- నేడు రాజధానిలో చంద్రబాబు పర్యటన
- ముఖ్యమంత్రి టూర్‌పై సర్వత్రా ఆసక్తి
- ఐదేళ్లుగా.. అమరావతిని అలముకున్న చీకట్లు
- జగన్ నిర్వాకంతో నష్టపోయిన రాష్ట్రం
- వైసీపీ నిర్లక్ష్యం కారణంగా నష్టాలపై నేడు అంచనాలు?
అమరావతి (చైతన్య రథం): ఐదు కోట్ల ఆంధ్రుల కల `మళ్లీ జీవం పోసుకుంటోంది. రాష్ట్రాభివృద్ధికి ఆయువుపట్టులాంటి అమరావతిలో చంద్రబాబు పర్యటన ఆంధ్రావనిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రపంచంలో ఏమూలనున్నా.. ‘నా ఆంధ్ర.. నా అమరావతి’ అని బోరవిరుచుకుని చెప్పుకోగలిగే రోజుకోసం చాలాకాలంగానే రాష్ట్రప్రజలు ఎదురు చూస్తున్నారు. వైసీపీ గద్దెనెక్కిన దగ్గర్నుంచీ.. ప్రపంచ వేదికలమీద రాజధాని ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆంధ్రావని నేలచూపులు చూస్తూనే ఉండిపోయింది. రాజధాని విలువ తెలియని పాలకవాజమ్మ గద్దెపైనుంచి గొప్పలు చెప్పడం వినా.. రాష్ట్ర రాజధానిని పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ‘అమరావతి’పై పగబట్టిన అసుర పాలకుడు- ఆంధ్రావని ఆశలను కాలరాశాడు. అమరావతి నిర్మాణ మహాయజ్ఞాన్ని మలినం చేశాడు. 2017లో తెదేపా సారథ్యంలో శరవేగంగా అమరావతి పనులు మొదలైన సమయంలో జగన్ కపట మాటల్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ‘నేను అధికారంలోకి వస్తే అమరావతిలో రాజధాని ఉండదని, ఇక్కడినుంచి మార్చేస్తానని సీఎం చంద్రబాబు పదేపదే చెప్తున్నారు. విజయవాడ`గుంటూరు మధ్యనున్న సీఆర్డీఏ ప్రాంతంలోని అమరావతి గడ్డనుంచే చెప్తున్నా. ఎప్పటికీ రాజధాని అమరావతే’నంటూ ప్రకటించాడు జగన్. జనం నమ్మారు. 2019లో జగన్‌ను గద్దెనెక్కించారు. తరువాత పెత్తందారు నిజస్వరూపం బయటపడిరది. రాష్ట్రంలో ఐదేళ్లపాటు అప్రతిహత విధ్వంసం సాగిపోయింది. బాబుపై పగబట్టి.. ప్రజా రాజధానిని మట్టుబెట్టాడు. అమరావతి గుండెల్లో దింపిన గునపాల శబ్దాలు.. ఆంధ్రుల గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి. ఏపీ ప్రగతి దీపాన్ని నిర్థాక్షిణ్యంగా ఆర్పేసిన ప్రజాద్రోహి జగన్!
జగన్ భ్రష్టపాలన కారణంగా అమరావతి ఎక్కడ ఆగిందో అక్కడినుంచే మొదలవుతుందా? ప్రజా రాజధాని వాస్తవ పరిస్థితి ఏమిటి? కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్న దగ్గర్నుంచీ ఈ అంశాలపై నవ్యాంధ్రుల్లో ఆసక్తి కనిపిస్తోంది. అయితే, అమరావతి రూపశిల్పి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం రాజధానిని సాధ్యమైనంత త్వరగానే సాకారం చేయగలదన్న విశ్వాసంతో రాష్ట్రంవుంది. ఐదేళ్ల చెరవీడిన అమరావతి రానున్న ఐదేళ్లలో వడివడి అడుగులేసి ఒక రూపాన్ని సంతరించుకుంటుందన్న ఆశ ప్రజల్లో కనిపిస్తోంది.
కష్టాలు.. నష్టాలు
రాజధాని పునర్నిర్మాణంపై ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో, వైసీపీ నిర్వాకంతో నష్టం అంతకంటే ఎక్కువుంది. జగన్‌లాంటి రాక్షస మూకలు భవిష్యత్‌లో రాజధానివైపు కన్నెత్తి చూడకుండా చేయాలంటే.. అమరావతిని సుస్థిరపర్చడం నుంచే సర్కారుకు సవాలు మొదలవుతుంది. అకుంఠిత లక్ష్యాలు, ఆచరణాత్మక ప్రణాళికలు నిర్దేశించుకుని.. ఆంధ్రావని ఆశలమేరకు మొదటి దశ పూర్తి చేయాల్సిన బృహత్తర బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిజానికి, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు 72 శాతం, ఎన్జీవోల భవంతులు 62 శాతం, గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు 65 శాతంమేర చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యాయి. కాని, జగన్ రాక్షస పాలనలో ఐదేళ్లు నిరాదరణకు గురైన భవంతుల పరిస్థితి ఏమిటనేది పరిశీలించాల్సి ఉంది. వర్షాల కారణంగా నీటిలో నానుతున్న నిర్మాణాల పటిష్టతను సాంకేతిక నిపుణులతో అంచనా వేయించాలి. తరువాతగానీ తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. రాజధాని ప్రాంత పరిశీలన అనంతరం.. అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించిన తరువాత `ప్రభుత్వం ఎలాంటి చర్యలకు సన్నదమవుతుందో చూడాలి. అమరావతి యథాస్థితి, తదుపరి కర్తవ్య నిర్వహణకు కేబినెట్ సబ్ కమిటీ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైతే, ఆ కమిటీ సమర్పించే సమగ్ర నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాలి. ఆ తరువాతే సవరించిన అంచనాలతో పనులు మొదలుపెట్టి.. నిర్దేశిత సమయంలో నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. గుత్తేదారులకు పెండిరగ్ బిల్లుల చెల్లింపు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, గడువు పొడిగింపు, ప్రస్తుత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించాలా? లేక మళ్లీ టెండర్లు పిలవాలా? అన్న అంశాలన్నీ ముఖ్యమంత్రి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. సాఫీగా సాగిపోయే రాజధాని వ్యవహారంలో ఇంత సంక్లిష్టత కావడానికి కారణం వైసీపీ నిర్లక్ష్యమే.
చక్కబెట్టాల్సిన అంశాలివీ..
అమరావతిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు, మిగిలిన అనుసంధాన రహదారులను చక్కదిద్దడంతోపాటు, రాజధానిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానించాల్సి ఉంది. అలాగే, రాజధానిపై వైసీపీ సర్కారు చూపించిన నిర్లక్ష్యం కారణంగా.. ఎన్‌ఐడీ, ఎస్‌ఆర్‌ఎం, విట్‌లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. వీటిని పరిష్కరిస్తే, మరిన్ని సంస్థలు అమరావతికి వరుస కడతాయనడంలో సందేహం లేదు. రాజధానిలో భూములు కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వెంటనే పనులు ప్రారంభించి నిర్దిష్ట కాలపరిమితితో కార్యకలాపాలు సాగించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తూనే, భవిష్యత్తు తాగునీటి అవసరాలకు వైకుంఠపురం వద్ద రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. క్రైసిస్ మేనేజ్‌మెంట్‌లో నిష్ణాతులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు రాజధానిని పరిశీలించిన తరువాత ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా ఉంది. రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడిరపచేసే ప్రజా రాజధాని అమరావతి `ఆంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకే ఆవిష్కృతమవ్వాలని ఆశిద్దాం. జయహో.. అమరావతి!
ఇన్‌సెర్ట్ ఐటెమ్
ఐదేళ్ల తరువాత..
అధికారిక హోదాలో..
రాజధాని నిర్మాణాలు పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి నిలువుటద్దమైన ప్రజా రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ప్రతిష్టాత్మక నిర్మాణం పోలవరాన్ని సందర్శించిన చంద్రబాబు, మలి పర్యటనగా నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. గురువారం తన నివాసం నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరనున్న చంద్రబాబు, ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచే పర్యటన ప్రారంభించనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, అఖిల భారత అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఇతర నిర్మాణాలను పరిశీలిస్తారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్‌లనూ సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం రాజధాని స్థితిగతులపై చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు.