• వెంకటగిరి నియోజకవర్గం జోరేపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామం నుండి వెంకటగిరి-సిద్ధవరం క్రాస్ రోడ్డు వరకు రెండు కిలోమీటర్లు ఫారెస్టు ఏరియాలో ఉంది.
• మేం వెంకటగిరి, తిరుపతికి వెళ్లాలంటే మేం అదనంగా 17 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
• ఫారెస్టులో 2 కి.మీ. రోడ్డు వేసినట్లయితే 10 గ్రామాల ప్రజలకు అదనంగా వెళ్లాల్సిన దూరం తగ్గుతుంది.
• దీనివల్ల జోరేపల్లి, చెర్లోపల్లి, చీకవోలు, వరికుంటపల్లి, లింగనపాలెం, దగ్గోలు, అన్నమరాజుపల్లె, అక్కమాంబపురం, ఆర్జివి పాలెం వంటి 10 గ్రామాల ప్రజలకు చుట్టూ తిరిగే వెళ్లే ఇబ్బందులు తప్పుతాయి.
• మీరు అధికారంలోకి వచ్చాక ఫారెస్టు నుండి రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను గాలికొదిలేసింది.
• టిడిపి అధికారంలోకి వచ్చాక వెంకటగిరి-సిద్ధవరం మధ్య ఫారెస్టులో రోడ్డును నిర్మిస్తాం.
• 10 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా అటవీ అనుమతులు తీసుకొని రహదారి నిర్మిస్తాం.