- అక్రమాలు నిజమైతే బినామీ చట్టాన్ని ప్రయోగించండి
- అమరావతితోపాటు విశాఖ భూములపై విచారణ జరపండి
- అరిగిపోయిన రికార్డునే మళ్లీమళ్లీ ఎన్నిసార్లు వేస్తారు?
- సిగ్గులేకుండా తప్పుడు మాటలు మాట్లాడతారా?
- రాజధాని ప్రకటనకు ముందు భూములు కొన్నామని నిరూపిస్తే రాసిస్తా
- సమాధానం చెప్పలేక ఆర్థికమంత్రి బుగ్గన హ్యాండ్సప్
అమరావతి : రాజధానిలో తెలుగుదేశం నేతలు భూములు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని నమ్మబలికేందుకు అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పిఎసి చైర్మన్ పయ్యావుల కుటుంబ సభ్యులపేర్లను సభలో చదివిన బుగ్గన నిద్రపోతున్న సింహాన్ని లేపి తన్నించుకున్నట్లుగా కేశవ్‌ను కెలికి అభాసుపాలయ్యారు. ఇన్ సైడర్ ట్రేడిరగ్ ఆరోపణల్లో దమ్ముంటే బినామీ చట్టాన్ని ఉపయోగించి మా భూములు స్వాధీనం చేసుకోండి.. ఇదే సమయంలో విశాఖలో గత మూడేళ్లుగా జరిగిన భూ లావాదేవీలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోండి అనడంతో అధికారపార్టీ ఇరకాటంలో పడింది. ఆర్థికమంత్రి బుగ్గన కేశవ్‌ను అనవసరం కెలికి గోకి తన్నించుకున్నట్లుగా చేశారన్న అభిప్రాయాన్ని కొందరు వైసిపి సభ్యులు అసెంబ్లీ లాబీల్లో సణగడం కన్పించింది.
సాక్షిలో పతాక శీర్షికన వచ్చాకే కొన్నాం
బుగ్గనగారూ మాట్లాడుతూ రాజధాని భూములు తెలుగుదేశం వాళ్లకు ముందే ఎలాతెలిసింది అంటున్నారు. 2014లో వేసిన అరిగిపోయిన రికార్డునే ఆయన మళ్లీ వేస్తున్నాడు. నేనుచాలా స్పష్టంగా ప్రకటన చేస్తు న్నాను. ఆనాడు సిఎం ప్రకటన చేసిన తర్వాత, సాక్షిలో పతాక శీర్షికలో వార్తలు వచ్చిన తర్వాత, ఇదే శాసన సభలో గ్రామాలతో సహా వచ్చిన తర్వాత రోజుల్లో నేను భూమి కొన్నాను. ఎలక్షన్ అఫిడవిట్‌లో కూడా చూపా. సిఎం ప్రకటన చేసిన తర్వాత కొంటే తప్పేంటి?
వాస్తవముంటే బినామీ చట్టాన్ని ప్రయోగించండి
పదేపదే తామేదో కొత్తగా కనిపట్టినట్లు రికార్డులు చదువుతున్నారు.రిజిస్టేషన్లు జరిగిన డేట్లు చెబితే ప్రజలకు నిజమేమిటో తెలుస్తుంది. రాజధాని భూములపై ఎన్నికేసులు పెట్టాలో అన్నీపెట్టారు.ఎన్నికేసులైనా వేసు కోండి.. ఎంతమంది నైనా విచారించుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. మీరు చెప్పేదాంట్లో దమ్ముంటే బినా మీ చట్టాన్ని అమలుచేసి ఆ భూములు తీసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నపుడు కేసువేశారు.. ఓడిపోయారు. ప్రభుత్వం మారిపోయాక ఇన్ సైడర్ ట్రేడింగ్ అని చెప్పి కోర్టుల్లో చీవాట్లు తిన్నారా, మళ్లీ అరిగిపోయిన రికార్డు వేయడానికి సిగ్గనిపించడం లేదా? మీరు రాజ్యాంగానికి దూరంగా ఆలోచనలు చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు హక్కులు కల్పించిందెవరు?
ఎస్సీ,ఎస్టీ భూములు గురించి మాట్లాడుతున్నారు. రాజధాని ప్రకటన తర్వాత విడుదల చేసిన సర్క్యులర్ లో 2014కి ముందు ఎవరిపేరు ఉంటే వారికే సం బంధిత పరిహారంచెందేవిధంగా పొందుపర్చారు. దీని కి ఏంసమాధానం చెబుతారు? మీరు చెప్పేవన్నీ అవా స్తవాలనీ తేలిపోయింది, సుప్రీంలో కేసువేసే ధైర్యం లేదు.మీరు మాపై మాట్లాడతారా? మీకు ధైర్యం, చిత్త శుద్ధి ఉంటే ఈరాజధాని భూములపై కేసులు వేసిన మాదిరిగానే ఈమూడేళ్లలో విశాఖలో జరిగిన భూము ల క్రయ,విక్రయాలపై కేసులు పెట్టే ధైర్యం ఉందా? మీరు చెప్పిన వాళ్లకు భూములు రిజిస్ట్రర్ చేయడానికి సిద్దంగా ఉన్నాం.
సిగ్గులేకుండా మాట్లాడతారా?
రాజధాని ప్రకటనకు ముందు మేము భూములు కొని ఉంటే బుగ్గనకు గిప్ట్ ఇస్తా. చిత్తశుద్ధి ఉంటే వైట్ పేపర్ పెట్టమనండి.ఇంతపెద్ద ప్రభుత్వంలో రాజధాని ప్రకటన ఎప్పుడు వచ్చిందో,మేం భూములు ఎప్పుడు కొన్నామో డేట్లు తెలియదా,సిగ్గులేకుండా మాట్లాడతా రా?6-9-2014లో రాజధానిప్రకటన వచ్చింది.నేను భూములు కొన్నది నవంబర్‌లో.. ఇంకేం కావాలి?