విశాఖపట్నం: తన రాజీనామాను స్పీకర్ ఆమోదించడంపై న్యాయపోరాటం చేస్తామని గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాజీనామాను ఆమోదించి జగన్ రాజకీ యంగా పాతాళానికి పడిపోయారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీ నామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమో దించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ కు దారి తీసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవే టీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయ గా ఎట్టకేలకు స్పీకర్ కార్యాలయం నుంచి మంగళవారం ఆమోదం లభించింది. ఈ విషయంపై గంటా శ్రీనివాసరావు స్పంది స్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడగకుండానే..కుట్ర కోణంతో రాజీనామా ను ఆమోదించారని ఫైర్ అయ్యారు. రాజ్య సభ ఎన్నికల గురించి జగన్ ఎంత భయ పడుతున్నారో తన రాజీనామా ఆమోదంతో అర్థమవుతోందని గంటా ఎద్దేవా చేశారు. రాజ్యసభ సీట్ల భయం జగన్‌లో కనిపిస్తోం దని… వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా 50మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తా రనే భయంలో జగన్ ఉన్నారని చెప్పారు. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ జగన్‌ను వెంటాడు తోందన్నారు. అప్పట్లో అవసరమైన ఎమ్మె ల్యే ల సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలవటం జగన్‌కు షాక్‌లా తగిలిందన్నా రు. దాంతో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల ముందు తన రాజీనామా అమోదించార న్నారు.రాజ్యసభ ఎన్నికల్లో తనఓటు హక్కు ను వినియోగించుకునేందుకు తనకున్న అవకాశాలపై న్యాయ నిపుణుల సలహాల ను తీసుకుంటా నని చెప్పారు.
పవిత్రమైన ఆశయం కోసం 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేశానన్నారు. స్వయంగా స్పీకర్‌ను కలసి రాజీనామా లేఖను సమర్పించానని.. వ్యక్తిగతంగా కలిసి మాట్లాడినట్లు తెలిపా రు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజీనామా తరువాత స్పీకర్‌ను ఎన్నిసార్లు కలిసినా రాజీనామాను ఆమో దించలేదన్నారు. రాజీనామా లేఖను కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారని… ఇప్పుడు కుట్రకో ణంతో ఆమోదించారని మండిపడ్డారు.తన ను అడగకుండా రాజీనామాను ఆమోదిం చారన్నారు. తాముచేసిన పోరాటానికి అప్ప టి ఉత్తరాంధ్ర వైసీపీఇంచార్జి విజయసాయి రెడ్డి, వైసీపీ నాయకులు మద్దతు తెలిపి పోరాటంచేసి ఉంటే కేంద్రం స్టీల్ ప్లాంట్‌పై ఆలోచన చేసేదేమో అని చెప్పుకొచ్చారు.
కేంద్రం వద్ద మెడలు వంచుతున్న జగన్
స్టీల్ ప్లాంట్ ఉద్యమం వైపు సీఎం జగన్ కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ విశాఖ పర్యటనకు అనేక సార్లు వచ్చినప్పటికీ దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సంఫీుభావం తెలపలేదన్నారు. సీఎం జగన్ కేంద్రం వద్ద మెడలు వంచు తున్నారని… మోదీకి మసాజ్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తన కేసుల కోసం కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నిక ల నేపథ్యంలో తన రాజీనామాను నిబంధ నలకు విరుద్ధంగా ఆమోదించారన్నారు. తాను చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ముందా?
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడు కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే పదవులు కాదు స్టీల్ ప్లాంట్ కోసం ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్‌కు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. పార్లమెంట్ సమావేశాలలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించగలరా? అని నిలదీశారు. వైసీపీని అనేక మంది వీడు తున్నారని… త్వరలో జరుగుతున్న ఎన్నిక లలో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యోగులు, నిర్వా సితులతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ పోరాటం, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడిరచారు.