ఉండవల్లి: ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్స్) ప్రతినిధులు సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. జర్నలి స్టుల సమస్యలపై వినతిపత్రాన్ని అందిం చి.. అందులోని అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలి స్టులందరికీ అక్రిటిడేషన్, వెల్ఫేర్ ఫండ్ పునరుద్ధరణ,విధి నిర్వహణలో ఉన్న జర్న లిస్టులపై, మీడియా సంస్థలపై దాడులు అరికట్టడానికి మహారాష్ట్ర తరహాలో ప్రత్యే క చట్టం, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా,నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డుల స్కీం పటిష్టతవంటి సుమారు 15 అంశాలతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు.గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలను పునరుద్ధరిం చాలని కోరారు.
జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధుల సమస్యలు విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు రద్దు చేసిన పథ కాలు మళ్లీ ప్రవేశపెడతామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రింట్, ఎల క్ట్రానిక్ మీడియాకు స్వేచ్ఛాయుత వాతా వరణాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమ సుందర్, చావా రవి, తదితరులు పాల్గొన్నారు.