• కనిగిరి ఒంగోలు బస్టాండు వద్ద 10 వవార్డు ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
• మైనారిటీలకు గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
• మైనారిటీలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కలిగిన పదవులు కేటాయించాలి.
• ఇస్లామిక బ్యాంకు ఏర్పాటు చేసి ముస్లిములకు ఆర్థిక తోడ్పాటునందించాలి.
• హజ్ హౌస్ లోని నిధులను కేవలం దాని అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలి.
• మా వార్డులో డ్రైనేజీ సమస్య అత్యధికంగా ఉంది. బీసీలకు శ్మశానవాటికను అభివృద్ధి చేయాలి.
• నిత్యావసరాల ధరలు, బస్సు, కరెంటు ఛార్జీలు తగ్గించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మైనారిటీల ఆస్తులపై ఉన్న శ్రద్ధ వారి సంక్షేమంపై లేదు.
• మైనారిటీ సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.5400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు.
• గత నాలుగేళ్లలో వేలకోట్ల మైనారిటీ ఆస్తులను వైసిపినేతలు కబ్జాచేశారు.
• నర్సరావుపేటలో మసీదు ఆస్తుల కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను దారుణంగా నరికిచంపారు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి, పేద ముస్లింల స్వయం ఉపాధికి రుణాలు అందజేస్తాం.
• హజ్ హౌస్ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం.
• గత ప్రభుత్వంలో మైనారిటీలకు అందించిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.
• కనిగిరి పట్టణంలో డ్రైనేజి, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.
• నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోకి తెస్తాం.