మిర్చి రైతులపై దయామయుడుగా ప్రేమ ఒలక పోస్తూ..అభినయాలు ప్రదర్శిస్తూ.. కర్షక విన్యాసాలు చేశారు గుంటూరు మిర్చి యార్డులో మాజీ సీఎం జగన్‌రెడ్డి. రైతు పక్షపాతి ముసుగు వేసుకుని మిర్చి రైతులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుందని మిర్చి యార్డులో వీరంగాలు వేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేరని, కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మిర్చి రైతుల పరామర్శ పేరుతో మిర్చి యార్డులోకి జొరబడి సీఎం చంద్రబాబుపై అవాకులు, చెవాకులు పేలారు. గత ఐదేళ్లు వ్యవసాయ శాఖనే మూ తవేసిన, రైతుల జీవితాలను నాశనం చేసిన జగన్‌రెడ్డి ఉన్న పళంగా రైతులపై ప్రేమ చూపిస్తూ మొసలి కన్నీరు కార్చగానే తన వెంట రైతులు పరుగులు తీస్తారు అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. ఆయన పరిపాలనలో ఏం జరిగిందో రైతులు అనుభవించా రు. రైతులను మాయ మాటలతో మైమరిపించి నిండా ముంచిన ఘనత ఆయనదే. రైతుల ఉసురు తగిలే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నది వాస్తవం. వ్యవసాయ రంగ వెన్ను విరిచి నేడు అసలైన రైతు జన బాంధ వుడను తానే అంటూ రైతులను నమ్మించాలని చూస్తున్నాడు. ఎన్నో సమస్యల గరళాన్ని గొంతులో దాచుకుని జాతికి అన్నం పెడుతున్న బోళా శంకరుడు రైతు. అటువంటి రైతు బతుకు జగన్‌రెడ్డి పాలనలో గాలిలో దీపమయింది.
జగన్ జమానాలో పండిరచిన పంటలకు గిట్టు బాటుధర కాదు కదా కనీస మద్దతు ధర కూడా దక్క లేదు. చీడ పీడలు, తెగుళ్లు బారిన పడినా, తుఫానులు వణికిం చినా, అకాల వర్షాలు, వరదలకు పంటలు నీట మునిగినా రైతుల కడగండ్లను ఏ మాత్రం పట్టించుకోలేదు. అధికారంలో వున్నప్పుడు తూఫానులు ,వరదలకు రైతుల కష్టం నీళ్లలో కుళ్లిపోతుంటే చక్రవర్తి లాగా నీరున్న పొలంలోకి దిగి పంటలను పరిశీలిం చలేదు. నష్టాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. కనీసం నేలపై కాలు పెట్టకుండా పొలం గట్టుకైనా వెళ్లకుండా జాతీయ రహదారిపై నుంచే పంట నష్టాన్ని పరిశీలించడా నికి వీలుగా ప్రత్యేక టెంట్లు, వేదికలు ఏర్పాటు చేశారు. రైతుల సమస్యలను ఆలకించిం దీ లేదు.తుఫాను బాధితులను పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రి హెలిప్యాడ్‌లో రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికించుకున్నారు. ఒక పక్కన రైతుల కష్టం నీళ్లలో కుళ్లిపో తుంటే జగన్‌రెడ్డికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకడం ఏమిటి? అడుగడుగునా బారికేడ్లు, ఎటుచూసినా పోలీసులే..అడుగడుగునా ఆంక్షలే. గోడు వెళ్లబోసుకుందామని వచ్చిన రైతులకు అవకాశం ఇవ్వలేదు. మొక్కుబడిగా వచ్చి వెళ్లారు. బాధ్యత లేని ముఖ్యమంత్రి ఉంటే అలానే ఉంటారని అనడానికి అదొక ఉదాహరణ. అటువంటి జగన్ నేడు రైతుల పట్ల ప్రేమ ఒలక బోయడం విడ్డూరంగా ఉంది. కర్షకుల బతుకులకు చితి పేర్చిన పాలన జగన్‌రెడ్డిదే. అంకెలగారడీలతో, అబద్ధాలతో రైతులను దారుణంగా దగా చేశారు. వ్యవసాయ పురోభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా నిస్సిగ్గుగా రైతులను వంచించారు. అరకొరగా రైతు భరోసా ఇచ్చి సమస్త రైతు సమస్యలు పరిష్కరించినట్లు పత్రికల్లో ప్రకటనలు గుప్పించి రైతులను తప్పుదారి పట్టించారు. అసమర్థత, అసంబద్ధ విధానాలతో వ్యవసారంగం వెన్ను విరిచారు. నేడు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు అత్యాధునిక వ్యవసాయం ఆవిష్కరణకు చంద్రబాబు ప్రభు త్వం కృషి చేస్తుంది. వ్యవసాయానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంది.
నేడు మిర్చి ఎగుమతులు అంతగా లేకపోవడం. కనీస మద్దతు ధర కూడా దక్కక పోవడంతో మిర్చి రైతులు తీవ్ర ఆవేదన చెందడంతో రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర సమస్యను ఆగమేఘాల మీద కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకువెళ్లడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా అంతే వేగంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టడంతో మిర్చి పంటకు గిట్టుబాటు ధర అంశంపై కేంద్రంలో కదలిక వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌లో 25 శాతం ఉన్న సీలింగ్ ను ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు సమాచారం. 75 శాతం మేర కొను గోలుకు కేంద్ర అంగీకారం. మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్ది మార్కెట్ ధర -ఉత్పత్తి వ్యయం మధ్య తేడా భరించడానికి కేంద్రం అంగీకరిం చినట్లు సమాచారం. సాగు ఖర్చులను క్షేత్రస్థాయిలో లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో కేంద్రం చర్యలు చేపట్టింది. మిర్చి రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకు ని ఆదుకుంటామని సియం చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు.
నిజంగా జగన్‌కి రైతులపై అమితమైన ప్రేమ ఉంటే సోమవారం నుంచి అసెంబ్లీ జరగబోతుంది. అక్కడ మిర్చి రైతుల కోసం పోరాటం చేయాలి. అంతే తప్ప వీధుల్లో వీరంగాలు వెయ్యడం ఏమిటి? రాజకీయ లబ్ధి కోసం వైసీపీ గుండాలను, కిరాయి రౌడీలను వెంటేసుకుని మిర్చి యార్డుపై దండయాత్ర చెస్తారా? అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వా న్ని నిలదీసే ధైర్యం లేదు. జైలుకు వెళ్లి నేరస్థులను పరామర్శించడానికి గెలిపించామా? లేక తమ సమస్యల అసెంబ్లీలో మాట్లాడి పరిష్కరించడానికి గెలిపించామా అంటున్నారు ప్రజలు. తన హయాంలో క్వింటా మిర్చి రూ.20 వేలు పలికిందని చెబుతున్న జగన్ క్వింటా రూ.7 వేలుగా కనీస మద్దతు ధరగా నిర్ధారించి మిర్చి యార్డులో బోర్డు ఎందుకు పెట్టించారు? మార్కెట్ ధర కంటే తక్కువ ఎంఎస్‌పీ ప్రకటించిన జగన్ ఇప్పుడు క్వింటా రూ.20 వేలకు కొనాలని డిమాండ్ చేయడం ఎవరిని మోసం చేయడానికి? 2019-2022 మధ్యకాలంలో ధరలు పూర్తిగా పడిపోయాయి మరి ఆ రోజు మీరు మిర్చి యార్డు ను ఎందుకు సందర్శించలేదు? అటువంటి జగన్‌కు ఇప్పుడు మిర్చి రైతులపై మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? 2017లో మిర్చి ధర రూ.6000 నుంచి రూ.8000 మాత్రమే ధర పలికినప్పుడు ఆ ధర చాలదని మద్దతు ధర ప్రకటించి రైతాంగానికి బోనస్‌గా రూ.130 కోట్లు విడుదల చేసి దాదాపు 56,000 మంది రైతులను అదుకున్నది, సుమారు 87 వేల మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేసి ఒక్కో రైతుకు రూ.30,000 లబ్ధి చేకూర్చింది చంద్రబాబు ప్రభుత్వం అని జగన్ గుర్తించాలి.
నిజంగా ప్రజలు, రైతులపై జగన్‌కు ప్రేమ ఉంటే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. అలా కాకుండా అసెంబ్లీ కి దూరంగా ఉండి బయట తమ భజన మీడియా ముందు తన నివాసం నుండే ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తాననడం విడ్డూరం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వరాలు ఉండకూడదా? ఏపీ లో ప్రజాస్వామ్యం బతికే ఉందా అంటూ ఆస్కార్ లెవల్లో రంకెలు వేసిన ఆయన అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు? ప్రతి విషయం ఆయన చెప్పినట్లే జరగాలనుకోవడం ఇది రాచరికం కాదు కదా? అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిలదీసే ధైర్యం లేక సాకులు వెతుకుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పలాయన వాదన వినిపిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు, వాటికి ప్రభుత్వం ఇచ్చే సమాధానాలు అధికారికంగా రికార్డు అవుతాయన్న విషయం వెర్రి వెంగళప్ప జగన్‌రెడ్డి తెలుసుకోవాలి. ప్రజలు, వారి సమస్యలపై బాధ్యత ఉంటే ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండానే సమావేశాలకు హాజరై ప్రజల పక్షాన నిలబ డి పోరాడటం చేయడం జగన్ బాధ్యత. ఆ బాధ్యత నుంచి తప్పుకుని సమావేశాలు బహిష్కరించడం అంటే అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేక పారిపోవడమే అవుతుంది. తాము తమ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తేందుకే శాసనసభ్యులుగా గెలిపించి పంపాం తప్ప మీ సహచర నేరస్థులను జైలుకు వెళ్లి పరామర్శించడానికి గెలిపించలేదు అంటున్నారు ప్రజలు. సభలో పార్టీల సభ్యుల సంఖ్యాబలం ప్రకారమే విపక్ష నేత హోదా లభిస్తుందని తెలుసు. గత అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగానే తెలుగుదేశం సభ్యులకు సభలో సమయం కేటాయించిన విషయం గుర్తు లేదా? ఇప్పుడు సభ్యులతో సంబంధం లేకుండా సభలో సీఎం చంద్రబాబుతో సమానంగా మాట్లాదెందుకు సమయం, మైకు ఇవ్వాలని కోరడం ఇదేం పద్దతి? అసెంబ్లీ మీ జాగీరు అనుకొంటున్నారా? అసెంబ్లీ సమావేశాలకే వెళ్లకుండానే మైకు ఇవ్వరని వెళ్లడం లేదని సాకులు చెప్పడం ఏమిటి? మైకు ఇవ్వకపోతే సభలో నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉంది. ఐదేళ్లు తాను చేసిన పాపాలను కూటమి ప్రభుత్వం బయటపెడుతుందన్న బయంతో అసెంబ్లీకి వెళ్లడం లేదని అర్థం అవుతుం ది. నిజంగా రైతులపై ప్రేమ, అసెంబ్లీలో నిలదీసే ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి వెళ్లాలి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.
నీరుకొండ ప్రసాద్,
హైదరాబాద్,
9849625610