- అప్పుల్లో పీహెచ్డీ చేసిన సీఎం
- ఇక తాకట్టుకు మిగిలింది జనమే
- మీ బిడ్డనంటూ వస్తున్నాడు.. జర జాగ్రత్త
- రాష్ట్ర ప్రజలకు లోకేష్ హితవు
అమరావతి: మీ బిడ్డనంటూ జగన్ వస్తున్నాడు.. జర జాగ్రత్త ప్రజలారా.. అంటూ ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనాల ను అప్రమత్తం చేశారు. ‘జగన్ కంపెనీ లు కళకళ… రాష్ట్ర ఖజానా దివాళా!’ అని పేర్కొన్నారు. గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్రెడ్డి సొంత కంపెనీ లన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడు తుంటే… అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాళా తీయించా రని నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని జగన్ దోచుకుతింటున్న తీరును ఆయన వివరించారు. ఒక్కటంటే ఒక్క కొత్త కం పెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి… అప్పులు తేవ డంలో మాత్రం పీహెచ్డీ చేశారని దుయ్యబట్టారు.
రాష్ట్రపరిపాలనా కేంద్రం అయిన సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్… తాజాగా రాష్ట్రంలో ఖనిజ సంపదను తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇప్పటికే మందుబాబులను తాకట్టుపెట్టి 33వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది 5కోట్ల మంది జనం మాత్రమే. ఇప్ప టికే తాను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదర గొడుతున్న జగన్మోహన్రెడ్డి మాటల వెనుక అంతర్యాన్ని గుర్తించి రాబోయే 2 నెలలపాటు ఆయనతో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రప్రజలకు లోకేష్ సూచించారు.