడు నడిరోడ్డులో బట్టలు విప్పుకుని తిరుగుతూ స్థానికులను భయాందోళనలకు గురిచేశాడు. మహిళలను వెనుక తాకుతూ, మీదపడి తోసుకొంటూ సెల్ఫీలు తీసుకుంటూ మరికొందరు వికృతానందం పొందారు. మరో దొంగల ముఠా.. రోడ్డు పక్కగా బైక్‌ పై వెళ్తున్న దంపతుల చేతిలో ఫోన్‌ లాక్కుని పరారయింది.

జగన్‌ వల్లే ఆత్మహత్య
వైసీపీ పాలనలో గ్రామంలో హవా కొనసాగించిన నాగమల్లేశ్వరరావు 2024లోనూ వైసీపీ అధికారంలోకి వస్తుందని రూ.2 కోట్ల కు పైగా బెట్టింగులు పెట్టారు. లెక్కింపు రోజు జూన్‌ 4న అల్లర్లకు పాల్పడేవారిని పోలీసులు బైండోవర్‌ చేశారు. అందులో భాగంగా నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచి తర్వాత వదిలేశారు. వైసీపీ ఓడిపోవడం.. బెట్టింగుల్లో పెట్టిన సొమ్ము పూర్తిగా పోగొట్టుకోవడంతో అప్పుల వాళ్ల ఒత్తిళ్లు ఎక్కువై గుంటూరులోని సోదరుని ఇంటికి వెళ్లాడు. జూన్‌ 6న గుంటూరు నుంచి రెంటపాళ్లకు వస్తూ మార్గమధ్యలో మేడికొండూరు వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పొందుతూ జూన్‌ జూన్‌ 9న మరణించాడు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సొంతూరుకు రాని వ్యక్తిని పోలీసులు ఎలా వేధిస్తారని స్థానికులు చెబుతున్నా వైసీపీ రాజకీయం చేస్తుండటం గమనార్హం. తామే గెలుస్తున్నామని ఎన్నికల సమయంలో జగన్‌ పదేపదే చెప్పడంతో ఆయన మాటలు నమ్మి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు పరోక్షంగా కారణమైన జగన్‌ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం

పల్నాడు జిల్లాలో చర్చనీయాంశమైంది.
మొన్నటికి మొన్న పొదిలిలో వైసీపీ సైకో బ్యాచ్‌ మహిళలు, పోలీసులపై రాళ్లతో దాడి చేసింది. దీంతో చాలామందికి గాయాలై తలలు పగిలాయి. తాజా శవయాత్రలో సైకో పంతం, ప్రచార పిచ్చి కారణంగా రెండు ప్రాణాలు బలయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి శవాలతో జగన్‌ మళ్లీ పరామర్శ పేరుతో రాజకీయం చేస్తాడు. ఎన్నాళ్లీ శవరాజకీయాలు జగన్‌ రెడ్డీ!

నాగమల్లేశ్వరరావు కుటుంబానికి తీవ్ర నిరాశ
పరామర్శకు జగన్‌ వచ్చి తమకు ఎంతోకొంత ఆర్థికసాయం చేస్తారనుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. పది నిమిషాలు పరామర్శించి విగ్రహం ప్రారంభించి జగన్‌ చేతులు దులుపేసుకుని వెళ్లిపోయాడు. నాగ మల్లేశ్వరరావు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయాన్ని జగన్‌ ప్రకటిస్తారని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. చివరికి ఒక్క రూపాయి కూడా సాయాన్ని ప్రకటించకుండా జగన్‌ వెనుదిరిగాడు. జగన్‌ ఇచ్చే డబ్బులతో కొడుకు చేసిన అప్పులు తీర్చుకోవచ్చు అని ఆశపడ్డ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2025

Next Post

పోలీసులపై అంబటి దురుసు ప్రవర్తన

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-05-2026

కార్యకర్త
@ May 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

కార్యకర్త
@ May 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ఆంధ్రప్రదేశ్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!
ఆంధ్రప్రదేశ్

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist