- అంబేద్కర్ ఆశయాలన్నా, రాజ్యాంగమన్నా జగన్‌కు చిత్తశుద్ధి, గౌరవం లేవు
- ఆ మహనీయుడి పేరు తీసేసి తన పేరు పెట్టుకునేంత గొప్పవాడా జగన్
- దళితుల పట్ల చేసిన పాపాలన్నీ విగ్రహం ఏర్పాటుతో పోతాయా
- భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు రాజకీయ లబ్ధి కోసమే
- కోడికత్తి కేసులో అసలు ముద్దాయి జగనే
అమరావతి: సీఎం జగన్‌కి అంబేద్కర్ ఆశయాలన్నా, రాజ్యాంగమన్నా చిత్తశుద్ధి, గౌరవం ఏ కోశానా లేవని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ రూ.404 కోట్ల ఖర్చుతో విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేసింది రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం తప్ప అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధితో కాదన్నారు. చంద్రబాబు పెట్టిన అంబేద్కర్ విదేశీవిద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి, జగన్ పేరు పెట్టినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మనసు గాయపడిరది. నేర చరిత్ర కలిగిన జగన్ ఆర్థిక నేరగాడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. జగన్ ఏం చదివారో, ఎంతవరకు చదివారో ఎవరికీ తెలియదు. అంబేద్కర్ అంతటి మహనీయుడు, మేధావి, విద్యావేత్త పేరు తీసి జగన్ పేరు పెట్టవచ్చా? జగన్ కు అంబేద్కర్ పై అభిమానం, గౌరవం రెండూ లేవు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏనాడైనా జగన్ పాటించాడా? దళిత మంత్రులు, ఉప ముఖ్య మం త్రులను, ఎమ్మెల్యేలను జగ్ అవమానపరిచాడు? 188 మంది దళితులను పొట్టన పెట్టుకున్నాడు. డాక్టర్ సుధాకర్‌తో సహా ఎంతోమంది దళితులను హింసించి చంపారు. 28 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఇతర పన ులకు వినియోగించి దళితులకు అన్యాయం చేశాడు. ఈ పాపాలన్నీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో పోతా యా? కోడికత్తి శీను కేసులో నిశితంగా దర్యాప్తు చేస్తే అందులో ప్రథమ ముద్దాయి జగన్ రెడ్డే అని తేలుతాడు. రాజకీయ లబ్ధి కోసం జగన్, ఆయన పార్టీ వారు పన్నిన హత్యా యత్నం కుట్రలో అసలు సూత్ర ధారులు జగన్ అండ్ కో, పాత్రధారి కోడికత్తి శీను మాత్రమేనని వర్ల చెప్పారు.
వరాలిచ్చి ఆ వరాల్ని గాలిలో కలిపే వ్యక్తి జగన్
జగన్ మాట వేరు, చేసే పని వేరుగా ఉంటుంది. ఎన్నో వరాలిస్తాడు, చివరకు ఆ వరాలన్నీ గాలిలో కలిపేస్తాడు. దళితులకు వరాలిస్తాడేగానీ ఆ వరాలు నెరవేరవు. దళితులను అగ్ర పీఠాన కూర్చో బెడతానంటాడు. అందుకు విరుద్ధంగా అధో పాతాళానికి తొక్కేస్తాడు. దళితులపై ప్రేమ జగన్ మాటల్లో కాదు చేతల్లో చూపాలి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని దీర్ఘాలు తీసి మరీ చెబుతాడు. కాని వారిని తక్కువ చేసి చూస్తాడని వర్ల తప్పుబట్టారు.
దళితులకు మేనమామనని చెప్పి మోసం చేశాడు
తాను దళితుల మేనమామను అని జగన్ చెప్పడంతో ఆ భ్రమతో దళితులు మోసపోయారు. జగన్ మాయ మాటలు చెప్పి మోసం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ ని నమ్మారు. దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాడు. తరువాత దళిత వర్గాల్ని ఈస డిరచు కుంటు న్నాడని వర్ల దుయ్యబట్టారు.
ఐదున్నరేళ్లలో దళితులపై 6వేల దాడులు
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాదాపు 6వేల దాడులు జరిగాయి. రికార్డులో కూడా నమోదయ్యాయి. 188 మంది దళితులు హత్యకు గురయ్యారు. జగన్ పాలనలో వారానికి నలుగురు దళితులు హత్యకు గురవుతున్నారు. వారానికి ఆరుగురు దళితులపై హత్యా యత్నం జరుగుతోంది. వారానికి ముగ్గురు దళిత మహిళలపై అత్యాచారాలు జరుగు తున్నాయి. దళితులకు జగన్ పాలనలో రక్షణ లేదు. దళిత మహిళలు ధైర్యంగా తిరిగే స్వేచ్ఛ లేదు. విజయ వాడలో డాక్టర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తే 188 మంది దళితులను చంపిన పాపాలు పోతాయా అని వర్ల ప్రశ్నించారు.
మాస్క్ అడిగాడని డాక్టర్ సుధాకర్ ను చంపేశారు
డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే చంపేశారు. వరప్రసాద్ కి శిరోముండనం చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే ఓ దళితుడిని చంపేశారు. మద్యం ధరలపై ప్రశ్నించిన దళిత యువకుడు ఓం ప్రకాశ్ శవమయ్యాడు, డాక్టర్ అచ్చెన్నను కూడా పొట్టన పెట్టుకున్నారు. కంచికచర్లలో ఒక దళిత యువకుడిని వైసీపీ నాయకులు కారులో తీసుకెళ్లి హింసించారు. ఆ దళితుడు దాహం వేస్తోంది నీరు ఇవ్వమంటే చుట్టూ మీవారు నిలబడి నోటిలో మూత్ర విసర్జన చేశారు. కడప జిల్లా పులివెందులకు చెందిన దళిత మహిళ నాగమ్మ పశువులు మేపడానికి వెళ్లినపుడు ఇద్దరు వైసీపీ సానుభూతిపరులు చంపేస్తే, శవాన్ని చూడడానికి కూడా వెళ్లలేదు. చూడటానికి టీడీపీ నాయకులు వెళితే వారిపై కేసులు పెట్టారు. ఆ పాపాలు ఊరికే పోవని వర్ల అన్నారు.
దళిత రైతులకు బేడీలు వేయించారు
అమరావతిలో ఎన్నికలకు ముందు నా దళిత రైతులు అని మాట్లాడి చివరకు వారిపైనే కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. దళిత రైతుల చేతులకు బేడీలు వేశారు. మీ మాయమాటలు నమ్మే స్థితిలో జనం లేరు. జగన్ రాజకీయ కుట్రలు అందరికీ తెలుసు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం దళిత ఓట్లు పొందడానికి పన్నిన రాజకీయ కుట్ర అని ప్రజలు గ్రహించారు. ఇప్పటికైనా దళితులు చైతన్యవంతులవ్వాలి. అంబేద్కర్ విగ్రహం ఏర్లాటు సందర్భంగా వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫంక్షన్లో దళిత మంత్రి, వేమూరి ఎమ్మెల్యే నాగార్జున పేరు ఎవరూ చెప్పలేదు. మరో దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ఎవరూ చెప్పలేదు. లైట్ల వెలుగులో జగన్ ముఖం వెలుగుతోందే తప్ప దళిత మంత్రులు, నేతల ముఖాన నెత్తురు చుక్క లేదని వర్ల విమర్శించారు.
భూమి కొనుగోలు పథకం ఏమైంది
చంద్రబాబునాయుడు భూమి కొనుగోలు పథకం పెట్టి అనేకమంది దళిత పేదలకు భూములిచ్చి ఆదుకున్నారు. జగన్ ఒక్క ఎకరం ఇవ్వలేదు, ఈ విషయం వైసీపీ నాయకుడు జూపూడి ద్వారా తెలుసుకోవచ్చు? జగన్ ముఖ్యమంత్రిగా ఒక్క ఎకరం ఎవరికైనా పంచారా? పంచలేదు. జూపూడి ఈ విషయం చెప్పకపోతే ఆత్మవంచన చేసుకున్నట్లే. జగన్ వేసే ప్రతి అడుగు రాజకీయ లబ్ధి కోసమే. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్‌లు పెట్టి కూర్చోవడానికి కుర్చీ లేకుండా చేవారు. రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ఈ కార్పొరేషన్‌ల్లో ఒక్క రూపాయి లేదు. దళితులకు మీరు ఒక్క ఇన్నోవా కారైనా ఇచ్చారా? చంద్రబాబు ఎందరికి ఇచ్చారో జూపూడిని అడగాలి. చంద్రబాబు 7 వేల కార్లు ఇచ్చారు. మీరెంతమందిని వాళ్ల కాళ్లమీద వాళ్లను నిలబడేలా చేశారు? ఈ పాపాలన్నీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వేస్తే పోతాయా అని వర్ల ప్రశ్నించారు.
28 సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్
దళిత వర్గాల అభివృద్ధికి చంద్రబాబు పెట్టిన 28 సంక్షేమ పథకాలను జగన్ అధికారం చేపట్టిన మొదటి రోజే తీసి పడేశాడు. దళితులకు సంక్షేమం అక్కర్లేదు అన్నాడు. ఏ చిత్తం శివుడిపై భక్తి చెప్పులపై అన్న చందాన జగన్ తీరు ఉందని వర్ల అన్నారు.
కోడికత్తి కేసు జగన్ కుట్రే
కోడికత్తి శ్రీనుది పెద్ద కుట్ర. కోడికత్తితో పొడిపించుకోవడంలో సూత్రధారుడు జగన్. ఆయన పార్టీ నాయకులు పన్నిన కుట్రలో కోడికత్తి శీను బలయ్యాడు. ఆ జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీనుకు జగన్ మీద ఉన్న ప్రేమ, అభిమానాన్ని ఆసరాగా చేసుకొని జగన్ లబ్ధి పొందాడు. కోడికత్తితో గుచ్చించు కొని రాజకీయ లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యాడు. మీ కుట్రలో కోడికత్తి శీను బలిపశువయ్యాడు. ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఈ విషయంలో జగన్ సమాధానం చెప్పడు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు సరిగా చేయలేదు. ఇది జగన్ పన్నిన కుట్ర. అధికారంలోకి రావడం కోసం జగన్ ఆడిన డ్రామా ఇది. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తే జగనే ముద్దాయి అవుతాడు. వారి పార్టీ నాయకులు పన్నిన పన్నాగమే ఇది. కోడికత్తి శీను కేసును న్యాయస్థానాలు ఎందుకు తేల్చడంలేదు. ఐదేళ్లుగా చిన్నకేసుపై శ్రీను శిక్ష అనుభవిస్తున్నాడు. అర సెంటిమీటర్ గాయం చేసినదానికి ఇంతపెద్ద శిక్షా? అరసెంటీమీటర్ గాయానికి వైద్య నిపుణులు 9 కుట్లు ఎలా వేశారు. వైజాగ్ ఆసుప్రతి లో వైద్యం చేయించుకొని ఉంటే జగన్ కుట్ర బయట పడేది. హత్యా ప్రయత్నం కేసే ఉండేది కాదు. అక్కడి పోలీసు స్టేషన్ కు వెళ్లమంటే నిరాకరించాడు. ఇందులో జగన్ కుట్రను బయటికి తీయాలి. మా దళిత బిడ్డ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ దీక్షకు టీడీపీ పూర్తి మద్దతు పలుకుతోంది. ఐదేళ్లుగా హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీగా కోడికత్తి శీనును ఎలా ఉంచారో ఎన్‌ఐఏ సమాధానం చెప్పాలి. కోడికత్తి దాడి కేసులో సీఎం జగన్ కోర్టుకు హాజరై తన కుట్రలో బలిపశువైన శ్రీనుకు న్యాయం చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.