అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొన సాగుతోందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్ నారాయణ మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని బుధవారం ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య పోరాటం జరుగుతోందని వివరించారు. సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదన్నారు. అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయ పడ్డా రు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమంకోసం ఖర్చుచేయడం సరికాదని జేపీ సూచించారు. సంక్షేమమే పాలన అను కుంటే ఆదేశం, రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయం అని హెచ్చరించారు. నేటి బాలలే రేపటి పౌరు లు అంటారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాలని జయప్రకాశ్ నారాయణ సూచించారు.
పేదరికం సమూలంగా వెళ్లిపోవాలని, అప్పుడే అభివృద్ధి జరుగు తోందని పేర్కొ న్నారు. సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు అని, అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడం అని వివరించారు. ఉపాధి కల్పించి, పెట్టు బడులు అందజేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంద న్నారు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి మాట లేకుండా పోయింది. ఐదేళ్లలో ఏపీ పేరు దిగజారి పోయింది. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చింది. దోపిడీ చేస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేశామని చెబుతున్నారు. ప్రజాపాలన ఇది కాదని జేపీ ధ్వజమెత్తారు.
ఒడిశా కన్నా దారుణం
ఒడిశా కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిందని జేపీ మండిపడ్డారు. మన రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి రెవెన్యూ పెంచుకోలేక పోయారు. కుల,మతం,హింస రాజ్య మేలిన ఉత్తరప్రదేశ్ తీరు కూడా మారింది. ఏపీ పరిస్థితి మాత్రం నానాటికీ దీగజారుతోందని జేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జేపీ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు
ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చేందుకు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. ప్రగతిశీల, ప్రజాస్వామిక ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని జయప్రకాష్ నారాయణ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. తీవ్ర ముప్పు పొంచి ఉన్న మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు భావసారూప్యత గల వ్యక్తులు, సంస్థలు అందరూ కలిసి రావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
జేపీకి లోకేష్ కృతజ్ఞతలు
లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయ ణ ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అన్ని అంశాల పై సమగ్రఅవగాహన కలిగిన జయప్రకాశ్ నారా యణవంటి మేధావి ఏపీఎన్నికల్లో కూటమికి మద్దతు పలకడం హర్షణీయం అనిపేర్కొన్నారు. ఏపీలో ప్రజా స్వామ్య పరిరక్షణకు మీవంతు పాత్రను పోషించేందు కు ముందుకు రావడంపట్ల మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సర్ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు