- అందుకోసమేగా పార్టీ పెట్టింది..కాదని చెప్పగలరా?
- మోదీ కాళ్ల ముందు సాగిలపడిరది దానికోసమేగా?
- ఆయన రాష్ట్రానికి చేసిన మేలు ఒక్కటైనా ఉందా?
- దగుల్బాజీ పత్రిక లైసెన్సును రద్దు చేయాలి
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
అమరావతి(చైతన్యరథం): కటకటాల్లోకి వెళ్లకుండా చూసుకునేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకెళ్లి గల్లీ గల్లీ తిరిగి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్‌రెడ్డి ఏనాడూ ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు ఢిల్లీకి వెళ్లలేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మం గళవారం విలేకరుల ఆయన మాట్లాడారు. నేతల కాళ్లు పట్టుకుని తన సొంత ప్రయోజనాల కోసం పాటుపడ్డారే తప్ప జగన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి చేసిన మేలు ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. జగన్ రాజకీయ ప్రస్తానమంతా కేసుల నుంచి తప్పించుకోవడానికే వెచ్చించా రే తప్ప ప్రజాసేవ ఏనాడూ చేయలేదన్నారు. కొందరు ప్రజాసేవ చేయడానికి రాజకీయా ల్లోకి వచ్చానని చెప్పి పబ్బం గడుపుకుంటుంటారు..జగన్ ఆ కోవకు చెందినవాడేనని అన్నా రు. జగన్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టే నాటికే ఆయనపై బోలెడు కేసులున్నాయి. ఆయనకు పెద్ద క్రిమినల్ చరిత్ర ఉంది. 16 నెలలు చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నాడు. కేసుల నుంచి తప్పించుకోవడానికి, కేసుల నుంచి రక్షణ పొందడానికి, జైలుకు పోకుండా తనకు తాను కాపాడుకోవడం కోసం ఆయన రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు నడుపుతున్నాడంటాను. దీనికి జగన్ సమాధానం చెప్పగలరా? కాదనగలరా? అని ప్రశ్నించారు.
29 సార్లు వెళ్లి ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?
జగన్ ఐదేళ్లలో 29 సార్లు ఢల్లీి వెళ్లారు. వెళ్లినప్పుడల్లా ప్రజలు చకోర పక్షుల్లాగా ఎదురు చూశారు. ఢిల్లీ నుంచి నిధుల మూటలు మోసుకొస్తాడని, కోట్లాది రూపాయల రాయితీలు తెస్తాడని, ప్రజా సంక్షేమం కోసం పథకాలు మంజూరు చేయించుకుని వస్తాడని ఎదురు చూశారు. వారి ఎదురుచూపులు ఎదురుచూపులుగానే మిగిలిపోయాయి. పోలవరం పూర్తి చేయడానికి గ్యారంటీగా నిధులు తెస్తాడనుకున్నారు. ఉత్త చేతులతో వచ్చాడు. అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది, తమ కష్టాలు తీరుతాయని జనం ఆశించారు. వారి ఆశలు నిరాశలయ్యాయి. ఢిల్లీవిభజన హామీలు నెరవేర్చుకుని వస్తాడనుకున్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రధాని వద్ద సాగిలబడి తన కేసుల మాఫీ గురించి విన్నవించుకుని తిరిగి కారెక్కి విజయవాడ వచ్చేసేవాడు. ఎవరైనా రాజకీయ నాయకులు ఢిల్లీ పెద్దలను కలిస్తే ప్రెస్ మీట్ పెడతారు కానీ జగన్ అలా చేయడు. మీ కేసులు ప్రధాని వద్ద ప్రస్తా వించారు తప్ప మరొకటి లేదు. నన్ను జైలుకు వెళ్లకుండా కాపాడండి అని వేడుకోవడం తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఏనాడైనా జగన్ అడిగారా? అడిగానని చెప్పే ధైర్యం మీకుందా? ఇన్నాళ్లూ ప్రజల చెవుల్లో పూలు పెట్టారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు రాష్ట్ర గౌరవాన్ని పెంచితే జగన్ ఏం చేశారు?
చంద్రబాబు ఢల్లీి వెళ్లి ప్రధానిని కలిశారు. ముఖ్యమైన మంత్రులను కూడా కలిశారు. స్వయంగా కేంద్రమంత్రే చంద్రబాబు ఉన్న చోటికి వచ్చారు. అదీ.. చంద్రబాబు ఢిల్లీలో పొందే గౌరవం. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రెస్‌మీట్ పెడతారు. రాయితీలను వివ రిస్తారు. రూ.2,800 కోట్ల నిధులను ఢిల్లీ నుంచి సాధించడం గొప్ప విషయం. పోలవరం ప్రాజెక్టుకు ఈ నిధులు ఇస్తామన్నారని చంద్రబాబు బాహాటంగా ప్రకటించారు. జగన్ ఇలా ఏనాడైనా ప్రకటించారా? ఇన్నాళ్లు తాను కోర్టుకు వెళ్లనవసరం లేదని, కేసుల విచారణ అంత స్పీడుగా రాదులే అనే ధోరణితో ఉన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఆయన చేసిం దేమీలేదు. వరద బాధితుల సహాయార్థం రూ.15 వేల కోట్లు ఇస్తామని ఢల్లీిలో చెప్పారు. మీరు వెళ్లినప్పుడు అలా చెప్పారా? విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కదల్చడానికి వీలులేదని చంద్ర బాబు ఢిల్లీ పెద్దలతో, ప్రధానితో చెప్పారు. మీరెప్పుడైనా ఇలా చెప్పారా? రాష్ట్రంలో 8 జిల్లా లు వెనుకబడిపోయాయని, ఆ 8 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని పట్టుబట్టి చంద్రబాబు తీసుకొచ్చారు. మీరెప్పుడైనా అలా తెచ్చారా? రాష్ట్ర అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లా డారా? అని ప్రశ్నించారు. ఢల్లీలో రాష్ట్ర గౌరవాన్ని విపరీతంగా పెంచిన ఘనాపాటి చంద్రబాబు. ప్రజల తరపున ముఖ్యమంత్రిగా ఢిల్లీలో మాట్లాడేవారు. జగన్ తన సొంత విషయాలు తప్పితే ప్రజల గురించి ఏనాడు మాట్లాడలేదు. జగన్ విభజన హామీల్లో ఒక్క హామీనైనా నెరవేర్చమని ఢిల్లీ పెద్దలను ఏనాడైనా అడిగారా? డిసెంబరులో విశాఖ రైల్వే జోన్ వస్తుందని సాక్ష్యాత్తు రైల్వేమంత్రే చంద్రబాబుతో చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం ఇటు వంటివేమైనా జగన్ సాధించారా?
మోదీకి మోకరిల్లడం వల్లే కోర్టుకు పోలేదు..నిజం కాదా?
ఆనాడు వైసీపీ అఘాయిత్యాలను నిలదీసినందుకు రఘురామకృష్ణంరాజును హింసించి కక్ష సాధించుకున్నారు. మోదీ వద్ద సాగిలపడడం వల్లే ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్లలేదు. ఈ విషయం నిజం కాదని చెప్పగలరా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మామూలు ముద్దా యిలకు ఒక న్యాయమా? ఎందుకిలా జరుగుతోంది? జగన్‌కే ఈ వెసులుబాటు ఎందుకు ఉంది? ఏ చట్టంలో ఇలా ఉందో న్యాయకోవిదులు చెప్పగలరా? పదవిపోయి నాలుగు నెల లైనా కోర్టుకు వెళ్లలేదు. అతని ఇష్టానుసారంగా నడుస్తోంది. చట్ట ప్రకారం అతనికి శిక్ష పడాలి. సీబీఐ 11 కేసులు, ఈడీ 5 కేసులు నమోదు చేసింది. అవి ఎప్పుడు పూర్తి అవుతా యి? 2012లో జగన్‌పై చార్జిషీట్లు వేస్తే ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. గతంలో దేశ ప్రధాని ఇందిరాగాంధీó అంతటి వారినే అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇతను వారికన్నా గొప్పవాడా? జగన్‌లో ఏమైనా ప్రత్యేకత ఉందా? ఈ ప్రత్యేకత అందరు ముద్దాయిలకు వర్తిస్తుందా? లేక జగన్‌కు ఒక్కడికేనా? జగన్ పేరులో, హోదాలో గొప్పతనమేమైనా ఉం దా? భారతదేశ పౌరుడిగా నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రిగా ఉంటే కోర్టులకు హాజరుకానవసరం లేదా? జగన్ తనకు శిక్షలు పడకుండా చూడండని ఢిల్లీ వెళ్లాడే తప్ప ప్రజల కోసం కాదు. ఐదేళ్లు సీఎంగా జగన్ కోర్టుల విచారణకు హాజరుకాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు. నాలుగు నెలలుగా కోర్టులకు ఎందుకు హాజరుకావడం లేదు..మతలబు ఏంటి? విపత్తుల సమయంలో చంద్రబాబు పోషించిన పాత్ర తీరును దేశ ప్రజలందరూ అభినందించారు. జగన్ సాక్షి పత్రికలో మాత్రం దగుల్బాజీ రాతలు రాయిస్తు న్నాడు. సాక్షి వార్తా పత్రిక కాదు.. ఒక రోత పత్రిక. అది వైసీపీకి కరపత్రంగా మారింది. అందులో సందేహమేమీ లేదు. సాక్షి లైసెన్స్‌ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేయా లని డిమాండ్ చేశారు.